వికీపీడియా చర్చ:ఏకాభిప్రాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏకాభిప్రాయసాధన కోసం జరిగే చర్చలకు తగిన కోరం (Quorum) ఉండాలి.

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ అంశం మీద చర్చించడానికి సహాయపడవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను.
ఏదైనా ఒక చర్చలో చివరగా తీసుకొనే నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేలా చేయడానికి ఆ "చర్చలో హాజరు కావాల్సిన సాముదాయంలోని కనీస సభ్యుల సంఖ్య"ను కోరంగా పేర్కొంటారని మనకు తెలుసు. (Quorum is the minimum number of members of a community that must be present at any of its discussions to make the decisions of that discussion valid.) కోరం లేని చర్చలలో కంటే, తగినంత కోరం వున్న చర్చలలో తీసుకొనే నిర్ణయాలు, consensus అనే వికీ స్ఫూర్తికి మరింత అనుగుణంగా ఉంటాయి.

తగినంత కోరం లేకపోవడం వల్ల కొద్దిమంది మాత్రమే పాల్గొన్న చర్చలు వికీ సాముదాయిక ఏకాభిప్రాయ స్ఫూర్తిని నిజంగా అందుకోలేకపోతున్నాయి. అటువంటి నిర్ణయాలు వివాదాలకు దారితీయవచ్చు. ఎందుకంటే ఐదుగురు చర్చలో కూర్చొని చేసే నిర్ణయం కన్నా కోరం సంఖ్యకు తక్కువ కాకుండా చర్చలో కూర్చొని తీసుకొనే నిర్ణయం ఎప్పుడూ మెరుగుగానే ఉంటుంది. అది వివాదాస్పదం అయ్యే అవకాశాలు తక్కువే. అందువలన చర్చలో హాజరు కావాల్సిన సముదాయంలోని కనీస సభ్యుల సంఖ్య (కోరం) నిర్ణయించుకోవడం మంచిదని నా అభిప్రాయం.

గత ఉదాహరణలు చూస్తే యాంత్రిక విధానంపై తక్కువ మంది చర్చలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిర్ణయమైపోయిన సమీక్షా విధానంపై జరిగిన చర్చ మరొక ఉదాహరణ. ఇలాంటి విధానపరమైన నిర్ణయాలను చేయడానికి జరిగే చర్చలలో సముదాయం నుండి కనీస సంఖ్యతో వాడుకరులు హాజరు కాకపోతే అర్ధవంతమైన చర్చ కూలంకుషంగా ఎలా జరుగుతుంది ఆలోచించండి. నిర్ణయం ఆల్రెడీ జరిగింది అవి ఆమోదయోగ్యాలే అనుకుందాం. కానీ ఇటువంటి అతి ముఖ్యమైన పాలసీ మేకింగ్ చర్చలలో ఎంతమంది పాల్గొన్నారు? అన్నదే ముఖ్య ప్రశ్న. ఉదాహరణకు సమీక్షా విధానంపై జరిగిన చర్చ ఏ పద్దతిలో జరిగిందో చూద్దాం ఈ చర్చలో చదువరి (ప్రతిపాదకుడు), కశ్యప్, ప్రభాకర్ గౌడ్ గార్లు దానిలోని అంశాలపై చర్చించారు. పవన్ సంతోష్ గారు ఇతర విషయాలు అనగా ఇతర పద్ధతులలో నిర్ణయాలని సమీక్షించేది కూడా చేరిస్తే బాగుంటుందనగా, యర్రా రామారావు గారు అనుకూలంగా వ్యాఖ్యానించారు. చివరికి ప్రణయ్ రాజ్ గారు తరువాత చూడొచ్చు అన్నట్లుగా వ్యాఖ్యానించి నిర్ణయం చేశారు. ఏకాభిప్రాయం పేరిట కేవలం కొద్దిమంది మాత్రమే పాల్గొని వెలిబుచ్చుకొనే అభిప్రాయాలను విధాన నిర్ణయాలుగా ప్రకటిస్తూ పోతూంటే రేపు ఎవరైనా ఈ పద్దతిలో ఔచిత్యాన్ని, విజ్ఞతను, నైతికతను ప్రశ్నించకుండా ఉండలేరు.

