వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/సెప్టెంబర్ 15, 2013 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు[మార్చు]

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించాల్సిన అంశాలు[మార్చు]

  1. వికీపీడియా:వికీప్రాజెక్టు/విద్య, ఉపాధి నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతి ప్రదానం.
  2. s:పోతన తెలుగు భాగవతము ప్రాజెక్టు ప్రగతి.
  3. వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టు ప్రగతి.
  4. వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం కొత్త ప్రాజెక్టు గురించి ప్రణాళిక, సలహాలు మరియు సంప్రదింపులు.
  5. తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవం తర్వాత 3-4 నెలలలో జరిగిన పురోగతి మీద నివేదిక తయారుచేయడం.
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు[మార్చు]

  • Rajasekhar1961 (చర్చ) 11:54, 3 సెప్టెంబర్ 2013 (UTC)
  • పైన మీ పేరు చేర్చండి

సమావేశానికి ముందస్తు నమోదు[మార్చు]

(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)

తప్పక
  1. Pranayraj1985 (చర్చ) 11:49, 3 సెప్టెంబర్ 2013 (UTC)
  2. Bharadwaj (చర్చ)
  3. S. Pavan kumar Svpnikhil (చర్చ) 12:32, 13 సెప్టెంబర్ 2013 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
  1. విష్ణు (చర్చ)16:31, 5 సెప్టెంబర్ 2013 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

పాల్గొనటానికి కుదరనివారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక[మార్చు]

  • అర్జునరావు గారు, విష్ణు గారు, విశ్వనాథ్ గారు స్కైప్ ద్వారా పాల్గొన్నారు.
  • ముందుగా వికీపీడియా:వికీప్రాజెక్టు/విద్య, ఉపాధి వ్యాసరచన పోటీ విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్వాహకులు హాజరైన ఇద్దరు విజేతలకు సర్టిఫికేట్స్, టీ-షర్ట్స్ ను బహుకరించారు. మొదటి మూడు బహుమతులు గెలుచుకున్న వారికి మనీఆర్డర్ ద్వారాను, సర్టిఫికేట్లను కొరియర్ ద్వారా పంపించాలని నిర్ణయించారు. శర్మగారు ప్రైజ్ మనీని అందజేయగా ప్రణయ్ రాజ్ పోస్టేజ్ బాధ్యతలను వహించారు.
  • విద్య, ఉపాధి వ్యాసరచన పోటీ వంటిదే మరో ప్రాజెక్టును రూపొందించాలని రాజశేఖర్ గారు ప్రతిపాదించారు. అందుకు అర్జునరావు గారు, విష్ణు గారు, విశ్వనాథ్ గారూ ఈ పోటీని మరింత ప్రణాలికాబద్ధంగా తయారుచేయడానికి తగిన సూచనలు అందించారు. హైదారాబాద్ లో ఉన్న కళాశాల ప్రిన్సిపాల్స్ ని సంప్రదించి, ప్రాజెక్టు వివరాలు ఆయా కళాశాలల నోటీస్ బోర్డులలో ఉంచడం ద్వారా ఎక్కువ మంది పాల్గొనేలా చేయోచ్చని బండి శ్రీనివాస శర్మ గారు సూచించారు. ఇందుకు కష్యప్ సహాయం చేయగలరని ముందుగానే తెలిపారు. అంతా అంగీకరించారు. కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు, ఇతర పనులు నెల రోజుల్లో పూర్తికావాలని చెప్పారు.
  • తెవికీ గురించి గ్రామీణా ప్రాంతాల వారికి తెలియజేయడం కోసం జిల్లా ముఖ్య పట్టణాలలో వికీ అవగాహన సదస్సులను నిర్వహించేందుకు CIS కృషిచేయాలని అర్జునరావు గారు సూచించారు. విష్ణు గారు సానుకూలంగా స్పందించారు.
  • పోతన తెలుగు భాగవతం వికీసోర్సులో జరిగిన పని గురించి రాజశేఖర్ గారు వివరించారు. ఎనిమిది స్కంధాలు పూర్తయైనవి. మిగిలిన 4 స్కంధాలు ఒక వారం రోజులలో పూర్తిచేస్తారని తెలియజేశారు. తర్వాత ప్రతి పద్యానికి టీకా ఎలా చేర్చాలి అనే విషయంపై చర్చించారు. టీకా మూసను అర్జునరావు గారు తయారుచేస్తానన్నారు. copy rights విషయంల్ సాంబశివరావు గారితో చర్చించి తర్వాత ఆడియో ఫైల్స్ మరియు గణంకాలను కూడా వికీపీడియాలో పొందుపరుస్తామని తెలియజేశారు.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టులో ప్రస్తుతం 24/56 వ్యాసాలు తయారైనవి. మిగిలినవాటి గురించి ప్రాజక్టును ఎక్కువకాలం కొనసాగించకుండా, కొంతకాలం నిర్ణీత వ్యవధి (లక్ష్యం) నిర్ణయించి ఆ వ్యవధి లోగా పూర్తిచేయాలని రాజశేఖర్ గారు అన్నారు.
  • ప్రపంచంలోని కళారూపాలన్నింటిని ఒకచోట చేర్చేందుకు వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం అనే ప్రాజెక్టును నిర్వహించదలచామని, ఇది ఒకటి రెండు నెలలు కాకుండా ఒకటి రెండు సంవత్సరాలు ఉండాలనుకుంటున్నామని రాజశేఖర్ గారు చెప్పగా, పెద్ది రామారావు గారు పేర్కొన్న బృహత్ లక్ష్యాలను తెలియజేశారు. విష్ణుగారు సమాచార సేకరణకు ఒక మూడు నెలల కాలంలో సమీకరించాలని, తర్వాత ఎలా ప్రాజెక్టును ముందుకు తీసుకొని వెళ్ళేది చర్చిస్తామని చెప్ప్పరు. ...కళారంగాలకు సంబంధించిన సంస్థలతో సంప్రదించి, వారితో ఈ పని చేయిస్తే బాగుంటుందని అర్జునరావు గారు సూచించారు.
  • తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవం తర్వాత 3-4 నెలలలో జరిగిన పురోగతి మీద నివేదికను ఎవరో ఒకరు ప్రారంభిస్తే మిగతావారు అందులో పాల్గొంటారని సూచించారు. నివేదిక ప్రారంభ బాధ్యతను రాజశేఖర్ గారు స్వీకరించారు.
  • చివరగా హాజరైన కొత్త సభ్యులకు వికీపీడియా మరియు ఇతర సోదర ప్రాజెక్టుల గురించి వివరాలు తెలియజేశారు.
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. రాజశేఖర్
  2. బండి శ్రీనివాస శర్మ
  3. ప్రణయ్ రాజ్ వంగరి
  4. ఎస్.వి.పి. నిఖిల్
  5. చెన్నమణికంఠేశ్వర
  6. పవన్ కుమార్
Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు
  1. విష్ణు
  2. అర్జునరావు
  3. విశ్వనాధ్

చిత్రమాలిక[మార్చు]