Jump to content

వేదము వేంకటరాయ శాస్త్రి

వికీపీడియా నుండి
(వేదము వెంకటరాయశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
వేదము వేంకటరాయ శాస్త్రి
వేదము వేంకటరాయ శాస్త్రి
జననంవేదము వేంకటరాయ శాస్త్రి
డిసెంబర్ 21, 1853
మరణంజూన్ 18, 1929
ప్రసిద్ధిసుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు , నాటకకర్త
తండ్రివేంకట రమణశాస్త్రి
తల్లిలక్ష్మమ్మ
Notes
1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించాడు

వేదము వేంకట రాయశాస్త్రి (డిసెంబర్ 21, 1853[1] - జూన్ 18, 1929) సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త

జీవిత సంగ్రహం

[మార్చు]

ఇతడు వేంకట రమణశాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు చెన్నైలో జన్మించారు. ఈయన 1886లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండితపదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించారు. 1887లో బి.ఎ. పరీక్షలలో ఆంగ్లం, సంస్కృతం లలో ప్రథమస్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. 1916లో సూర్యారాయాంధ్ర నిఘంటువుకు ప్రధాన సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు.

వెంకటరాయ శాస్త్రి గ్రాంథిక భాషావాది. సాహిత్య ప్రక్రియల్లో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని విమర్శించారు. ఈయన 1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించారు. ఈ సంస్థలో వెంకటరాయ శాస్త్రి వ్రాసిన నాటకాలని ప్రదర్శించేవారు. ఈయన మూల నాటకాలలో 1897లో వ్రాసిన ప్రతాపరుద్రీయ నాటకం, 1901లో వ్రాసిన ఉషా నాటకం ప్రముఖమైనవి[2] ఇవేకాక ఈయన అనేక సంస్కృత నాటకాలను తెనుగించారు.[3] వెంకటరాయ శాస్త్రి 1929, జూన్ 18న తెల్లవారు జామున 5:45కు మద్రాసులో మరణించారు.

వెంకటరాయ శాస్త్రి 1895లో హర్షుని నాగానందం తెనుగించి అందులోని నీచపాత్రల సంభాషణలకు వ్యవహారిక భాషను ఉపయోగించారు. ఈ ప్రయోగం సంస్కృత నాటకాల్లో నీచ పాత్రలకు ప్రాకృతాన్ని ఉపయోగించడం లాంటిదేనని సమర్ధించుకున్నారు. కానీ ఆనాటి సాంప్రదాయవాద సాహితీకారులు ఇది భాషాపతనం, సాహితీవిలువల దిగజారుడు అని విమర్శించారు. ఇందువలన సాహిత్యానికి జరిగిన నష్టాన్ని చర్చించడానికి పండితులు 1898 డిసెంబరులో మద్రాసులో సమావేశమయ్యారు. ఒకవైపు ఇలా విమర్శకులు విమర్శిస్తూ ఉండగానే, శాస్త్రి పంథాను అనేకమంది సృజనాత్మక సాహితీకారులు అనుకరించారు.[4][5]

గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషోద్యమాన్ని ప్రోత్సహించినవారు.1899 లో ఆంధ్ర భాషాభిమాన నాటక సమాజాన్ని స్థాపించారు. ఇతడు తెలుగులోకి అనువదించిన సంస్కృత నాటకాలు : హర్షుని నాగానందం (1891), అభిజ్ఞాన శాకుంతలం (1896), మాళవికాగ్నిమిత్రం (1919), ఉత్తర రామచరితం (1920), విక్రమోర్వశీయం, రత్నావళి (1921), ప్రతాపరుద్రీయం (1897), (ఇది ఓరుగల్లు ప్రభువైన,రెండవ ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక నిజమైన సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్ప నాటకం) ఇంకా ఉషానాటకం (1901), బొబ్బిలి యుద్ధం (1916) ఇతడు వ్రాసిన నాటకాలు.

వారసత్వం

[మార్చు]

వెంకటరాయ శాస్త్రి మనవడి పేరు కూడా వెంకటరాయశాస్త్రే. ఈయన తాతగారిలాగే నాటక రచయిత. వ్యామోహం మొదలైన నాటకాలను రచించారు. తాతగారి జీవితచరిత్రను "వేదం వెంకటరాయ శాస్త్రి జీవిత సంగ్రహము" పేరుతో వ్రాశారు. అలాగే తెలుగువారెవరు అనే పరిశోధనా గ్రంథాన్ని కూడా రచించారు. ఈయన అన్నదమ్ములు వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ అనే ప్రచురణాసంస్థను ప్రారంభించి అనేక తెలుగు పుస్తకాలను అచ్చువేశారు.[6]

గౌరవాలు

[మార్చు]
  • 1920 : ఆంధ్ర మహా సభ చేత 'మహోపాధ్యాయ' బిరుదుపొందారు.
  • 1922 : ద్వారక పీఠ శంకరభగవత్పాదులచేత 'సర్వతంత్ర స్వతంత్ర', 'మహామహోపాధ్యాయ', 'విద్యాదానవ్రత మహోదధి' అనే సత్కారాలు పొందారు.
  • 1927 : ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చేత 'కళా ప్రపూర్ణ' గౌరవంతో సన్మానించబడ్డారు.
  • 1958 : కుమార సంభవ ప్రబంధకర్త నన్నెచోడుని కవిత్వంపై వీరు రాసిన 'నన్నెచోడుని కవిత్వము' అనే విమర్శనా గ్రంథానికి 'ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి' బహుమతి లభించింది.

రచనలు

[మార్చు]
  • విసంధి వివేకము (1912)
  • శృంగార నైషధ సర్వంకష వ్యాఖ్య (1913)
  • బొబ్బిలి యుద్ధము (1916)
  • మాళవికాగ్నివిత్రము (1919)
  • తిక్కన సోమయాజి విజయము (1919)
  • ఉత్తర రామచరిత్ర (1920)
  • విమర్శ వినోదము (1920)
  • ఆంధ్ర హితోపదేశ చంపువు
  • ఆంధ్ర సాహిత్య దర్పణము
  • ఆముక్తమాల్యదా సంజీవినీ వ్యాఖ్య (1921)
  • రత్నావళి (1921)
  • బేతాళ సప్త వింశతి(?)
  • అమరుకావ్యము (ఆంధ్రవ్యాఖ్య) (1950)[7]
  • ఆంధ్ర దశకుమార చరిత్రము- దండి రాసిన సంస్కృత మూలానికి ఆంధ్ర గద్యానువాదం[8]

మూలాలు

[మార్చు]
  1. Vedam Venkataraya Sastry, Volume 189 By Vedam Venkataraya Sastri పేజీ.70
  2. http://www.indianetzone.com/33/vedam_venkataraya_sastry_indian_theatre_personality.htm
  3. History of Indian literature, Volume 1 By Sisir Kumar Das
  4. Paravastu Chinnaya Suri By Būdarāju Rādhākr̥ṣṇa, Sahitya Akademi పేజీ.53
  5. 20వ శతాబ్ది తెలుగు వెలుగులు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,. 2005.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  6. http://openlibrary.org/a/OL376309A/Vedam_Venkataraya_Sastri
  7. వేంకటరాయశాస్త్రి, వేదము (1950). అమరుకావ్యము. వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్. Retrieved 2020-07-13.
  8. వేదము, వేంకటరాయశాస్త్రి (1912). ఆంధ్ర దశకుమార చరితము.

బయటి లింకులు

[మార్చు]