Jump to content

వి.జె.వర్మ

వికీపీడియా నుండి
వి.జె.వర్మ

వి.జె.వర్మ
జననం: {{{birth_date}}}
మదనపల్లి
వృత్తి: సినీ గాయకుడు , వేణు విద్వాంసుడు
భర్త/భార్య:నాగరత్నమ్మ
సంతానం:ఇద్దరు

వి.జె.వర్మ గాయకుడు, వేణుగాన విద్వాంసుడు . ఆయన ఎన్నో సంగీత కచేరీలు ఇచ్చాడు. ఆకాశవాణి ద్వారా, సినిమాలలో ఎన్నో గీతాలు పాడాడు. మదనపల్లి లో జన్మించాడు. ఈయన అసలు పేరు విజయవర్మ. ఇంటిపేరు పి.వి. అంటే పండ్రుత్తి వల్లం. అంధుడు. పదిరోజుల పసితనంలోనే చూపు కోల్పోయాడు. 1945లో నాగరత్నమ్మ తో వివాహం అయింది . ఇద్దరు పిల్లలు.[1]

సంగీత జీవితం

[మార్చు]

చిన్నతనం నుండి వేణువు నేర్చుకున్నాడు . ఎన్నో ఆకాశవాణిలోనూ, బయట కూడా సంగీత కచేరీలు చేసారు. మద్రాసు విజయా సంస్థ నుండి వచ్చిన పిలుపు అనుసరించి సినిమాలలో పాడడం ఆరంభించాడు . ఘంటసాల సంగీత సారధ్యంలో పాతాళ భైరవి సినిమాలో ఆరంభించి అద్దేపల్లి రామారావు, అశ్వద్ధామ సంగీత దర్శకత్వంలో ఇంకొన్ని సినీ గీతాలు పాడాడు. అద్దేపల్లి రామారావు ఆర్కెష్ట్రాలో వేణువు వాయించేవాడు. పాతాళ భైరవి సినిమాలో వర్మ పాడిన " ప్రేమ కోసమే వలలో పడెనే పాపం పసివాడు . . . అను పాట అతనికి పేరు తెచ్చింది. తక్కువ పాటలు పాడాడు. చిత్తూరు వి . నాగయ్య "అచ్చం నాలాగే పాడతావు నాయనా" అని మెచ్చుకున్నాడు . [1]

ఆతను పాడినవే మరికొన్ని సినీ గీతాలు -

  • ఘంటసాలతో కలిసి పాతాళ భైరవి లో "కనుగొనగలనో లేదో ..."
  • పెళ్లి చేసి చూడు (1952) లో "పోవమ్మా ! బలి కావమ్మా .."
  • నా ఇల్లు (1953) లో "ఔరా కాల మహిమ ..."
  • పెద్ద మనుషులు (1954) లో "నీడలేదమ్మా నీకిచట తోడు లేదమ్మా నీవారనుకొని నమ్మినవారే . . ."
  • రాజగురువు (1954) లో "ఎవరోయి మీరు ఎవరోయి ఓహొ ఎవరోయి ఎలగనో" - ఎ.రత్నమాల తో వి.జె. వర్మ
  • పల్లె పడుచు (1954) లో "ఓ దీనులారా లేవు మొగసాల రంగవల్లికళు నేడు"[1]
  • ఎమ్మెస్ రామారావు గారి సంగీత దర్శకత్వంలో పల్లెపడుచు సినిమాలో " ఓ దీనులారా . . . " 
  • గుమ్మడి తొలి చిత్రం అదృష్టదీపుడు లో "తాళము తీసి నిను తప్పించి" అనే పాట [2]

ఇంకా ప్రియురాలు (1952), జగన్నాటక సూత్రధారి అనే తెలుగు సినిమాలలో ఓరి ఇరక అను తమిళ సినిమాలో కూడా పాడారు. తరువాత అవకాశాలు తగ్గి పోయాయి. ఒంటరితనంలో సంగీతం , ఫ్లూట్ (వేణువు తో కాలం గడిపాడు.[1] మద్రాస్ లో జ్వరం తో బాధపడి మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 విద్యుల్లత (2013-12-03). "అమావాస్య లో పండు వెన్నెల". సాక్షి. Retrieved 2024-10-10.
  2. రంగావఝల, భరధ్వాజ (2024-10-05). "పుట్టు గుడ్డి… పాడిందే పట్టుమని పదిహేను పాటలు… కానీ 'మెచ్చిన పాట'…". ముచ్చట. Retrieved 2024-10-10.