Jump to content

వికీపీడియా చర్చ:విద్యార్ధులకు తెలుగు వికీ వ్యాసరచన పోటీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సూచనలు

[మార్చు]

వాడుకరి:విశ్వనాధ్.బి.కె. మరియు నిర్వహణలో పాలుపంచుకుంటున్న ఇతరులకు

  • క్రిందటి పోటీనుంచి నేర్చుకొన్న అనుభవాలతో ఈ కార్యక్రమాన్ని మెరుగుగా తీర్చిదిద్దితే బాగుంటుంది.
  • వికీకి పట్టుకొమ్మ సహకారం కనుక, కనీసం ప్రతి వ్యాసానికి ఇద్దరు విద్యార్ధులుండాలని నియమంపెడితే బాగుంటుంది.
  • వికీ విధానాలకు దగ్గరిగావున్న వ్యాసాలను మాత్రమే అర్హమైనవని కూడా ప్రకటించి, పాల్గొనేవారికి వికీనియమాల గురించి శిక్షణశిబిరం, స్కైప్ ద్వారా వివరించవచ్చు.
  • వ్యాసాలను వికీపీడియా పేరుబరిలో తయారు చేయటం మంచిది. వ్యాసాలు చాలావరకు సిద్ధమైనతరువాత ప్రధానపేరుబరిలో ప్రవేశపెట్టి, అనుభవ సభ్యులు ఇచ్చిన సూచనల ప్రకారం అభివృద్ధి చేసిన వాటిని పోటీలో పరిగణించడం పరిశీలించండి.
  • ఇదే కాకుండా ఇటీవల User:Visdaviva పరిశోధన విద్యార్ధులకి అవగాహన సదస్సు నిర్వహించారు కాబట్టి ఆ శిక్షణ పొందిన వారిని ప్రోత్సహించడానికి తెవికీ చరిత్ర, విషయవిస్తృతిలో పరిశోధనా వ్యాసాల పోటీపెడితే మరింత ఉపయోగముండవచ్చు. ఆటువంటి వాటికి వికీనియమాలు పాటించనవసరంలేదు.

అర్జున (చర్చ) 09:12, 4 డిసెంబర్ 2013 (UTC)

  • వ్యాసరచనకు కొన్ని సూచనలు కశ్యప్ ద్వారా స్కైప్ మీటప్‌లో విన్నాం. ఆయన వాటిని ఆ పేజీలో పెడ్తానని చెప్పారు. దాని ప్రకారం వ్యాసం ఎలా ఉండాలి అనేది ఒక టెంప్లేట్ ద్వారా పేజీలో ఇవ్వాలి. దానిని అనుసరించి విద్యార్ధులు రాసుకొంటారు. తరువాత సుజాత గారి స్కైప్ ఐడి ఇస్తున్నాం. వివరాలు కావలసిన వారు వారి ఐడి ద్వారా తెలుసుకోవచ్చు, పోటీపై తగిన వ్యాసాలను మరిన్ని చేర్చితే రాసేందుకు అనువుగా ఉంటుంది కనుక సభ్యులు ముందుకు వచ్చి మరిన్ని అమ్శాలు చేర్చాలని విజ్ణప్తి...విశ్వనాధ్ (చర్చ) 10:16, 4 డిసెంబర్ 2013 (UTC)
  • ఈ వ్యాసరచన పోటీలకు వయోపరిమితి మొదలైన అర్హతలను కూడా తెలియజేస్తే బావుంటుంది.
  • అర్జునరావు గారు, చక్కని సూచనలు చేశారు. ఇది వరకు జరిగిన పోటీలో పాల్గొన్న వారు ఇది మరో వ్యాసరచన పోటీ అన్న విధంగా మ్యాగజైన్ వ్యాసాలు వ్రాసినట్టున్నారు. పోటీ విద్యార్ధులకు తెలుగు వికీని పరిచయం చేసింది కానీ, వికీ పద్ధతులను పరిచయం లేదు. అందుకనే ఈ సారి పాల్గొనేవారికి ముందస్తుగా కొంత శిక్షణ ఇవ్వటం చక్కని ఆలోచన. అలా వికీ పద్ధతులు తెలిసిన మరికొంతమంది క్రియాశీలక సభ్యులు తయారయ్యే అవకాశం ఉంది. --వైజాసత్య (చర్చ) 17:25, 5 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నమూనా వ్యాసాలు మరియు అర్హతలు