విధాన నిర్ణయాలు గైకొనడానికి, కొద్దీమంది సభ్యుల మధ్య జరిగే విధానంగా కాకుండా బహుజన సమ్మతిగా ఉండడానికి చర్చలలో కోరం ఉంచడం ప్రతీ చోటా జరిగేదే. దానికోసం ఒక చర్చలో హాజరు కావాల్సిన సముదాయంలోని కనీస సభ్యుల సంఖ్యను కోరంగా నిర్ణయించుకోవడం మంచిదని నా అభిప్రాయం. కనుక ఈ అంశం మీద చర్చించవలసిందిగా వాడుకరులును, దానికి సహాయం చేయవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను.
--Vmakumar (చర్చ) 15:02, 2 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

@Vmakumar: గారూ,
  • మీరు ప్రస్తావిస్తున్న సమీక్షా సంఘం పాలసీ దాకా రావడానికి ముందు, అసలు సంఘం ఉండాలా వద్దా అన్నదానిపై 12 మంది చర్చించి నిర్ణయం చేశారు. ఈ చర్చ చూడండి తెవికీలో నిర్ణయాలకు ఒక సమీక్షా సంఘం ఉండాలన్న విషయం నిర్ణయమైనది 12 మంది చర్చలో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించగా, ప్రతిపాదకులూ, చర్చలో అభిప్రాయాలు వ్యక్తం చేసినవారూ కాని వేరెవరైనా వచ్చి నిర్ణయం వెలువరించాలని నేను అభ్యర్థించగా, స్వరలాసిక గారు వచ్చి ఏర్పాటు చేయాలని నిర్ణయం వెల్లడించారు. ఈ విషయం వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం పేజీలోనే లింకు సహితంగా ప్రతిపాదకులు చదువరి గారు ఇచ్చారు. మీరు ఆ లింకు తెరిచి చూసి ఉండకపోయివుండవచ్చు, కాబట్టి ఆ ప్రకారం మీరు రాసినదానిలో స్పష్టత అవసరం.
  • ఇక ఆఖరులో నేను చేర్చిన ప్రతిపాదన, దానికి నిర్ణయం చేసిన ప్రణయ్‌రాజ్ గారి వ్యాఖ్య చూస్తే ఇలాంటి విషయాల్లో ఎలా నిర్ణయం తీసుకోవాలన్న దానికి ఒక ఉదాహరణ దొరుకుతుంది. ఈ సమీక్షా సంఘం అన్నది నిరోధ నిర్ణయాల సమీక్ష కోసం అన్నట్లు పన్నెండు మంది సూత్రప్రాయంగా ఆమోదించారు కాబట్టి నేను ఇందులో కొత్తగా మరో ముఖ్యమైన అంశం చేర్చాలని చర్చలో కోరితే అది తర్వాత్తర్వాత వేరుగా ప్రతిపాదించుకోవచ్చన్న సూచన చేస్తూ తీర్మానించారు, తప్పించి హఠాత్తుగా ఒక కొత్త విషయాన్ని తీసుకువచ్చి "చర్చలో నిలబడింది" అని ప్రకటించెయ్యలేదు. ఇలాంటి స్ఫూర్తిని ప్రదర్శించినందుకు నా ప్రతిపాదన విషయమై వాయిదా వేసినా ఈ సందర్భంగా ప్రణయ్‌రాజ్‌ గారిని అభినందిస్తున్నాను.
