వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/మొలకల తొలి జాబితా
స్వరూపం
యర్రా రామారావు గారూ, చాలా శ్రమ తీసుకుని ఆరు వేల పైచిలుకు మొలకలను పరిష్కరించే పని పెట్టుకున్నారు. సంతోషం. దీనిపై నా ఆలోచనలు ఇలా ఉన్నాయి:
- సినిమా మొలకలను సినిమా మొలకల వర్గం లోకి చేరుద్దాం (చేసాను)
- గ్రామాల మొలకలను గ్రామాల మొలకల వర్గం లోకి చేరుద్దాం
- ఇకపోతే ఈ పేజీలో ఉన్న ఇతర మొలకలను (మొత్తం 2556) కింది విధాలుగా వర్గీకరిద్దాం:
- ఇందులోని సినిమా నిర్మాణ సంస్థల వంటి సినిమా సంబంధ వ్యాసాలను కూడా సినిమా మొలకల వర్గం లోకే చేరుద్దాం (సినిమా వ్యక్తుల పేజీలను కాదు)
- వ్యక్తుల పేజీలను వ్యక్తుల మొలకల వర్గం లోకి చేరుద్దాం
- పత్రికల పేజీలను, పత్రికా సంస్థల పేజీలనూ పత్రికల మొలకల వర్గం లోకి చేరుద్దాం
- పుస్తకాలు, పుస్తక ప్రచురణ సంస్థల పేజీలను పుస్తకాల మొలకల వర్గం లోకి చేరుద్దాం
- ఆధ్యాత్మిక, పౌరాణిక మొలకల పేజీలను ఆధ్యాత్మిక మొలకల వర్గం లోకి చేరుద్దాం (పౌరాణిక వ్యక్తుల పేజీలు కూడా ఇందులోకే వస్తాయి)
- సంస్థల పేజీలను సంస్థల మొలకల వర్గం లోకి చేరుద్దాం
- చరిత్ర పేజీలను చరిత్ర మొలకల వర్గం లోకి చేరుద్దాం
- అన్ని శాస్త్ర సంబంధ వ్యాసాలను (భౌతిక, రసాయన, భూగోళ, భూగర్భ, ఖగోళ..), సాంకేతిక సంబంధ వ్యాసాలను శాస్త్ర సాంకేతిక వ్యాసాల మొలకల వర్గం లోకి చేరుద్దాం
దీనిపై మీ ఆలోచనలను కూడా చేర్చండి. స్వరలాసిక, రవిచంద్ర, వెంకటరమణ, పవన్ సంతోష్, ప్రణయ్‌రాజ్, ఇతర వాడుకరులకూ.. మొలకలపై ఒక కొత్త విధానాన్ని రూపొందించుకున్నా, పాత విధానాన్నే కొనసాగించినా.. వివిధ వర్గాలుగా వర్గీకరించి పెట్టుకుంటే, వాటిపై తీసుకోదలచిన చర్యలను తీసుకోవడానికి వీలౌతుందని నా అభిప్రాయంగా ఉంది. రామారావు గారు వాటిపై జాబితాలను తయారు చేసారు. వాటిని మరిన్ని వర్గాలుగా వర్గీకరిద్దామని నేను ప్రతిపాదిస్తున్నాను. పరిశీలించండి. గమనిక: ప్రస్తుతం నేను సినిమా మొలకల వర్గంలోకి చేర్చిన పేజీలను కొట్టివేత ద్వారా గుర్తించాను. __చదువరి (చర్చ • రచనలు) 11:02, 29 మే 2020 (UTC)