వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లింకు[మార్చు]

ఈ లింకు [1] పనిచేయడం లేదు. సరిచేయండి.Rajasekhar1961 (చర్చ) 10:13, 29 ఆగష్టు 2013 (UTC)

రాజశేఖరగారు ప్రాజెక్టు పేజిలో మరియు పైనా సరి చేసాను. మీ కృషి అభినందనీయం. --విష్ణు (చర్చ)13:25, 29 ఆగష్టు 2013 (UTC)

వ్యాస శీర్షిక[మార్చు]

ఈ వ్యాస శీర్షిక కొంచెం అయోమయంగా ఉన్నది? లీలావతి ఎవరు? భరతమాత కూతుళ్ళు అని పేరు పెట్టవచ్చును కదా? లీలావతి పేరునే ఎందుకు ఎన్నుకున్నారు?--పోటుగాడు (చర్చ) 15:58, 1 సెప్టెంబర్ 2013 (UTC)

పోటుగాడు గారు ప్రాజెక్టు పేజిలో మొదటి పేరా చదవండి. విష్ణు (చర్చ)18:48, 1 సెప్టెంబర్ 2013 (UTC)
విష్ణు గారూ సమాధానమునకు ధన్యవాదములు. నేను ఆల్రేడీ ఆ పేరా చదివాను. పుస్తకం యొక్క పేరులో లీలావతి అని ఎందుకు పెట్టారు అనే కుతూహలము కలిగినది. ఒకవేళ వారు ఆ పేరు పెట్టినా, మనము వికీలో వేరే పేరు పెట్టవచ్చును కదా అనే సందేహముతో ఈ ప్రశ్న అడగడం జరిగింది. పుస్తకం పేరులో లీలావతి ఎందుకు వచ్చినదో అలాగే అదే పేరును తెవికీలో ఎందుకు ఎన్నుకున్నామో (విధి లేని పరిస్థితులలోనా? లేదా వేరేకారణం తోనా?) మీకు తెలిసినచో లేదా జవాబు తెలిసిన ఎవరైనా సభ్యులు తెలియజేస్తే సంతోషము.--పోటుగాడు (చర్చ) 07:15, 2 సెప్టెంబర్ 2013 (UTC)
లీలావతి గణితం(en:Lilāvati) ప్రసిద్ధి చెందిన భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుని రచన. దాని ఆధారంగా భారతీయ మహిళా శాస్త్రవేత్తల పుస్తకానికి ఆ పేరు పెట్టారని నేను భావిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 07:44, 2 సెప్టెంబర్ 2013 (UTC)
లీలావతి భాస్కరాచార్యుని కుమార్తె అని చారిత్రకుల అభిప్రాయం. అందువలన సిద్ధాంత శిరోమణి గ్రంధంలో అంకగణిత భాగానికి "లీలావతి" అని పేరుపెట్టారు. సిద్ధాంత శిరోమణి మొత్తానికి, లీలావతి బీజగణితాలకు విడి విడిగా విడి విడిగా ఎక్కువ వ్యాఖ్యానాలు, అనువాదాలు వెలువడ్డాయి. దేశ దేశాలలో ప్రసిద్ధమైన విదేశీయులకు భారతీయ గణితానికి దారిచూపే ముఖద్వారం వంటిది లీలావతి గణితం. అంత ప్రసిద్ధమైన గ్రంథం భారత దేశానిది చెందడం వల్ల భారతీయ శాస్త్రవేత్తల పుస్తకానికి ఆపేరు పెట్టడం సముచితం. ఆ పేరుతోనే మన ప్రాజెక్టు నిర్వహించడం సంతోషదాయకం.---- కె.వెంకటరమణ చర్చ 08:58, 2 సెప్టెంబర్ 2013 (UTC)
Rajasekhar1961 గారు మీరు సరైన సమాధానం ఇచ్చారు. పోటుగాడు గారు మీరు మొదటి పేరా చదివి అందులో ఉన్న లంకె ద్వారా లీలావతి గురించి మీకున్న విజ్ఞాన కుతూహలం వల్ల అరా తీస్తారనుకున్నాను :) కాని అది ఫలించినట్టు లేదు. ఈ పుస్తకానికి సంబందించిన కరపత్రం కూడా చూడండి. --విష్ణు (చర్చ)09:04, 2 సెప్టెంబర్ 2013 (UTC)
కె.వెంకటరమణ గారు --విష్ణు (చర్చ)09:21, 2 సెప్టెంబర్ 2013 (UTC)
సందేహ నివృత్తి చేసిన సభ్యులందరికీ ధన్యవాదములు.--పోటుగాడు (చర్చ) 09:37, 2 సెప్టెంబర్ 2013 (UTC)
పోటుగాడు గారు మీరు ఓ చెయ్యి వేయండి. కనీసం ఓ ఐదుగురు లీలావతి కూతుళ్ళని మన తెవికీలో పుట్టింపగలరని ఆశిస్తూ...--విష్ణు (చర్చ)16:30, 2 సెప్టెంబర్ 2013 (UTC)

ఈ లింకులో మరింతమంది సైంటిస్టుల వివరాలు ఉన్నాయి, [2]అవి మనకు ఉపయోగపడవచ్చు, ఎవరైనా రాయదానికి ప్రయత్నిస్తే నేనూ ఒక చేయి వేస్తాను....11:26, 27 నవంబర్ 2013 (UTC)

వ్యాసాల అనువాదం[మార్చు]

నేను గమనించిన కొన్ని వ్యాసాలలో (ఉదా:ప్రజ్వల్ శాస్త్రి‎‎ ) నేరు అనువాదం జరుగుతున్నట్లుంది. ఇలా చేయడం నకలుహక్కుల సమస్య కావొచ్చు, క్లుప్తంగా విషయం రాసి లింకు చేర్చడం మంచిది. లేక హక్కుదారులనుండి అనువాదానికి మరియు స్వేచ్ఛగా విడుదలచేయడానికి అనుమతి తెచ్చుకుంటే ఈ అనువాద వ్యాసాలు వికీసోర్స్ లోచేర్చడం మంచిది. --అర్జున (చర్చ) 05:26, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సమన్వయకర్త?[మార్చు]

ఈ ప్రాజెక్టుకి సమన్వయకర్త ఎవరో తెలియదు. ప్రాజెక్టుకి సమన్వయకర్తని గుర్తించితే ప్రాజెక్టు నిర్వహణ మెరుగవుతుంది. --అర్జున (చర్చ) 05:29, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నచ్చినది Nagaraju.udutha (చర్చ) 13:59, 17 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]