వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/ఆంధ్ర ప్రదేశ్ లో మండల పేజీల సృష్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దారిమార్పు[మార్చు]

వాడుకరి:యర్రా రామారావు గారికి, మీరు చేసిన దారిమార్పు పేజీ వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/మండలాలకు ప్రత్యేక పేజీల సృష్టి మరల పరిశీలించండి. తెలుగు రాష్ట్రాలు వేరైనాక, రెcడింటికి సంబంధించిన పనిచేసే వారు తక్కువమంది వుంటారు. నేను ఇటీవల ప్రకాశం జిల్లా మండలాల పేజీలు పరిశీలిస్తుంటే, చిట్టాలో తెలిపిన అంశాలు చాలావరకు పూర్తికాలేదు. నేను కొంతవరకు సవరించాను. కనుక ప్రతి రాష్ట్రానికి వేరేపేజీ ద్వారా పని ప్రణాళిక వేసుకోవడం, పురోగతిని చూడడం మంచిదనిపిస్తుంది. మీ దారిమార్పు మరల పరిశీలించండి.--అర్జున (చర్చ) 12:21, 20 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ తెలంగాణ గ్రామాలు అని అంతక ముందే ఉన్నందుననూ,తెలంగాణలో మండలాలకు ప్రత్యేక పేజీలు సృష్టింపు పని పూర్తి అయినందున స్థితి వివరాలు రికార్డు చేద్దామనే అభిప్రాయంతో దారిమార్పు చేసాను.ఆంధ్రప్రదేశ్లో స్థితి వివరాలు పరిశీలించి,ప్రస్తుత స్థితి వివరాలు రికార్డుచేసి,మిగిలిన పని చేపడదామని అని అనుకుంటున్నాను.వేరే సౌలభ్యం కోసం తిరిగి యధాస్థితికి తీసుకురావలనుకుంటే దారిమార్పు తొలగించినా నాకు అభ్యంతరం లేదు.--యర్రా రామారావు (చర్చ) 12:52, 20 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు, మీ స్పందనకి ధన్యవాదాలు. పాత స్థితికి చేర్చాను.--అర్జున (చర్చ) 04:32, 21 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ ప్రాజెక్టు పేజీలో ఇంతకు ముందున్న చరిత్ర (పేజీ సృష్టింపు నుండి) పూర్తిగా రాలేదు.గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 04:42, 21 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు, చరిత్ర ప్రకారం సరిగానే వచ్చింది కదా.--అర్జున (చర్చ) 04:44, 21 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
సరే అర్జున గారూ,--యర్రా రామారావు (చర్చ) 04:48, 21 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మండల పేజీల ప్రాజెక్టు దశ 3[మార్చు]

ఈ ప్రాజెక్టు పనిలో మిగిలిన పనిస్థితిపై నివేదికను తయారుచేసి, 3వ దశ పనిని నేను చేపడదామని అనుకుంటున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:37, 21 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు, మీ ఆలోచన బాగానే వుంది. తెలంగాణా మండల పేజీలనాణ్యత ఏ స్థాయిలో వుందో నాకు తెలియదు. మీ సమీక్ష కోసం చూస్తున్నాను. జిల్లాల పేజీలు 2012లో ప్రాజెక్టుగా చేపట్టినతరువాత, కేవలం జిల్లాకేంద్రాలను వేరు చేయటం 2015లో జరిగింది. ( జూన్ నెల జిల్లా పేజీల వీక్షణలు)వాటిని తాజాచేయటం మరింత ప్రధానమైనదిగా నాకనిపిస్తున్నది. ఎక్కువ మంది ప్రాజెక్టులో పాల్గొంటేనే వ్యాస నాణ్యత మెరుగవుతుంది. అలా జరగటానికి జిల్లాప్రాజెక్టుకు ఎక్కువ ఆస్కారముంది. మిమ్ములను నిరుత్సాహ పరచదలచుకోలేదు కాని, నా అభిప్రాయం వ్యక్తం చేశాను. పరిశీలించండి.--అర్జున (చర్చ) 14:26, 21 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ మీ ఆలోచనాకూడా బాగనే ఉంది.