Jump to content

వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2016-01వ వారం

వికీపీడియా నుండి
బాపు

ఆహుతి ప్రసాద్1958 జనవరి 2కోడూరు (ముదినేపల్లి) లో జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. నాన్న రంగారావు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు అక్కలు. అన్నదమ్ములెవరూ లేరు. కోడూరులో ఉన్న ఏడెనిమిది ఎకరాలు అమ్మేసి కర్నూలు సమీపంలో శాంతినగరం అనే చోట భూములు కొని మూడునాలుగేళ్ల వయసులోనే శాంతినగరానికి వచ్చేశారు. శాంతినగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని చంద్రశేఖరనగరం అనేచోట తాత, నాయినమ్మ కూడా ఉండేవారు. చివరికి రాయచూరు సమీపంలోని సింధనూరు దగ్గర పాండురంగ క్యాంప్‌లో స్థిరపడ్డారు. క్యాంపులో పెరిగినందువల్ల కన్నడ భాష బాగా పట్టుబడింది.

'ఆహుతి' సినిమాతో తనకు మంచి పేరొచ్చింది. అప్పట్లో ఆంధ్రప్రభలో పనిచేసే ఆంజనేయశాస్త్రి అనే పాత్రికేయుడు ఆయనను ఇంటర్వ్యూ చేసి తన గురించి పత్రికలో రాశారు. అందులో ఆయన... 'ఇక నుంచి ఇతను శంభుప్రసాద్ (ఆహుతి సినిమాలో పేరు) కాదు, జనార్దన వరప్రసాద్ ( అది అసలుపేరు) కాదు... ఆహుతి ప్రసాద్‌' అని రాశారు. దాంతో అందరూ అలాగే పిలవడం వెుదలుపెట్టారు. తర్వాత్తర్వాత చాలా మంది- పేరులో ఆహుతి ఏంటయ్యా, అర్జెంటుగా ఆ పేరు మార్చుకో అని చెప్పారు కానీ తానెంత ప్రయత్నించినా ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది.

'చందమామ' సినిమా ఆయన జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. స్నేహితులూ బంధువులూ అయినవాళ్లూ ఇన్నేళ్లుగా తనను ఎరిగినవాళ్లూ అందరూ ఆశ్చర్యపోవడమే. 'చందమామ'తో ఆయన కెరీర్‌గ్రాఫ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది.


చిత్ర సౌజన్యం: కె వెంకటరమణ