[మార్చు]
  • నమూనా వ్యాసం వైరా అంతఆదర్శమైనదికాదు. దానిలో డైరెక్టరీలాగా వుండే అంశాలున్నాయి. వికీపీడియాగురించిన వ్యాసం కూడా అంత ఉపయోగంకాదు. ప్రముఖ వ్యక్తులు లేక ప్రముఖ సంస్థలు (వైరుధ్యాసక్తులు లేని)లేక ప్రభుత్వ పథకాలు బాగుంటాయి. నా విశ్లేషణలో ఇంతకు ముందు పోటీలో బహమతులు గెల్చుకున్న వారు ఆ తరువాత ఏమంత మార్పులు చేయలేదని నేను గమనించాను. అందుకని దీనిలో పాల్గొనేవారు వికీపీడియన్లుగా కొనసాగేటందుకు, వికీపీడియా సభ్యుడు కావలసిన లక్షణాలను ఏమైనా చర్చించి అర్హతలుగా నిర్ణయించడం మంచిది --అర్జున (చర్చ) 06:57, 6 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • విద్యార్దుల ఉత్సుకత పొటీ కొరకు మాత్రమే ఉంటుందని అనుకొంటా. వారు నిరంతరంగా రాయాలనుకోవడం కూడా సరికాదేమో. వారి పరీక్షలు చదువులో పడి కొంత దూరమైనా అప్పటికే అవగాహన ఉంటుంది కనుక తప్పక మళ్ళీ రాయగలిగే అవకాశం ఎప్పూడూ ఉంటుంది. ఇక వ్యాసరచనలో పాల్గొనే వారికి రాయడంలో సూచనలు సలహాలు నిబంధనలు ఉండచ్చును కాని అర్హతలు నిర్ణయించడం అంటే కష్టం. కనుక సులభంగా ఉండేలాంటి సలహాలు సూచనలు (ఉదా. ప్రముఖ వ్యక్తులు లేక ప్రముఖ సంస్థలు) ఉంటే వారికి బావుంటుంది...విశ్వనాధ్ (చర్చ) 07:34, 6 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • విశ్వనాధ్ గారికి, పోటీలో పాల్గొన్న వారు నిరంతరాయంగా రాయలనిఅనుకోవటంలేదు. పాల్గొన్న అందరూ క్రియాశీలంగా వుండాలని అనుకోవడంలేదు. ఇటువంటి కార్యక్రమాలవలన బహమతులు పొందినవారిలో 10 మందిలో ఒకరైనా వికీలో రచనలు చేసేటట్లు ఆకర్షించకలిగితే బాగుంటుంది. ఇవి చేపట్టటానికి అదే ఒక లక్ష్యం కదా. ఇక ఇంతకు ముందు బహుమతులు గెలిచిన వారి గురించి నాకు తెలిసినంతవరకు రాయలేకపోవడానికి, కొంతమందికైనా అంతర్జాల సౌకర్యం లేకకాదు. మూడు నెలలలో ఖాళీ దొరకనూకాదు. వికీపై ఆసక్తి పెంచటానికి వేరే ప్రయత్నాలు చేయటం మంచిది. ఉదాహరణకి పరిశోధక విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీ, లేక ఒకరు సాంకేతిక రంగ విద్యార్థి ఇంకొకరు సాంకేతికరంగం కాని విద్యార్థితో జతకలపటం. లేక బ్లాగులు నిర్వహిస్తున్న వారు సోషల్ మీడియాలో చురుకుగా వున్నవారిని ఎంపికచేయటం లాంటివి చేయవచ్చు. వెనకటికెవరో చెప్పినట్లు మనం ప్రయత్నాలలో తేడాలేకుండా, ఫలితాలలో అభివృద్ధి సాధించాలనుకోవటం అంత ఉపయోగపడదని నా విశ్వాసంకూడాను. --అర్జున (చర్చ) 00:23, 7 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రోత్సాహక బహుమతులు

[మార్చు]

ప్రోత్సాహక బహుమతులను 5 నుండి 7 గా మార్చాను. మొత్తం బహుమతుల విలువను పరిశీలిస్తే ఈ సవరణ అవసరమనిపించింది. పరిశీలించండి. --చదువరి (చర్చరచనలు) 07:51, 2 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]