విస్కాంసిన్ హిందూ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవాలయపు చిత్రం - పక్క నుండి
దేవాలయపు చిత్రం - ముందు నుండి

విస్కాంసిన్ హిందూ దేవాలయం, మే 2001 వ సంవత్సరంలో విస్కాంసిన్లో మొట్టమొదటి హిందూ దేవాలయంగా ప్రారంభించారు. ఇది పీవాకీ గ్రామంలో అమెరికా జాతీయ రహదారి I - 94 కి దగ్గరగా నిర్మితమైంది. ముఖ్య భవనము లోపల 11 చిన్న చిన్న గుళ్ళను చెక్కారు. మొత్తం 11 చిన్న దేవాలయాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్య విగ్రహం వెంకటేశ్వర స్వామి, తరువాత గణపతి, శివ పార్వతులు, రాధా కృష్ణులు, హనుమాన్ సహిత సీతా రామలక్ష్మణులు, శ్రీ లక్ష్మీ, ఆంజనేయ స్వామి, సిద్ధి వినాయకుడు, శ్రీదేవి భూదేవి సహిత గోవిందుడు, దుర్గాదేవి, సత్యనారాయణ స్వామి ఇక్కడి చిన్న చిన్నగుళ్ళలో ప్రతిష్ఠించారు, నవగ్రహాలను ఒక పక్కగా ప్రతిశష్ఠించారు. నిర్మాణానికి గాను దక్షిణ భారతదేశం నుంచి శిల్పులను తెప్పించారు. 8 నెలల కృషి ఫలితంగా ఈ గుళ్ళ నిర్మాణం పూర్తయింది.

నిర్మాణం[మార్చు]

జాతీయ రహదారి I - 94 పక్కగా 21.5 ఎకరాల కొండ ప్రాంతంలో ఈ గుడిని నిర్మించారు. దీనికి డిజైనర్ అర్కిటెక్ట్ గా సుహాస్ ఆర్ పవార్. గుడి తూర్పు ముఖంగా ఉంది. 125 అడుగుల పొడవు 90 అడుగుల వెడల్పు కలిగి రెండు అంతస్తులలో కలిపి 24,000 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంది. కింది భాగంలో దేవాలయపు కాంటీన్ మరియూ సాంస్కృతిక కార్యక్రమాల కొరకు ఒక stage ఉన్నాయి. ఇక్కడ ప్రతి దీపావళికి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]