విజయ రాజే సింధియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయ రాజే సింధియా (1919 అక్టోబర్ 12- 2001 జనవరి 25 ) లేఖా దివ్యేశ్వరి దేవి గా జన్మించింది. ఆమె ప్రముఖ భారతీయ రాజకీయ వ్యక్తిత్వం వలన గ్వాలియర్ రాజమాతగా ప్రసిద్ధి చెందింది. బ్రిటీష్ వారి రాజ్య పాలన కాలంలో, గ్వాలియర్ చివరి రాజు మహారాజా జీవాజీరావు సింధియాకు ఆమె భార్య. ఆమె ఆ ప్రాంతంలోనే అత్యున్నత రాజకీయ వ్యక్తులలో ఉన్నత స్థానం పొందింది. తరువాతి, ఆమె అత్యంత ప్రభావం కలిగిన రాజకీయ నాయకురాలు అయ్యింది. భారత పార్లమెంటు ఉభయ సభలకు పదేపదే ఎన్నికయింది. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులలో ఆమె కూడా ఒకరు.

విజయ రాజే సింధియా
ఇండియా పోస్ట్ ద్వారా 2001 కవర్‌పై రాజమాత సింధియా
గ్వాలియర్ మహారాణి
Reign21 ఫిబ్రవరి 1941– 16 జులై 1961
Successorమాధవి రాజే సింధియా
గ్వాలియర్ రాజమాత
Reign16 జులై 1961– 25 జనవరి 2001
Successorమాధవ రాజే సింధియా
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
In office
5 ఏప్రిల్ 1957 – 2 ఏప్రిల్ 1962
అంతకు ముందు వారువి. జి. దేశ్‌పాండే
తరువాత వారురాంసహై పాండే
నియోజకవర్గంగునా
In office
2 ఏప్రిల్ 1962 – 4 మార్చి 1967
అంతకు ముందు వారుసూరజ్ ప్రసాద్
తరువాత వారురామ్ అవతార్ శర్మ
నియోజకవర్గంగ్వాలియర్
In office
15 మార్చి 1971 – 18 జనవరి 1977
అంతకు ముందు వారుయశ్వంత్ సింగ్ కుష్వా
తరువాత వారురఘుబీర్ సింగ్ మచంద్
నియోజకవర్గంభిండ్
In office
2 డిసెంబర్ 1989 – 10 అక్టోబరు 1999
అంతకు ముందు వారుమహేంద్ర సింగ్
తరువాత వారుమాధవరావ్ సింధియా
నియోజకవర్గంగునా
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ
In office
10 ఏప్రిల్ 1978 – 2 డిసెంబర్ 1989
నియోజకవర్గంమధ్యప్రదేశ్
భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు
In office
1980–1998
వ్యక్తిగత వివరాలు
జననంలేఖా దివ్యేశ్వరి దేవి
(1919-10-12)1919 అక్టోబరు 12
సాగర్, సెంట్రల్ ప్రావిన్సులు, బ్రిటిష్ ఇండియా [1]
మరణం2001 జనవరి 25(2001-01-25) (వయసు 81)
సెంట్రల్ ప్రావిన్సులు, బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ (1980–2001)
ఇతర రాజకీయ
పదవులు
జీవిత భాగస్వామిహైనెస్
సంతానంపద్మావతి రాజే
ఉషా రాజే రాణా
మాధవరావు సింధియా
వసుంధర రాజే
యశోధర రాజే
తల్లిచుడా దేవశ్వరీ దేవి
తండ్రిఠాకూర్ మహేంద్ర సింగ్‌

వ్యక్తిగత జీవితం

[మార్చు]

