Jump to content

విప్లవస్త్రీ

వికీపీడియా నుండి
(విప్లవ స్త్రీ నుండి దారిమార్పు చెందింది)
విప్లవ స్త్రీ
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎ.తిరుముగం
కథ సముద్రాల సీనియర్,
సముద్రాల జూనియర్
తారాగణం ఆనందన్,
ఎం.ఆర్‌.రాధా,
దేవర్,
పండరీబాయి,
లలిత,
రాజకుమారి,
పుష్పలత
సంగీతం పామర్తి
గీతరచన సముద్రాల సీనియర్,
సముద్రాల జూనియర్
నిర్మాణ సంస్థ విశ్వశాంతి పిక్చర్స్
భాష తెలుగు

విప్లవ స్త్రీ 1961, సెప్టెంబర్ 1వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమాను తెలుగులో విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై యు.విశ్వేశ్వర రావు నిర్మించాడు.

సంక్షిప్త కథ

[మార్చు]

ఒక జమీందారు ఒక వన్నెల విసనకర్ర చేతిలో చిక్కి, ఆమె మాయలో పడి, భార్యను అనుమానించి తరిమివేశాడు. జమీందారిణి పసిపిల్లతో సహా అడవులకు వెళ్ళి అజ్ఞాతవాసం చేస్తుంది. జమీందారుకు విశ్వాసపాత్రుడైన ఒక వ్యక్తి ఆమెను కాపాడుతూ ఉంటాడు. ఆ పసిపిల్ల పెరిగి పెద్దదై కత్తి యుద్ధం వగైరాలు నేర్చుకుని విప్లవస్త్రీ అవుతుంది. ఆమె ముసుగు వేషం వేసుకుని కొండవీటి సింహం అనే పేరుతో అడపాతడపా జమీందారు దగ్గరకు వెళ్ళి మాయలాడి వలలో పడవద్దనీ, జమీందారిణిని స్వీకరించమని హెచ్చరికలు చేస్తుంది. ఇంతలో ఆమెకు ఒక నాయకుడు తటస్థపడతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఉమ్మడిగా సాహసాలు ప్రారంభిస్తారు. చివరకు జమీందారు కళ్ళు తెరిపించి, మాయలాడి కుట్రలను, జమీందారిణి పాతివ్రత్యాన్ని ఋజువు చేస్తారు. అందరూ సుఖంగా ఉంటారు[1].

పాటలు

[మార్చు]
  1. ఊసులొక్కటే ఓ చెలియా ఆశలొక్కటే రా చెలియా - మాధవపెద్ది, స్వర్ణలత
  2. కనువిందు కలిగించు పరువం అది కథలల్లి - ఘంటసాల, పి. లీల, రచన: సముద్రాల జూనియర్
  3. ఓ లలనా ఎన్ని వేసములున్నా పల్కులెన్ని పల్కినా - ఘంటసాల,వైదేహి
  4. కన్నార యిదివరకూ కానని బాటలలో నరులు నడవని - ఎస్.జానకి
  5. నిజం కనేదెవరు లోకం అవనీ తెలిసిన ఉర్విలో పెను - పి.సుశీల
  6. నీతినే గట్టిగ నమ్మాలి చేతలే సూటిగ ఉండాలి - శిర్గాళి గోవిందరాజన్
  7. స్కందా మా పాలి దొరా కానుకలనూ పూని కొల్చేము - పామర్తి

మూలాలు

[మార్చు]
  1. సారథి (9 September 1961). "రూపవాణి - విప్లవస్త్రీ". ఆంధ్రప్రభ దినపత్రిక. No. 249. ఆంధ్రప్రభ లిమిటెడ్. p. 8. Retrieved 24 October 2016.[permanent dead link]