కాబట్టి, ఈ రెండు విషయాలను మీరు పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 16:28, 2 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం పేజీ అంటే వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం ను నేను పూర్తిగా రాయలేక క్లుప్తంగా "సమీక్షా విధానం" పేజీ గా ఉదహరించడం జరిగింది. మీరు చెప్పినట్లుగా తెవికీలో ఒక సమీక్షా సంఘం ఉండాలి అనేది ఒక విధానం నిర్ణయంగా ఒకానొక చర్చలో ప్రకటించారు. దానిని 12 మంది చర్చించి నిర్ణయం చేశారు. ఆ చర్చ ముగిసింది కదా. అంతవరకూ బాగానే వుంది. దానిని ప్రస్తావించడం లేదు. 12 మంది పాల్గొన్నారు ఒక నిర్ణయం తీసుకొన్నారు.ఓకే

ఇప్పుడు నేను లేవనెత్తిన అంశం వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం అనే ఇటీవలి చర్చకు సంబంధించినది. ఈ చర్చలో ఒక విధానపరమైన నిర్ణయం ప్రణయ్ రాజ్ గారు ప్రకటించారు కదా. మరి ఇటువంటి నిర్ణయానికి కారణమైన చర్చలో ఎంత మంది పాల్గొన్నారు అన్నది నా ప్రశ్న. "వాడుకరి నిరోధాల సమీక్షా సంఘం" యొక్క ఎలా వుండాలి, నిర్మాణం, నిబంధనలు, మార్గదర్శకాలు, విచారణ అనేవి అత్యంత కీలకమైన అంశాలు. ఒక సంస్థను ఉనికిలో తెస్తున్నప్పుడు అనేక కోణాలలో విశ్లేషించాలి. చర్చ విస్తృతంగా జరగాలి కదా! ఇంకొక ఉదాహరణతో చెపుతున్నాను. రిజర్వేషన్స్ కల్పించాలి అనేది పాలసీ మేటర్ అయితే, ఆయా రిజర్వేషన్స్ కల్పించడానికి కావలిసిన నియమ నిబంధనలను, ఎవరికీ, ఎలా, ఏ రీతిలో, కల్పించాలి అనే మార్గదర్శకాలను రూపొందించే విధానం కూడా పాలసీ మేటర్ అవుతుంది. రెండవ పాలసీ మేటర్ ని ఒకవేళ క్షుణంగా చర్చించకుండా ఆమోదిస్తే తరువాత రకరకాల లుకలుకలు బయలుదేరి మొత్తం గందరగోళం అవుతుంది. అందుకే ప్రతీ పాలసీ ని విడిగా చూస్తాం కనుకనే రెండవసారి చదువరిగారు అనుకుంటా చర్చకు పెట్టారు. ఇక్కడ మొదటి పాలసీ మేటర్ ని 12 మంది చర్చించారు కాబట్టి రెండవ పాలసీ మాటర్ ని ఐదుగురు చర్చించినా పరవాలేదు అనుకోవడం సమంజసం ఎలా అవుతుంది. అయినప్పటికీ ఆ సంఘం నిర్మాణ ప్రవర్తనా నియమావళి పై చర్చ ముగిసి నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఇక దాన్ని గురించి లేవనెత్తిన ఉపయోగం లేదు. అయితే ఈ చర్చా పేజీలో ఉదహరిస్తున్నది దేనికంటే సమీక్షా సంఘం కోసం రూపొందించిన కీలక అంశాలపై జరిగిన విధాన పరమైన చర్చలో - కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే పాల్గొన్నారు అన్న ఉదాహరణ మాత్రమే చెపుతున్నాను. నా పాయింట్ కేవలం ఒక విధాన చర్చపై ఐదుగురు మాత్రమే పాల్గొన్నారు. ఇంకా ఎక్కువమంది చర్చ పాల్గొని వుండాల్సింది అనేదే. స్పష్టంగా ఇదే.

సమీక్షా విధానం ఉండాలి అన్నదానిని సమర్ధిస్తూ సభ్యుడు:C.Chandra Kanth Rao గారు ఇచ్చిన సమాధానం చూడండి. (అప్పటికీ ఒక సమీక్షా సంఘం అనేది ఏర్పడకపోయినప్పటికీ, ఒకవేళ ఏర్పాటయితే దాని structure, formation తీరు తెన్నులు ఎలా ఉండాలి అనే దానిని విశ్లేషించి ఎలా చెప్పారో చూడండి.)