విజయ రాజే సింధియా 1919 అక్టోబర్ 12న ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో, కోట్లా రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ అధికారి అయిన ఠాకూర్ మహేంద్ర సింగ్‌కి, అతని రెండవ భార్య చుడా దేవశ్వరీ దేవికి పెద్దకూతురుగా జన్మించింది. ఆమెకు పుట్టినప్పుడు లేఖా దివ్యేశ్వరి దేవి అని పేరు పెట్టారు. ఆమె తండ్రి ప్రాంతీయ పరిపాలనలో డిప్యూటీ కలెక్టర్. ఆమె తల్లి నేపాల్ ఆర్మీ కమాండింగ్-జనరల్ రాజా ఖడ్గా షంషేర్ జంగ్ బహదూర్ రాణా మాజీ కమాండర్-ఇన్-చీఫ్ కుమార్తె, నేపాల్ రాణా రాజవంశం వ్యవస్థాపకుడు జంగ్ బహదూర్ కున్వర్ రాణా మేనల్లుడు. ఆమె తల్లి విజయ రాజే పుట్టినప్పుడు మరణించింది. ఆమె సోదరుడు ధ్యానేంద్ర సింగ్, మాయా సింగ్ కు భర్త. [2]

ఫిబ్రవరి 1941లో, [3] 22 సంవత్సరాల వయస్సులో, లేఖ భారతదేశంలోని అతిపెద్ద, అత్యంత సంపన్నమైన, అత్యున్నతమైన రాజరిక రాష్ట్రాలలో ఒకటైన గ్వాలియర్ మహారాజా జివాజీరావు సింధియాను వివాహం చేసుకుంది. విజయ రాజే, జీవాజీరావులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు:

  1. పద్మావతి రాజే 'అక్కాసాహెబ్' దేబ్ బర్మన్ (1942–64), త్రిపుర 185వ మహారాజు కిరీట్ బిక్రమ్ కిషోర్ దేబ్ బర్మన్‌ను వివాహం చేసుకుంది.
  2. ఉషా రాజే రాణా (జననం 1943), రాణా రాజవంశానికి చెందిన పశుపతి షంషేర్ జంగ్ బహదూర్ రాణాను వివాహం చేసుకుంది. ఆతను నేపాల్ కు చెందిన రాజకీయ నాయకుడు, నేపాల్ చివరి మహారాజుకు మనవడు. ఉషా రాజే దంపతులు దేవయాని రానా, ఊర్వశి రానా లకు తలిదండ్రులు.
  3. మాధవరావు సింధియా (1945–2001), భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. కేంద్ర రైల్వేలు, విమానయాన, మానవ వనరుల అభివృద్ధి విభాగాలకు మాజీ మంత్రి, గ్వాలియర్ మహారాజా. ఆయన జ్యోతిరాదిత్య సింధియాకు తండ్రి.
  4. వసుంధర రాజే (జననం 1953) భారతీయ జనతా పార్టీ కు చెందిన రాజకీయ నాయకురాలు, రాజస్థాన్‌కి రెండుసార్లు ముఖ్యమంత్రి గా పని చేసింది. ఆమె గతంలో ధోల్పూర్ మహారాజును వివాహం చేసుకుంది.
  5. యశోధర రాజే సింధియా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ క్రీడా మంత్రి.

