శభాష్ సత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శభాష్ సత్యం
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.విశ్వనాథం
నిర్మాణం మహమ్మద్ నాజమ్
తారాగణం కృష్ణ,
రాజశ్రీ,
సత్యనారాయణ,
రాజబాబు,
ప్రభాకరరెడ్డి
సంగీతం విజయా కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ ప్రాత్నా ఫిలిమ్స్
భాష తెలుగు

శభాష్ సత్యం 1969, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు సినిమా.జి.విశ్వనాథం దర్సకత్వంలో, ఘట్టమనేని కృష్ణ, రాజశ్రీ, సత్యనారాయణ,రాజ బాబు, ప్రభాకర్ రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకి,సంగీతం విజయ కృష్ణమూర్తి అందించారు.

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాత: ఎం.డి.నాజమ్‌
  • దర్శకత్వం:జి.విశ్వనాథం
  • మాటలు: ఆత్రేయ
  • పాటలు: ఆత్రేయ, దాశరథి, కొసరాజు
  • సంగీతం: విజయా కృష్ణమూర్తి
  • నేపథ్య గాయకులు: ఘంటసాల, సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాఘవన్

నటీనటులు[మార్చు]

  • కృష్ణ - సత్యం
  • సత్యనారాయణ - గిరి
  • రాజబాబు - టిప్ టాప్
  • ధూళిపాళ - సైంటిస్టు దయానంద్
  • ప్రభాకర్ రెడ్డి - పోలీస్ ఇన్‌స్పెక్టర్
  • జయకృష్ణ - సత్యం చెల్లెలి భర్త
  • రాజశ్రీ - ఛాయ
  • విజయలలిత - మంజు
  • మణిమాల - సత్యం చెల్లెలు
  • మాలతి
  • ఛాయాదేవి - సైంటిస్టు భార్య
  • విజయభాను
  • మోదుకూరి సత్యం - గిరి నౌకరు
  • నాగభూషణం - రామకోటయ్య
  • వంగర

కథా సంగ్రహం[మార్చు]

సత్యం తన చెల్లెలి మామగారికి కట్నం తాలూకు బాకీ చెల్లించేందుకు వారింటికి వెళతాడు. కానీ గిరి అనే విలన్ అంతకు ముందే అతడిని హత్యచేసి డబ్బు దోచుకుని పారిపోతాడు. తెలివిగా ఆ నేరాన్ని ఆ సమయంలో అక్కడికి వచ్చిన సత్యంపై మోపుతాడు. సత్యం పారిపోయి తన సైంటిస్టు మేనమామ కనిపెట్టిన ఒక ద్రావకాన్ని తాగుతాడు. దాని ఫలితంగా రూపం కోల్పోయి అదృశ్యవ్యక్తిగా చలామణీ అవుతాడు. అందరూ అతడిని అనుమానిస్తారు. ఈ అవకాశాన్ని గిరి బాగా వాడుకుని అనేక నేరాలు చేసి వాటిని సత్యంపై నెట్టేస్తాడు. చివరలో సత్యం తిరిగి ఆ సైంటిస్టు తయారు చేసిన మరో ద్రావకాన్ని త్రాగి తన యథారూపాన్ని మళ్ళీ పొంది నేరస్థుని పోలీసులకు పట్టిస్తాడు. మేనమామ కూతురు ఛాయను వివాహం చేసుకుంటాడు[1].

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు విజయా కృష్ణమూర్తి సంగీతం కూర్చాడు[2].

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నాలో నిన్ను చూడు"దాశరథిపి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం4:00
2."మెకొలా మెకొలా బుం బుంక బుం"దాశరథిపి.సుశీల5:00
3."ఇటు రావె రావె బంగారు చిలకమ్మ"కొసరాజుఎల్.ఆర్.ఈశ్వరి, ఎ.ఎల్.రాఘవన్2:35
4."కలలు నిజాలై కనులు వరాలై"ఆత్రేయపి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం4:00
5."ఎక్కడికో ఎందుకో ఈ పరుగు"ఆత్రేయఘంటసాల5:00
6."కాలు వేసావా కాటు వేస్తాను"ఆత్రేయపి.సుశీల5:00
Total length:25:35

మూలాలు[మార్చు]

  1. డి.కె.ఎం. "చిత్ర సమీక్ష:శభాష్ సత్యం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. 18 April 1969. Retrieved 9 August 2020.[permanent dead link]
  2. https://chitrabhumi.blogspot.com/2015/01/shabhash-satyam.html