Jump to content

వికీపీడియా చర్చ:రచ్చబండ (పత్రికా సంబంధాలు)/2022 డిసెంబరు ప్రెస్‌నోట్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసాల ప్రచురణ గురించి

[మార్చు]

ఈ పేజీని సృష్టించి, తెవికీ లోని కొన్ని విశిష్టతల గురించి ప్రెస్‌నోట్ డ్రాఫ్టు తయారు చేసిన @Chaduvari గారికి, సవరణలు చేసిన @యర్రా రామారావు గారికి, తెవికీ ప్రస్థానం గురించి రాసిన @Kasyap గారికి నా ధన్యవాదాలు. మిగతా సభ్యులు కూడా ఈ ప్రెస్‌నోట్ లో తగు మార్పుచేర్పులు చెయ్యవలసినదిగా కోరుతున్నాను. ప్రెస్‌నోట్ గురించి కొన్ని అభిప్రాయాలు కింద రాస్తున్నాను.

  • వికీ సభ్యుల సహకారంతో నవంబరు 30వ తేదీలోపు ప్రెస్‌నోట్ పూర్తికావాలి.
  • నవంబరు 25 నుండి 30వ తేదీ వరకు పత్రికల వారిని (ఎడిటర్లు, విలేకరులు) సంప్రదించి, వారికి తెవికీ విశిష్టతల గురించి చెప్పి పత్రికల్లో వ్యాసాలు వచ్చేలా సహకారం కోరాలి. అందుకు ఎవరెవరికి ఏఏ పత్రికల వారితో పరిచయం ఉన్నదో, వారి పరిచయంతో మనం అనుకున్నవిధంగా పత్రికల్లో వ్యాసాలు వచ్చేందుకు అవకాశం ఎంతమేరకు ఉన్నదో చూసుకోవాలి.
  • డిసెంబరు 10 (రెండవ శనివారం) తెవికీ పుట్టినరోజు కాబట్టి, ఆ తేదీకి అటూఇటూ ఒకటిరెండురోజులలో (డిసెంబరు 8 నుండి 12 వరకు) వ్యాసాలు వచ్చేలా చూడాలి.
  • ఈ సమాచారం ఒక వార్తలాగా కాకుండా ప్రత్యేక వ్యాసంగా ప్రచురించబడాలి. అందుకు ఆదివారం ప్రత్యేక సంచిక (సండే మ్యాగజైన్)లో ప్రచురించబడడం అనేది ప్రథమంగా పెట్టుకొని, అలా వీలుకానిపక్షంలో మెయిన్ పేపరులోని ఎడిటోరియల్ పేజీలోగానీ, సాంకేతిక అంశాలు ప్రచురించే పేజీలోగానీ ప్రచురించబడేలా చూడాలి.
  • ఈ పేజీ లింకును పత్రికల వారికి ఇవ్వడమా, లేక ఇందులోని విషయం మొత్తాన్ని కాపీ చేసి వర్డ్ ఫైల్ లో పంపించడమా అనేది నిర్ణయించుకోవాలి.

-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:39, 19 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాలకు ఆర్టికల్ నేను రాస్తున్నాను.అది (పత్రికా సంబంధాలు)/2022 డిసెంబరు ప్రెస్‌నోట్ లో పరిశీలించటానికి రేపు కూర్పు చేస్తాను. అలాగే మిగతా వాటికి ఏవరైనా విడివిడిగా రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 14:13, 19 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో జరిగే ప్రాజెక్టులు, అందించే బహుమతులు, చేపట్టే ఛాలెంజింగ్ లను గురించి కొంత చేర్చాను గమనించగలరు. మార్పులేమైనా ఉంటే సరిదిద్దగలరు. -అభిలాష్ మ్యాడం (చర్చ) 16:36, 19 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రాజెక్టు పేజీలో "తెలుగు వికీపీడియాలో మన గ్రామాల ప్రస్థానం" అనే దానిపై నాకు తెలిసినంతవరకు ప్రెస్ నోటులో భాగంగా రాసాను. దానిలో చేయవలసిన మార్పులు గురించి పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 05:37, 20 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

డిసెంబరు 10న ఇరవయ్యోవసంతంలోకి అడుగుపెడుతున్నతెలుగు వికీపీడియా సంగ్రహంగా ప్రెస్ నోట్ ఇచ్చాను. పరిశీలించగలరు.--Muralikrishna m (చర్చ) 07:25, 28 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మురళీకృష్ణ గారూ అన్ని వివరాలతో క్లుప్తంగా బాగుంది. యర్రా రామారావు (చర్చ) 13:52, 28 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు గురువుగారు Muralikrishna m (చర్చ) 15:23, 28 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]