నిర్వాహక చర్యలపై సమీక్షావిధానం ఉండాలి. ప్రతి నిర్వాహక చర్యకు సమీక్ష ఉండాలా లేక బాధితుడు కోరితేనే సమీక్ష చేయాలా? (నిషేధానికి గురైన బాధితుడు సమీక్ష కోరుట సాధ్యం కాదుకదా!) సమీక్ష ఆధారంగానే చర్యలు తీసుకోవాలా? (కోర్టు తీర్పుల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లుగా) లేక చర్యల అనంతరం సమీక్ష చేయాలా? (ఇది కొంత ఇబ్బందే) సమీక్ష చేసేవారికి ఉండే బాధ్యతలు ఏమిటి? సమీక్ష అనంతరం సమీక్షనే పొరపాటు అంటూ ఆధారలతో సహా ఎవరైనా చర్చ తీస్తే? నిర్వాహకులు చేసే చర్యలపై నిష్పక్షపాతంగా సమీక్ష చేసే సభ్యులను ఎలా గుర్తించాలి? ఇచ్చిన సమీక్షను నిర్వాహకులు అంగీకరించకపోతే? నిర్వాహకులపై తీసుకొనే చర్యలు ఎలాంటివి? సమీక్షపై క్షమాభిక్ష అధికారం కూడా ఉంటుందా? సమీక్షామండలిలో అనేది సింగిల్ బెంచ్‌నా, డివిజన్ బెంచ్‌నా లేక ఫుల్ బెంచ్‌నా? సమీక్షా మండలి కాలం ఎంత? ఇది నియామకమా లేక ఎన్నిక విధానమా? సమీక్షామండలి సభ్యులకు ఉండాల్సిన అర్హతలేమిటి? సభ్యులందరూ ఒకరితో ఒకరు పరిచయాలున్నప్పుడు వారిలో నుంచే సమీక్షామండలిలో చేరిన సభ్యులైతే సరైన నిర్ణయం వెలువడుతుందా? సమీక్షామండలి అధికారాలను ఎలా నిర్ణయించాలి. సమీక్షామండలి నిర్ణయం అనంతరం నియమావళిని ముందుతేదీ నుంచి మార్పుచేస్తే అప్పుడేం చేయాలి? సమీక్ష చేసే సమయానికి సమీక్షసంఘం సభ్యుడు సెలవులో ఉంటే? సమీక్ష అనంతరం తీర్పు బాధితుడికి అనుకూలంగా వచ్చినప్పుడు నిర్వాహకులు తమకు అన్యాయం జరిగింది అన్నప్పుడు సూపర్ సమీక్ష (?) కూడా ఉండాలా? ... ఇలా ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకొంటే బాగుంటుంది.- సి. చంద్ర కాంత రావు- చర్చ 17:41, 24 మే 2020 (UTC)

పవన్ సంతోష్ గారు పై విశ్లేషణను అన్ని కోణాలలో ఆలోచించగల సీనియర్ వికీపీడియన్స్ చక్కగా చేయగలరు. దీనికి వాడుకరి:Chaduvari గారు స్పందించి అంతే దీటుగా నియమావళిని రూపొందించారు. అయితే ఆ విధంగా రూపొందించిన సంఘం నిర్మాణ ప్రవర్తనా నియమావళి పాలసీ మ్యాటర్ మీద ఎంత మంది చర్చించారు? అన్నదే నా ప్రశ్న. అక్కడ పాలసీ మ్యాటర్ లో 12 మంది చేసాం. ఇక్కడ పాలసీ మ్యాటర్ లో ఐదు మంది చర్చించినా పరవాలేదు అనుకుంటే ఎలా అండీ. ఇది గిలెటిన్ పద్దతిలో తేల్చి చేయాల్సిన చర్చలు కాదు కదా! ప్రతీ పాలసీ మ్యాటర్ లోను క్షుణంగా, అన్ని కోణాలలో కూలంకుషంగా చర్చించాలన్నదే నా అభిమతం. ఇలా తక్కువ మంది హాజరైతే చర్చ క్షుణంగా నడవదు. ఇలా ఐదుగురితో విధానాలను రూపొందిస్తే, సాధారణ విధానాలు కాకుండా ప్రధాన విధానాలను చేయడం మొదలుపెడితే, దానిలోని లొసుగులు ఒకటొకటి తరువాతకాలంలో కనిపిస్తాయి. లుకలుకలు బయలుదేరతాయి. ఈ లొసుగులను చూసినమీదట తరువాత కాలంలో కొత్త వాడుకరులు ఎవరైనా అలా నిర్ణయం చేసిన పద్ధతి లోని హేతుబద్దతను ప్రశ్నించడం మొదలుపెడతారు. సమంజసతను తిరగతోడుతారు. పైగా తగిన కోరం లేనప్పుడు చర్చల ద్వారా నిర్ణయించే పద్దతి దుర్వినియాగం కావడానికి అవకాశాలున్నాయి. --Vmakumar (చర్చ) 18:31, 2 