రాజకీయ జీవితం

[మార్చు]
2001 భారతదేశపు స్టాంపుపై విజయ రాజే సింధియా

విజయరాజే 1957లో కాంగ్రెస్ టిక్కెట్‌పై మధ్యప్రదేశ్‌లోని గునా లోక్‌సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందడంతో ఆమె ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఐదేళ్ల తర్వాత ఆమె గ్వాలియర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచింది. తరువాత, ఆమె కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, 1967లో స్వతంత్ర పార్టీ టిక్కెట్‌పై గునా స్థానంలో గెలుపొందింది. ఆమె తరువాత భారతీయ జన్ సంఘ్‌లో చేరింది. లోక్‌సభకు రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లో పాల్గొంది. ఆమె 1967లో జన్ సంఘ్ అభ్యర్థిగా మధ్యప్రదేశ్‌లోని కరేరా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళింది. జనసంఘ్ 1971 లోక్‌సభ ఎన్నికలలో ఇందిర తాకిడిని ధిక్కరించి గ్వాలియర్ ప్రాంతంలో 3 స్థానాలు గెలుచుకుంది అవి - భిండ్ నుండి విజయ రాజే సింధియా, గ్వాలియర్ నుండి వాజ్‌పేయి, గునా నుండి మాధవరావు సింధియా (అయితే ఆ తరువాత అతను పార్టీని విడిచిపెట్టాడు). [4] విజయరాజే సింధియా 1977, 1984లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 1980లో రాయ్‌బరేలీలో ఇందిరా గాంధీ తో ఓడిపోయింది. 1989లో, ఆమె గునా నుండి భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యురాలిగా గెలుపొందింది, ఇంకా 1991, 1996, 1998లో తమ సీటును నిలుపుకుంది. పెద్ద వయస్సు కారణంగా ఆమె 1999లో ఎన్నికల్లో పోటీ చేయలేదు. అత్యవసర స్థితి సమయంలో ఇందిరా గాంధీ ఆమెను జైలుకి పంపింది. ఆమె తీహార్ జైలులో తోటి రాజమాత, పార్లమెంట్ సభ్యురాలైన గాయత్రీ దేవితో చివరికి ఒకే గదిలో ఉంది.1970వ దశకంలో, విజయరాజే, ఆమె కుమారుడు మాధవరావు ఆస్తి విషయంలో బహిరంగ వివాదంలో చిక్కుకున్నారు. వారి భిన్నమైన రాజకీయ సిద్ధాంతాల కారణంగా శత్రుత్వాలు కూడా పెరిగాయి.

1980లో బిజెపికి ఉపాధ్యక్షురాలిగా ఎంపికైనప్పుడు విజయరాజే బిజెపి నాయకత్వంలో ముందంజలో ఉన్నారు. పార్టీ రామజన్మభూమి ఉద్యమం ప్రాచుర్యం పొందడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆమెను కరడుగట్టిన వ్యక్తిగా పరిగణించారు. డిసెంబరు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత, ఆమె "తన కలను సాకారం చేసుకున్నందుకు ఇప్పుడు ఎలాంటి విచారం లేకుండా చనిపోవచ్చు" అని ప్రకటించింది.[5] ఆమె 1998 వరకు బిజెపి ఉపాధ్యక్షురాలిగా కొనసాగింది. ఆనారోగ్య కారణాలతో ఎప్పుడైతే వైదొలిగిందో, ఎన్నికల రాజకీయాల నుండి విరమించింది. ఆమె జనవరి 2001లో మరణించింది.

పూర్వీకులు

[మార్చు]
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
4. ఠాకూర్ థియోబరన్ సింగ్
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
2. ఠాకూర్ మహేంద్ర సింగ్‌
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1.విజయ రాజే సింధియా
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
12. జనరల్ హెచ్.ఇ. ధీర్ షంషేర్ రాణా
 
 
 
 
 
 
 
 
 
 
 
6. జనరల్ రాజా ఖడ్గ షంషేర్ జంగ్ బహదూర్ రాణా
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
13. నంద కుమారి థాపా రాజవంశం
 
 
 
 
 
 
 
 
 
 
 
3. చుడా దేవశ్వరీ దేవి
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
థాపా
 
 
 
 
 
 
 
 
 
 
 
7. రాణి' ధన్ కుమారి రాజ్య లక్ష్మీ దేవి
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ప్రస్తావనలు

[మార్చు]
  1. http://www.streeshakti.com/bookV.aspx?author=7
  2. "The Theory Of Relativity". Outlook India. 30 November 1998. Archived from the original on 9 February 2011.
  3. Reed, Stanley (1950). The Indian And Pakistan Year Book And Who's Who 1950. The Times Group|Bennett Coleman and Co. Ltd. p. 684. Retrieved 22 February 2018.
  4. Yadav, Shyamlal (2020-03-13). "The Gwalior dynasty: A short history of the Scindias in Indian politics". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 2023-04-03.
  5. "December 6, 1992, a memoir". Rediff.com. 5 December 1997. Retrieved 2 November 2018.