విశ్వకర్మ జయంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వకర్మ జయంతి
విశ్వకర్మ జయంతి
యితర పేర్లువిశ్వకర్మ పూజ
జరుపుకొనేవారుఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కేరళ,తెలంగాణ, ఒడిశా, త్రిపుర, నేపాల్
రకంహిందూ
ప్రాముఖ్యతవిశ్వకర్మ పుట్టినరోజు
ప్రారంభంసెప్టెంబరు 17
ముగింపుసెప్టెంబరు 18
జరుపుకొనే రోజుకన్య సంక్రాంతి[1][2]
(సెప్టెంబరు 16/17)
2025 జరగవలసిన తేదీSeptember సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు
ఉత్సవాలువిశ్వకర్మ పుట్టినరోజు
ఆవృత్తివార్షికం
అనుకూలనంసెప్టెంబరు 17

విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు, దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న విశ్వకర్మ పూజను నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారక నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతోపాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారుచేశాడు. దివ్య వడ్రంగి అని కూడా పిలువబడ్డాడు. మెకానిక్స్, ఆర్కిటెక్చర్ లలో శాస్త్రమైన స్థపత్య వేదంతో ఘనత పొందాడని ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాడు.[3]

విశ్వకర్మ విగ్రహం

విశ్వకర్మ[మార్చు]

హిందూ సంప్రదాయం ప్రకారం, విశ్వకర్మను ప్రపంచంలోని డివైన్ ఇంజనీర్ అని పిలుస్తారు.[4] విశ్వకర్మకు పుట్టినరోజున విశ్వకర్మ జయంతిగా పిలువబడుతోంది. ప్రపంచానికి అసలైన సృష్టికర్తగా పిలువబడుతున్న విశ్వకర్మ, ప్రపంచం కంటే ముందునుండే ఉన్నాడు. విశ్వకర్మకు ఐదుగురు కుమారులు (మన్ను, మైదేవ్, తవష్ట, శిల్పి, దేవగ్యా), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దివ్య హస్తకళాకారుడైన విశ్వకర్మ హస్తకళాకారులు, వాస్తుశిల్పులందరికి అధిపతి. బ్రహ్మ కుమారుడైన విశ్వకర్మ, విశ్వం దైవిక హస్తకళాకారుడు, దేవతల రాజభవనాలను అధికారికంగా నిర్మించాడు.[5]

చతుర్ముఖుడైన విశ్వకర్మ కిరీటాన్ని, సువర్ణా భరణాలతో ఎనిమిది చేతులు, ఒక చేతిలో నీటిబిందె, ఒక చేతిలో పుస్తకం, ఒక చేత ఉచ్చు, మిగిలిన చేతులలో వివిధ ఆయుధాలను, పనిముట్లను కలిగివుంటాడు.

వేడుకలు[మార్చు]

ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం 'కన్య సంక్రాంతి' సందర్భంగా వస్తుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ తేదీలో సెప్టుంబరు 16 నుండి 18 మధ్యన ఈ జయంతిని జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, త్రిపుర వంటి రాష్ట్రాలతోపాటు నేపాల్‌లో కూడా పండుగ జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా పారిశ్రామిక ప్రాంతం విశ్వకర్మ పూజకు ప్రసిద్ధి చెందింది.

కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలలో, తరచుగా దుకాణాలలో విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారు. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ వాళ్ళు మాత్రమే కాకుండా చేతివృత్తులవారు, హస్తకళాకారులు, మెకానిక్స్, స్మిత్‌లు, వెల్డర్లు, పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు మొదలైన వారు కూడా జరుపుకుంటారు. కార్మికులు విశ్వకర్మను కొలిచి తమ పరికరాలను, పనిముట్లను పూజిస్తారు. రైతులు తమ నాగళ్ళు, ఇతర వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు.

మూలాలు[మార్చు]

  1. "विश्वकर्मा पूजा: जानें महत्व और जन्म की कहानी". Aajtak. 17 September 2017. Retrieved 22 July 2019.
  2. "All About Lord Vishwakarma and Vishwakarma Puja". Hind Utsav. Retrieved 22 July 2019.
  3. "Vishwakarma Puja 2021 : विश्वकर्मा पूजा आज, जानिए पूजा विधि, महत्व और कथा". Hindustan (in hindi). Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  4. "Vishwakarma Puja 2021 [Hindi]: विश्वकर्मा नही, पूर्ण ब्रह्म कविर्देव हैं विश्व के रचयिता". SA News Channel. 2021-09-17. Retrieved 2021-09-18.
  5. "Vishwakarma Puja 2021: Date, timing, significance, and all you need to know about Vishwakarma Jayanti". Firstpost. 2021-09-17. Retrieved 2021-09-18.