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కుమార్ గారు, నమస్తే ఈమధ్య అన్ని చర్చల్లో పాల్గొన్నారు, మీకు అభినందనలు ఇది ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను. తెవీకిలో సభ్యుల సంఖ్య చాలానే ఉన్నా చర్చలలో పాల్గొనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది మీరు గమనించే ఉంటారు అయితే ఒక అంశం మీద ఆసక్తి ఉన్నవారు కూడా సమయాభావం వల్ల మరి ఇతర కారణాల వల్ల కావచ్చు ఈ చర్చలో పాల్గొనడం లేదు. అయితే పైన తగిన కోరం లేనప్పుడు చర్చల ద్వారా నిర్వహించే పద్ధతి దుర్వినియోగం కావడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. చర్చలో పాల్గొనండి. అని ఎంత విజ్ఞప్తి చేసింది. స్పందించేవారు లేనప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు. చుట్టూ సముద్రం ఉన్న అందులో ప్రయాణించాలి అంటే మన ఇంటి నుండి తాగే నీరు తీసుకుని పోయినట్లే ఉంది మన కథ. ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది సభ్యులు పాల్గొంటారన్న ఈ విషయంలో ఏమిటి మీ నమ్మకం. అయితే మీరు అనేది చర్చ మళ్లీ జరగాలని కోరుకుంటున్నావా, అర్థం కాలేదు వివరించండి. --ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)19:10, 2 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vmakumarగారూ, సరైన సమయంలో సరైన విధంగా చాలా మంచి చర్చ లేనవెత్తారు. ప్రారంభంలోనే మీరన్నట్టు ఈ చర్చలో అధికమంది పాల్గోలేరు (ఉండాలా లేదా అనే దానికి మాత్రమే 12 సభ్యులు పాల్గొన్నారు) కాని నియమం అమలులోకి వచ్చింది. ఇలా కొద్దిసంఖ్యలో మాత్రమే సభ్యులు పాల్గొన్న చర్చలలో మంచి నిర్ణయం వెలువడదనే అభిప్రాయానికి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మరి నేనెందుకు పాల్గొనలేకపోయాననేది ముందుగా వివరిస్తాను. ఇటీవలి చర్చల ధోరణి మీకు పూర్తిగా తెలుసు. తెవికీ దృష్ట్యా ఏది చెప్పిననూ వ్యతిరేక ధోరణి ప్రదర్శించడమే ఇక్కడ కొందరికి అలవాటుగా మారింది. హుందాతనం పూర్తిగా లోపించింది. ఒప్పయినా తప్పయినా తమ వాదనే సరైనదనే ధోరణి ప్రబలంగా ఉంది. తమకు వ్యతిరేకంగా (తెవికీకి వ్యతిరేకం కాదు) ఉన్నవారిని ఇంటికి సాగనంపుట కూడా సాధారణమైపోయింది. తెవికీ అంటే ఏ కొందరి సొత్తు కాదు అందరిదీ అనే భావన కొందరిలో లేకపోవడం శోచనీయమైన విషయంగా చెప్పాల్సివస్తుంది. ఏ పాలసీ అయిన పలురకాలుగా ఆలోచించి సభ్యులు చెప్పిన అభిప్రాయాలకు విలువిస్తేనే వ్యవస్థ మనుగడ సాఫీగా సాగుతుంది, సమూహం కూడా తమ అభిప్రాయాలకు విలువిచ్చారనే ఉత్సుకతతో మరింత ఉత్సాహంతో కృషిచేసే అవకాశం ఉంటుంది. ఇదివరకు తెవికీలో ఉన్న ప్రజాస్వామ్య పద్దతులు ఒక్కొక్కటిగా మాయమౌతూపోవడం విచారించదగ్గ విషయం. ఒకానొకప్పుడు తెవికీ స్వర్ణయుగంలో ఉన్నప్పటి దశకూ ఇప్పటి దశకూ తేడా ప్రస్పుటంగా కనిపిస్తోంది. సుమారు 20 నెలల క్రితం కూడా వికీపీడియా చర్చ:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణపాలసీపై వ్యతిరేకత చూపాను. అది అవసరం లేదన్నాను. కారణం చూపాను, నా అభిప్రాయాలు