శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ (పుస్తకం)
స్వరూపం
శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ (పుస్తకం) | |
శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ (పుస్తకం) | |
కృతికర్త: | వ్యాస సంకలనం |
---|---|
సంపాదకులు: | నందిని సిధారెడ్డి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | తెలంగాణ చరిత్రపై కవిత్వం |
ప్రచురణ: | మాజీ చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ |
విడుదల: | డిసెంబరు, 2017 |
పేజీలు: | 282 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 978-16-3535709-7 |
శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన తొలి పుస్తకం. శాతవాహనుల కాలం నుండి కాకతీయుల కాలం వరకుగల తెలంగాణ చరిత్ర, భాష, సంస్కృతి, సాహిత్యం గురించి ఇందులో రాయబడింది.[1]
సంపాదకవర్గం
[మార్చు]- గౌరవ సంపాదకులు: నందిని సిధారెడ్డి
- సంపాదకులు: ఆచార్య జి. అరుణ కుమారి, డా. మల్లెగోడ గంగాప్రసాద్
రూపకల్పన
[మార్చు]2017లో ఏర్పడిన తెలంగాణ సాహిత్య అకాడమీ తెలంగాణ సాహిత్య పరిశోధనకు, అధ్యయనానికి అనేక కృషి చేస్తుంది. అందులో భాగంగా మొదటగా శాతవాహనుల నుండి కాకతీయుల వరకు గల భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి వంటి అంశాలపై శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ అనే పేరిట వారధి అసోసియేషన్, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపకుల సహకారంతో 2017 అక్టోబరు 27, 28 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించబడింది. ఆ సదస్సులో వక్తలు సమర్పించిన పరిశోధనాపత్రాలతో ఈ పుస్తకం ప్రచురితమయింది.[1]
విషయసూచిక
[మార్చు]- శాతవాహనులు ముందు తెలంగాణ చరిత్ర (కె.ఎస్.బి. కేశవ)
- శాతవాహన సామ్రాజ్య ప్రారంభ దశ - తెలంగాణ మూలాలు (డా. అవధానం ఉమామహేశ్వర శాస్త్రి)
- శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ (డా. డి. రాజారెడ్డి)
- తెలంగాణలో ఛందోవికాస దశలు (నడుపల్లి శ్రీరామరాజు)
- తెలుగుకు పుట్టినిల్లు తెలంగాణం (డా. సంగనభట్ల నర్సయ్య)
- తెలంగాణలో తెలుగు లిపి, పదజాల వికాసం (డా. వై. రెడ్డి శ్యామల)
- తెలంగాణలో శైవమతం (డి. వెంకటరామయ్య)
- తెలంగాణ చరిత్ర - సంస్కృతి (శ్రీరామోజు హరగోపాల్)
- తెలంగాణలో సంస్కృత సాహిత్య వికాసం (డా. ముదిగంటి సుజాతారెడ్డి)
- ఇక్ష్వాకుల కాలం లో తెలంగాణ (డా. ఈమని శివనాగిరెడ్డి)
- విష్ణుకుండినులు - తెలంగాణ (డా. భిన్సూరి మనోహరి)
- పాల్కురికి సోమనకు ముందున్న తెలంగాణ తెలుగు కవులు (డా. మల్లెగోడ గంగాప్రసాద్)
- తమిళ సంగసాహిత్యంలో సాతవాహనుల, కాకతీయుల ప్రస్తావన (ఆచార్య ఎస్. జయప్రకాశ్)
- ప్రాచీన తెలంగాణ 'లాక్షణికులు' (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు)
- కాకతీయ శాసనాలు సామాజిక చరిత్ర (డా. సమ్మెట నాగమల్లేశ్వరరావు)
- బాదపుర శాసనాలు - చరిత్ర, సంస్కృతి, భాష సాహిత్యం (ఆచార్య జి. అరుణ కుమారి)
- మధ్యయుగ కర్ణాటకలో కాకతీయ సామ్రాజ్య విసృతి: ప్రభావ ప్రదానాలు (ఆచార్య యస్. శ్రీనాథ్)
- కులపురాణాలు-తెలంగాణ సంస్కృతి (డా. ఏలె లక్ష్మణ్)
- తెలంగాణ సంస్కృతిలో నృత్యకళ నృత్తరత్నావళి (డా. కె. సువర్చలా దేవి)
- తెలంగాణ శతక సాహిత్యం (డా. దేవారెడ్డి విజయలక్ష్మి)
- వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి (ఆచార్య రేమిల్ల వేంకట రామకృష్ణ శాస్త్రి)
- తెలుగు చారిత్రక నవలల్లో కాకతీయుల చిత్రణ - వాస్తవికత (ఎ.వి.వి.కె. చైతన్య)
- తెలంగాణ తొలి చారిత్రక వచన రచన-ప్రతాపరుద్ర చరిత్రము (దొడ్ల సత్యనారాయణ)
- ప్రాచీన రాతప్రతుల్లో తెలుగు లిపి : విశ్లేషణ (డా. పాలెపు సుబ్బారావు)
- శుద్ధ ముక్తిమార్గం - పాల్కురికి "అనుభవసారం" (డా. వి. త్రివేణి)
- ప్రాచీన తెలంగాణ ఉవన తాత్త్వికత (వాడ్రేవు చినవీరభద్రుడు)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 మన తెలంగాణ, కలం (6 May 2019). "ప్రచురణల్లో మేటి తె.సా. అకాడమీ". రాయారావు సూర్యప్రకాశ్ రావు. Archived from the original on 4 February 2020. Retrieved 8 February 2020.
ఇతర లంకెలు
[మార్చు]- తెలంగాణ సాహిత్య అకాడమీ వెబ్సైటులో పుస్తక ప్రతి Archived 2020-02-04 at the Wayback Machine