వెమలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెమలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం గజపతినగరం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,025
 - పురుషులు 501
 - స్త్రీలు 524
 - గృహాల సంఖ్య 279
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వెమలి, విజయనగరం జిల్లా, గజపతినగరం మండలానికి చెందిన గ్రామము.[1]

వేమలి అనేది ఒక మారుమూల గ్రామం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, గజపతినగరం మండలంలో ఉంది. ఈ గ్రామం కోడ్ 31. ఈ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా జన్మభూమి కార్యక్రమాన్ని అప్పటి గ్రామ సర్పంచ్ అయిన బైరెడ్డి అప్పలనాయుడు (2001-2006) ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి ఈ గ్రామాన్ని సందర్శించడానికి గల కారణం అప్పట్లో రాష్ట్రంలోని అందరు సర్పంచ్ లు పనికి ఆహార పథకంలో 2-5కేజీల బియ్యం కూలీలకు ఇచ్చేవారు. కానీీ వేమలి గ్రామ సర్పంచ్ మాత్రం 10-15 కేజీల బియ్యం కూలీలకు ఇచ్చేవారు. ఈ గొప్పతనాన్ని మెచ్చుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంత్రి హోదాలో వేమలి గ్రామంలో మహిళా జన్మభూమి కార్యక్రమాన్ని అప్పటి గ్రామ సర్పంచ్ అయిన బైరెడ్డి అప్పలనాయుడు (2001-2006) ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ను ముఖ్యమంత్రి ప్రశంశిస్తూ ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను (1-5తరగతులు) ప్రాథమికోన్నత పాఠశాల (1-7రతరగతులు) గా తీర్చిదిద్దారు. గ్రామానికి 100పక్కాగ్రుహాలను మంజూరు చేశారు.ఈ గ్రామానికి తారు రోడ్డును కూడా మంజూరు చేశారు.ఆ సంవత్సరంలో 10వ తరగతిలోమండలంలో మొదటి 10 ర్యాంకులు సాధించిన వారిలో ఒకడైన సుంకరి యశోద కృష్ణకు సర్పంచ్ అయిన బైరెడ్డి అప్పలనాయుడు 500/-రూ.లు నగదును సభా వేదికపైన బహూకరించడం జరిగింది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,025 - పురుషుల సంఖ్య 501 - స్త్రీల సంఖ్య 524 - గృహాల సంఖ్య 279

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2016-03-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-01. Cite web requires |website= (help)


"https://te.wikipedia.org/w/index.php?title=వెమలి&oldid=2813142" నుండి వెలికితీశారు