Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జనవరి 19

వికీపీడియా నుండి
జనవరి 19, 2008 (2008-01-19)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత్, మరియు ఆస్ట్రేలియా మధ్య పెర్త్ లో జరిగిన మూడవ టెస్టులో భారత్ ఒక రోజు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్ పై విజయం సాధించడం తనకు ప్రత్యేకమైన ఆనందాన్నిచ్చిందని భారత జట్టు సారథి అనిల్ కుంబ్లే తెలిపాడు. ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించినందుకుగాను ఇర్ఫాన్ పఠాన్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు.
  • రంజీ ట్రోఫీ చాంపియన్‌షిప్‌ను ఢిల్లీ గెలుచుకుంది. ముంబాయిలో జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ రంజీ జట్టు ఉత్తర ప్రదేశ్ జట్టుపై 9 వికెట్లతో విజయం సాధించింది. ఢిల్లీ రెండో ఇన్నింగ్సులో గౌతమ్ గంభీర్ అజేయ సెంచరీ సాధించాడు.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పోటీలలో భారత్ కు చెందిన సానియా మీర్జా మూడవ రౌండ్‌లో అమెరికాకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ చేతిలో 7-5, 6-4 తేడాతో పరాజయం.