వివరించాను. ఆ పాలసీ చేయడం బదులు నా నిర్వాహకహోదా తొలగించమన్నాను. కాని చివరికేమైంది? అభిప్రాయాలన్నీ చెత్తబుట్టలోకి వెళ్ళి పాలసీ అమలులోకి వచ్చిననూ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఉపయోగించలేకపోయారు (మాట ప్రకారం నా నిర్వాహకహోదా మాత్రం త్యజించాను). పాలసీలు ఉపయోగించనప్పుడు సభ్యుల విలువైన కాలాన్ని హరించివేసి పాలసీలు చేయడమెందుకు? మరి అందరూ ఆ పాలసీకి అనుగుణంగా చేస్తున్నారంటే అస్సలు కాదు. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. గత కొంతకాలంగా తెవికీ మూల నియమాలకు విరుద్ధమైన పాలసీలు కూడా రూపుదిద్దాయి. ఎలాగంటే ఇప్పుడు ఈ పాలసీ అయినట్లే. తెవికీ దృష్ట్యా ఎవరైనా ఏదైనా చెబితే "మాటలు రావమ్మా తిట్ల పురాణమే" తరువాయి. ఇదీ ప్రస్తుత తెవికీలో కొనసాగుతున్న ధోరణి. ఇప్పటి ధోరణికి విసిగిపోయి నాయకత్వం చేతులు మారాలని కూడా నేను స్పష్టంగానే చెప్పాను. తెవికీలో హుందాతనం కల్గి బాధ్యతతో అందరినీ కలుపుకుంటూ వెళ్ళే సభ్యులు కూడా ఉన్నారు, వారెవరో కూడా సూచించాను. రోజురోజుకు తెవికీ ఊబిలోకి దిగజారడమే కాని ఒడ్డుకు వచ్చే/తెచ్చే పరిస్థితి లేనేలేదు. నాణ్యత పూర్తిగా దిగజారుతోంది కాని ఇటీవలి ఒక చర్చలో నాణ్యతపైనే ఎదురుదాడి జరిగింది. నాకు సమయం లేనందున ఆ చర్చలో ఎక్కువగా పాల్గొననలేకపోయాను కాని అక్కడా మీరు, అర్జునగారు, దేవుడుగారు చెప్పిన అభిప్రాయాలలో చాలా విలువైన సమాచారం ఉంది. ఆ చర్చ కారణంగా అనవసరంగా ఎలాంటి పొరపాటు లేనిదే ఒక చురుకైన సభ్యుడిని కోల్పోవడం తెవికీకి నష్టదాయకంగా చెప్పవచ్చు. ఇటీవలి తెవికీ లోపాల గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే వ్రాయవచ్చు. ఇక ఈ పాలసీ గురించి చెప్పాలంటే పూర్తిగా తప్పులతడకగా ఉంది. తప్పులేమిటనేవి చెప్పడం కూడా వృధా ప్రయత్నమే కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఏమీ చెప్పదల్చుకోలేను. సరైన ప్రణాళికతో చేయని ఆ పాలసీ అమలు సమయంలో వివాదాలు రావడం సమంజసమే కాబట్టి అప్పుడు లోపాలు లేవనెత్తవచ్చు. మరిన్ని విషయాలు తదుపరి చర్చలలో వివరించగలను. ధన్యవాదములతో ... సి. చంద్ర కాంత రావు- చర్చ 20:24, 2 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
 ప్రభాకర్ గౌడ్ నోముల గారు నమస్తే. మీ అభిమానానికి ధన్యవాదాలు. ఈ మధ్యనే చర్చల మూలంగా మనం ఆత్మీయులవుతున్నాం.
  • నేను పాత చర్చ మళ్లీ జరగాలని కోరుకుంటున్నావా అని అడుగుతున్నారు. అటువంటిది ఏం లేదండీ ప్రభాకర్ గౌడ్ గారు. నా దృష్టిలో సమీక్షా సంఘం గురించి చర్చ గతం గతః: దాని గురించి ఇప్పుడు చర్చించడం నా దృష్టిలో ఉపయోగం లేదు. చర్చలో ఒకసారి నిర్ణయమైంది. ఇక అది సముదాయం తీసుకొన్న నిర్ణయంగానే భావిస్తాను. అందరం ఆ నిర్ణయాన్నీ అంగీకరించాలి అంతే. అలాగే పాత చర్చను తవ్వుకుంటూ పోతే ఇక ముందుకెళ్లలేం. అయితే ఆ చర్చలో ఐదుగురు మాత్రమే పాల్గొన్నారు. ఆ ఒక్క పాయింట్ మాత్రమే నేను ఇక్కడ ఉదహరిస్తున్నాను. అదీ కూడా ప్రస్తుత చర్చ కోరం ఆవశ్యకతను చెప్పేందుకే.