తెలంగాణా మండల పేజీలనాణ్యత ఏ స్థాయిలో వుందో ఒకసారి పరిశీలించండి.నేను సమీక్ష వివరాలు తెలపాలంటే ఏదో తెలిపామంటే తెలిపాం అన్నట్లుగా ఉండదు.ఇప్పటికి మీరు గ్రహించే ఉంటారు.ఎక్కువ మంది ప్రాజెక్టులో పాల్గొంటే వ్యాస నాణ్యత మెరుగవుతుంది అనే ఆలోచన నిజమే.అది ఆచరణలో ఎలా వచ్చిందో,ఎప్పటికి వచ్చిందో,అసలు పని పూర్తి ఎప్పటికి అయిందో,అసలు పూర్తి అయిందో కాదో, మీరు వివరణ ఇవ్వగలిగితే మీ ఆలోచన నూటికి నూరుపాళ్లు నిజం.మీరు మండల వ్యాసం ఎలా ఉండాలనుకుంటున్నారో మాదిరి వ్యాసం ఒకటి తయారు చేసి రచ్చబండలో చర్చకు పెడితే ఈ ప్రాజెక్టు పనికి ఉపయోగపడుతుందని నేనుభావిస్తున్నాను.ఇందులో నిరుత్సాహపడుతారనుకోవటంలో మీరు తెలిపిన అభిప్రాయంలో- అర్థం లేదని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:59, 21 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు, మీరు కృషి చేశారు కాబట్టి మీరు సమీక్ష చేయటం బాగుంటుంది. నేను చూసిన ఒకటి రెండు పేజీలను బట్టి, నా దృష్టిలో పేజీల సృష్టి ప్రాజెక్టు పరిధి అనుకుంటే విజయవంతమైనట్లే, కాని మండలాల పేజీల నాణ్యత తొలిసారి గ్రామాల మొలకల నాణ్యత (పరిమాణం కొంత ఎక్కువ వుండవచ్చు) లాగానే వుంది. గ్రామాల జాబితా ఇంతకు ముందు మూసలో వుండేది, వ్యాసంలోకి మారింది. కొంత మండల ఏర్పాటు, మార్పుల చరిత్ర చేర్చబడింది. జిల్లాస్థాయి వ్యాసాలలాగా వుండవలసిన విభాగాలు, వివరాలు, సరియైన పటాలు లేవనిపిస్తున్నది. అన్నట్లు ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు, దానితో పాటుగా, కొత్త మండలాలు వచ్చే 6 నెలలలో ఏర్పాటయ్యే అవకాశం వున్నప్పుడు, జిల్లా, మండల భౌగోళిక ప్రాజెక్టులపై పని కొంత వాయిదా వేసుకుని నగర, పట్టణ వ్యాసాలపై దృష్టిపెట్టడం మంచిదేమో. --అర్జున (చర్చ) 23:41, 21 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ తొలిసారి గ్రామాల మొలకల నాణ్యతలాగానే ఉంది అని వివరించారు.అసలు గ్రామ వ్యాసాలు, మండల వ్యాసాలు మీరు ఎలా ఉండాలని భావిస్తున్నారు.మీ దగ్గర ఉన్న డేటాతో రెండిటికి మాదిరి వ్యాసాలు తయారుచేేసి చర్చా పేజీలో పెట్టగలరు అని భావిస్తున్నాను.గ్రామాల జాబితా ఇంతకు ముందు మూసలో ఉన్నట్లు ఇప్పుడు కూడా ఉన్నవి.గమనించలేదనుకుంటాను. వ్యాసంలో మండలంలోని రెవిన్యూ గ్రామాలు అనే విభాగంలో అదనంగా చూపించినందున వ్యాస నాణ్యత దెబ్బతిన్నదని మీరు భావిస్తున్నారా.?అది కొత్తగా కల్పించినదికాదు.ప్రాజెక్టు పనికి ముందు లోగడ కొన్ని మండలాలకు సృష్టించిన వ్యాసాలలో అలా ఉన్నవి.జిల్లా వ్యాసాలు గురించి ప్రస్తావించారు, మనం ఇప్పుడు జిల్లా వ్యాసాలమీద కాదు చర్చించేది అనుకుంటున్నాను.అసలు ఏమి లేని దానికన్నా ఏంతో కొంత సరియైన సమాచారం ఉండటం మంచిదని నా అభిప్రాయం.చర్చను పొడిగించదలుచుకోలేదు. నేనతే ఈ చర్చను ముగిస్తున్నాను.ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 07:08, 22 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు, క్రిందటి వ్యాఖ్యలో జిల్లావ్యాసాల ప్రస్తావన సరిచేశాను. మీరు చర్చను ముగించానన్నతర్వాత నేను చర్చించటం ఉపయోగం లేదు కావున నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.. అర్జున (చర్చ) 07:50, 22 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]