వి.ఎం. ముద్దయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.ఎం. ముద్దయ్య
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వెంకటప్ప ముసంద్ర ముద్దయ్య
పుట్టిన తేదీ(1929-06-08)1929 జూన్ 8
బెంగుళూరు, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2009 అక్టోబరు 1(2009-10-01) (వయసు 80)
బెంగళూరు, కర్ణాటక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight arm ఆఫ్ బ్రేక్ / మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 94)1959 డిసెంబరు 12 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1960 డిసెంబరు 21 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1949–1962సర్వీసెస్
1951–1952Mysore
1953–1954హైదరాబాదు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 2 61
చేసిన పరుగులు 11 805
బ్యాటింగు సగటు 5.50 13.87
100లు/50లు 0/0 0/4
అత్యధిక స్కోరు 11 67
వేసిన బంతులు 318 9,918
వికెట్లు 3 175
బౌలింగు సగటు 44.66 23.76
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 10
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1
అత్యుత్తమ బౌలింగు 2/40 8/54
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 62/–
మూలం: Cricinfo, 2009 అక్టోబరు 21

వెంకటప్ప ముసంద్ర ముద్దయ్య (1929 జూన్ 8 – 2009 అక్టోబరు 1 [1] ) 1959 నుండి 1960 వరకు 2 టెస్టులు ఆడిన భారతీయ క్రికెట్ ఆటగాడు.

బెంగుళూరులో జన్మించిన ముద్దయ్య, మైసూర్ యూనివర్సిటీ, మైసూర్ స్టేట్ 'బి' టీమ్ ల ద్వారా పైకి వచ్చాడు. బెంగుళూరులోని మల్లేశ్వరం మిడిల్ అండ్ హై స్కూల్, సెంట్రల్ కాలేజీలలో చదివాడు. తర్వాత మల్లేశ్వరం జింఖానా, ఫ్రెండ్స్ యూనియన్ సీసీ తరఫున క్లబ్ క్రికెట్ ఆడాడు. అతను 1948లో భారత వైమానిక దళంలో చేరాడు, కానీ త్వరలోనే 'ఎగిరేటందుకు అనర్హుడని' తేలింది. దాంతో అతను వైమానిక దళాన్ని విడిచిపెట్టాడు. 1951-52లో మైసూర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే మరుసటి సంవత్సరంలో IAFకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పిలిచారు. అతను 1979లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునే ముందు వింగ్ కమాండర్ అయ్యాడు.

ముద్దయ్య బ్యాట్స్‌మన్‌గా ప్రారంభించి, మీడియం పేసర్‌గా మారి చివరకు ఆఫ్‌స్పిన్నర్‌గా మారాడు. అతను స్పిన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా అతను పదిహేను అంగల రన్అప్‌ వాడేవాడు. అతను 1949లో సదరన్ పంజాబ్‌పై సర్వీసెస్ తరపున 54 పరుగులకు 8 వికెట్లు, 43 పరుగులకు 4 వికెట్లు తీసుకుని అతను తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను గొప్పగా ప్రారంభించాడు.[2] కానీ అతని కెరీర్‌లో ఎక్కువ భాగం అతను అప్పటి ప్రాథమిక ఆఫ్ స్పిన్నరైన గులాం అహ్మద్ నీడలో ఉండాల్సి వచ్చింది. 1959లో గులాం రిటైరయ్యే వరకు ముద్దయ్య భారత జట్టుకు ఎంపిక కాలేదు.

ముద్దయ్య 1959 లో ఇంగ్లండ్‌లో పర్యటించాడు. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ముప్పై వికెట్లు తీసుకున్నాడు కానీ టెస్టుల్లో ఆడలేదు. 1959-60లో ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి టెస్టులో వికెట్ తీయలేకపోయాడు. ఒక సంవత్సరం తర్వాత పాకిస్తాన్‌పై అతని ఏకైక ప్రదర్శనలో, అతను ముస్తాక్ మొహమ్మద్, హనీఫ్ మహ్మద్, ఇంతియాజ్ అహ్మద్‌ల వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగులో వాలిస్ మథియాస్‌ షార్ట్-లెగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను పాలీ ఉమ్రిగర్ చేతిలో పట్టలేకపోయాడు.


1961-62లో సందర్శించిన ఇంగ్లండ్ జట్టుపై మరొక అవకాశం వచ్చింది. నార్త్ జోన్ తరఫున ముద్దయ్య 71 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. ఆ వికెట్లన్నీ టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్లవే. [3] నాల్గవ టెస్ట్ సందర్భంగా MCCతో సర్వీసెస్ తరఫున ఆడిన మ్యాచ్‌లో విఫలమయ్యాక అతను ఎంపిక కాలేదు. అ తరువాత అతను రిటైరయ్యాడు.

1962 వరకు సాగిన తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ముద్దయ్య, 175 వికెట్లు పడగొట్టాడు. 1951-52 రంజీ సెమీఫైనల్‌లో బాంబేతో జరిగిన మ్యాచ్‌లో మైసూరు తరపున అతని అత్యంత ముఖ్యమైన ప్రదర్శన ఒకటి. మైసూరు 170 పరుగులు చేసిన తర్వాత, బాంబే మొదటి రోజు ఆట ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 163 పరుగులు చేసింది. రాత్రిపూట వర్షం కురిసింది. మరుసటి రోజు ముద్దయ్య, ఎనిమిది ఓవర్లలో ఆరు వికెట్లు పడగొట్టడంతో బాంబే రెండో రోజు 205 పరుగులకు ఆలౌటైంది. అయినప్పటికీ మైసూరు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. [4] అతను 1961-62లో జమ్మూ కాశ్మీర్‌పై 2 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. [5]

ముద్దయ్య కోసం 1980 లో బెనిఫిట్ మ్యాచ్ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం అతనికి బెంగుళూరు వెలుపల 5 ఎకరాల పొలం ఇచ్చింది. ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "Former India offspinner Muddiah dies". ESPNcricinfo. 2009-10-01. Retrieved 2009-10-02.
  2. "Southern Punjab v Services 1949-50". ESPNcricinfo. Retrieved 2 March 2021.
  3. "North Zone v MCC 1961-62". ESPNcricinfo. Retrieved 2 March 2021.
  4. "Mysore v Bombay 1951-52". ESPNcricinfo. Retrieved 2 March 2021.
  5. "Services v Jammu & Kashmir 1961-62". ESPNcricinfo. Retrieved 2 March 2021.