  • కొన్ని పాత చర్చలలో ఐదారుగురు సభ్యులు చర్చలో కూర్చొని తమ మెజారిటీ అభిప్రాయాలని నిర్ణయాలు ప్రకటిస్తూ పోవడం జరిగింది. అప్పటి పాతరోజులు పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు. చర్చలలో పాల్గొనే సభ్యులూ పెరుగుతున్నారు. పాత చర్చలలో పాల్గొనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కోరం అనే ప్రశ్న ఉదయించలేదు. ఇప్పుడు అలా కాదు. అయితే కొంతమందికి ఎందుచేతనో పాత పద్ధతిలోనే నిర్ణయాలు చేయడం సులభంగా వున్నట్లు కనిపిస్తుంది. దానిలో ఎవరి ఇంటరెస్ట్‌లు ఏమిటనేది స్పష్టంగా తేలడం లేదు. అయితే ఆ సులభమైన పద్దతికి అంటిపెట్టుకోవడంలో ఏదైనా సరైన ప్రాతిపదికలు ఉన్నాయా, ఉంటే వాటి హేతుబద్ధత ఎంతవరకు అనేది చూద్దాం. పరిస్థితులు మారుతున్నప్పుడు మనం అవలంబించే పాత పద్దతులు కూడా మార్చుకోవడంలో మన విజ్ఞత కనిపిస్తుంది.
  • చర్చలో పాల్గొనండి. అని ఎంత విజ్ఞప్తి చేసినా స్పందించేవారు లేనప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు? - ఇది చాలా మంచి ప్రశ్న వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, వాడుకరులు స్పందించేవారు లేరు అనడానికి ముందుగా మనం వాళ్లను పాల్గొనేలా చేయడం కోసం మన వైపు నుంచి ఏం చేసాము ఇంతవరకు అనేది చూడాలి. మన క్రియాశీలక నిర్వాహకులు ఆ దిశలో సరైన ప్రయత్నాలు (concrete efforts) ఏమైనా ఇంతకుముందు చేశారా! లేదా! అన్నది చర్చిద్దాం. అయితే ఆ దిశలో ప్రయత్నిస్తేనే అర్ధవంతమైన చర్చలు డెమోక్రాటిక్ స్పూర్తితో జరుగుతాయి. మరింత ఎక్కువ మంది సభ్యులను చర్చలలో పాల్గొనడానికి నిర్వాహకులు చేసే సత్ప్రయత్నాలకు ఏమైనా ఆటంకాలు గాని, institutional problems గాని ఎదురవుతున్నాయా? ఎదురైతే అవి ఏమిటి? వాటిని ఎంతవరకు మనం మినిమైజ్ చేయగలమా చూడాలి. నిర్వాహకులు కూడా స్పష్టంగానే స్పందిస్తారని ఆశిద్దాం. సరిదిద్దుకొనే మార్గంలోనే చర్చిద్దాం.
  • ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది సభ్యులు పాల్గొంటారన్న ఈ విషయంలో ఏమిటి మీ నమ్మకం.-- సర్ స్పష్టంగా ఆశావాదంతో ముందుకు వెళదాం. ఎక్కువ మంది పాల్గొనకపోతే, పాల్గొనేలా చేయడానికి ఇంకా మనవైపు నుండి ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. ప్రతీ సమస్యకూ పరిష్కారముంటుంది. అతను పాల్గోవడం లేదు అంటే లోపం అతనితోనే కాదు మనలో కూడా ఉండవచ్చేమో. ఆ కోణం నుంచి ఆలోచిద్దాం. లోపం అటువైపు నుంచి అయితే దాన్ని మనం చేసేదేమీ లేదు. ప్రయత్న లోపం మనవైపు నుంచి ఉందా అనే కోణంలో నుంచి కూడా చూద్దాం. అసలు ప్రాధమికంగా మనం ఇక్కడ చర్చ చేస్తున్న సంగతి గురించి అతనికి (ఓ సాధారణ వాడుకరికి) తెలుస్తూందా? అనే ప్రాధమిక విషయం నుంచి చర్చించడం మొదలుపెడితే ఎంతో కొంత ఫలితం రావచ్చు. Every step begins a journey, and this one is for us. ఒకవేళ ఇప్పుడు మన ప్రయత్నాలు విఫలం అయినా మన తదుపరి ప్రయత్నాలకు ఈ చర్చ లోని విశ్లేషణ కొంత వరకు ఉపయోగపడుతుంది. --Vmakumar (చర్చ) 00:52, 3 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Vmakumar: గారూ! //పవన్ సంతోష్ గారు పై విశ్లేషణను అన్ని కోణాలలో ఆలోచించగల సీనియర్ వికీపీడియన్స్ చక్కగా చేయగలరు. దీనికి వాడుకరి:Chaduvari గారు స్పందించి అంతే దీటుగా నియమావళిని రూపొందించారు. అయితే ఆ విధంగా రూపొందించిన సంఘం నిర్మాణ ప్రవర్తనా నియమావళి పాలసీ మ్యాటర్ మీద ఎంత మంది చర్చించారు? అన్నదే నా ప్రశ్న. అక్కడ పాలసీ మ్యాటర్ లో 12 మంది చేసాం. ఇక్కడ పాలసీ మ్యాటర్ లో ఐదు మంది చర్చించినా పరవాలేదు అనుకుంటే ఎలా అండీ// ఫరవాలేదు అని నేను అనలేదండీ. ఆ విధానం ఉండాలా వద్దా అన్నదాని మీద 12 మంది స్పందించారన్న విషయం మీరు పరిగణనలోకి తీసుకున్నారా లేదా అని సందేహం వచ్చి మీకు గుర్తుచేశాను. మీకు ఆ విషయం తెలిసే ఉందనీ, ఆ చర్చ చదివారనీ ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది. అందులో చంద్రకాంతరావు గారు మాట్లాడినవీ చూశారు, చదువరి గారు తయారుచేసిన విధానమూ అందుకు దీటుగా ఉందని గమనించారు. చర్చలో 5 గురు మాత్రమే పాల్గొనడమే మీకు సమస్య ఉందని ఇప్పుడు వివరించారు. సంతోషం. ఆ ముక్కే ముందు ఉండివుంటే నేనసలు ఆ విషయం ప్రస్తావించేవాడిని కాదు. ఇప్పుడు అక్నాలెడ్జ్ చేసినందుకు ధన్యవాదాలు.
రెండో అంశం మీరు స్పందించనే లేదు. ఒక చర్చ అంటూ జరిగినప్పుడు అందులో తగినంత చర్చ జరగని అంశాన్ని వేరుగా ప్రతిపాదించుకొమ్మని తిరస్కరించడం ఒక మంచి విషయమే కదా?
నా ఉద్దేశం నేను చెప్పిన రెండు విషయాలూ మీ కోరం ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాయనీ, వ్యతిరేకిస్తున్నాయనీ కాదు. మీరొక ఉదాహరణ తీసుకువచ్చినప్పుడు దానిలో ఉన్న అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని రాస్తే ఆ చర్చ సఫలీకృతం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఇక్కడ మీరు ప్రాసెస్‌ని చర్చిస్తున్నారని నాకు అర్థమైంది. ఐనా, విషయంతో సంబంధం లేని పద్ధతిపై చర్చ ఫలప్రదమవడం కష్టం. ఇప్పుడు - మీకు ఇలా పన్నెండుమంది అలాంటి పద్ధతి ఒకరుండాలని, ఐదుగురు ఆ పద్ధతి ఎలా ఉండాలని చర్చించడం నచ్చలేదు అనుకుందాం. ఈ ఐదుగురూ పద్ధతి ఇలా ఉండాలని చర్చించి చేసేశారు, అందులో ఫలానా అంశం అసలు సరిగా లేదు కదా. అని మీరు ఎత్తిచూపగలిగితే మీరు మాట్లాడుతున్నదానికి పరిపూర్ణత వస్తుంది. ఈ చర్చల్లో పాల్గొని నిర్ణయంలో పాలుపంచుకున్నవాడిగా నాకైతే ఉదాహరణ తెచ్చినప్పుడు ఆ లోటు ఏమిటో కూడా మీరు చెప్పగలిగితే బావుంటుందనే అనిపిస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 07:18, 3 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Santhugavision mission ngo's /npo's

[మార్చు]

Santhuga vision mission programs Thotamala santhosh kumar (చర్చ) 12:31, 30 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]