శిలాగుహ చిత్రకళ
శిలాగుహ చిత్రకళ (ఆంగ్లం: Cave Painting) పాతరాతియుగం (14,000 నుండి 40,000 ఏళ్ళ పూర్వం) లో శిలాగుహలపై వేయబడ్డ చిత్రలేఖనాలు, చెక్కబడ్డ నగిషీలు.[1] అప్పటి మనుషులచే చిత్రీకరించబడ్డ, అప్పటి ఆచారాల, నమ్మకాల, భౌతిక ప్రపంచం యొక్క చిత్రపటాలు. [2] ఇవి ప్రధానంగా భారతదేశం, ఫ్రాన్స్, స్పెయిన్, ఉత్తర/దక్షిణ ఆఫ్రికా దేశాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేషియా లో కలవు.
చరిత్ర
[మార్చు]ప్రదేశాలు
[మార్చు]స్పెయిన్ లోని ఆల్టామీరా ఉన్న శిలాగుహ చిత్రలేఖనాలు పాతరాతియుగం నాటివి కావటం వలన, ఇప్పటి వరకు ఉన్న వాటిలో అతి ప్రాచీనమైనవిగా గుర్తించబడ్డాయి. ఆ యుగానికి చెందిన మనుషులే (హోమో సాపియన్స్) వీటిని చిత్రీకరించారని ధృవించబడింద్. శిలాగుహ చిత్రలేఖనాలు ఎక్కువగా స్పెయిన్ ఫ్రాన్సు దేశాలలో కనబడిననూ, పోర్చుగల్, ఇంగ్లాండు, ఇటలీ, రొమేనియా, జర్మనీ, రష్యా, ఇండోనేషియా లలో కూడా వీటి దాఖలాలు కలవు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 చోట్ల శిలాగుహ చిత్రలేఖనాల ఉనికి ఉంది.[1]
ఉపయోగించబడిన వస్తువులు
[మార్చు]శిలాగుహ చిత్రలేఖనాలలో చాలా మటుకు ఎరుపు లేదా నలుపు రంగులలో చిత్రీకరించబడ్డవి. Iron Oxide లతో ఎరుపు రంగు, Manganese Dioxide, కర్ర బొగ్గు లతో నలుపు రంగును తయారు చేశారు. చదునుగా ఉండే శిలల పై చేతి వ్రేళ్ళను, కరకుగా ఉండే శిలల పై చెకుముకిరాయిని కుంచెగా ఉపయోగించారు. [1]
చిత్రీకరించబడిన అంశాలు
[మార్చు]ప్రధానంగా మనుషుల బొమ్మలు వేయబడినను, అక్కడక్కడా కేవలం మనుషుల తలలు, లేదా కేవలం జనాంగాలు కూడా చిత్రీకరించబడినవి. ఫ్రెంచి పిరినీస్ లోని గార్గాస్ గుహలలో చేతి ముద్రలను అచ్చు వేశారు. అన్ని కాలాలలోను, జంతువుల చిత్రలేఖనాలు కూడా సింహ భాగాన్ని ఆక్రమించాయి. ఫ్రాన్స్ లోని Chauvet-Pont-d'Arc (షావె పాంట్ డార్క్) లో ఇప్పుడు అంతరించి పోయిన జాతుల సింహాలు, ఏనుగులు, ఎలుగు బంట్లు చిత్రీకరించబడ్డవి. Lascaux, Niaux గుహలలో గుర్రాలు, అడవి దున్నలు, జింకలు, మేకలు చిత్రీకరించబడ్డవి.[1] పక్షులు, చేపలు అక్కడక్కడా చిత్రీకరించబడ్డవి. రేఖాగణిత అంశాలు చాలామటుకు చిత్రీకరించబడ్డవి.
అర్థాలు
[మార్చు]శిలాగుహ చిత్రలేఖనం, సాధారణంగా సంకేతాలను , లేదా మతపరమైన అంశాలను తెలుపటానికి ఉపయోగించబడ్డదనే భావింపబడుతోంది. [1]
ప్రపంచ వ్యాప్తంగా శిలాగుహ చిత్రకళ
[మార్చు]ఆసియా
[మార్చు]పశ్చిమ చైనా, మంగోలియా లలో గుర్రం యొక్క చిత్రలేఖనాలు కలవు.[3]
ఇండొనేషియా
[మార్చు]20వ శతాబ్దంలో ఇండోనేషియా లో బయటపడ్డ శిలాగుహ చిత్రకళ 40,000 ఏళ్ల క్రితం నాటివి.[4] బోర్నియో దీవి అనే ప్రదేశం లో ఇవి బయటపడ్డాయి. 2026 లో జరిగిన అధ్యయనాలు ప్రకారం, సులవేసి ప్రాంతంలో బయటపడ్డ చిత్రలేఖనాలు 67,000 ఏళ్ళ క్రితం నాటివి.
ఓషీనియా
[మార్చు]ఆస్ట్రేలియా
[మార్చు]ఉత్తర ఆస్ట్రేలియా లో ఆర్న్హెం ల్యాండ్ పీఠభూమిపై ఉన్న నవర్లా గబర్న్ మాంగ్ శిలలలో చిత్రలేఖనాలు ఉన్నాయి. 28,000 ఏళ్ళ క్రితంగా అంచనా వేయబడ్డ ఈ చిత్రలేఖనాలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. ఇక్కడ చేపలు, కంగారూలు, ఎక్స్-రే శైలిలో చిత్రీకరించబడి ఉన్నాయి.[4][5][6][7]
న్యూజిలాండ్
[మార్చు]న్యూజిలాండ్ లోని ఉత్తర ఒటాగో, దక్షిణ కాంటర్బెరీ లో పలు శిలాగుహ చిత్రలేఖనాలు కలవు. [8]
టాకిరోవా గుహలలో పక్షులు, మానవులు, జంతువులు, ఐరోపా ఖండం నుండి వచ్చే నావలు తో బాటు పలు నైరూప్య (Abstract) చిత్రలేఖనాలు కలవు. [8]
- టాకిరోవా శిలాగుహ చిత్రలేఖనాలు
ఆఫ్రికా
[మార్చు]ప్రస్తుతపు లెసోతో, మలావి, మొజాంబిక్ ప్రదేశాలలో శిలాగుహ చిత్రలేఖనాలు ఉన్నవి. 1969 నుండి 1972 వరకు పురాతత్వ శాస్త్రవేత్తలు దక్షిణ నమీబియా లో నలుపు, ఎరుపు, తెలుపు రంగులతో వేయబడ్డ శిలాగుహ చిత్రలేఖనాలు కనుగొన్నారు. ఇవి 30,000 ఏళ్ళ నాటివి అని తేల్చారు. దక్షిణాఫ్రికా లోని బ్లోంబోస్ గుహ లో బయటపడ్డ చిత్రలేఖనాలు 75,000 ఏళ్ళ క్రితం నాటివి. విల్లంబులను భుజాన తగిలించుకొన్న చిత్రపటాలు ఇక్కడ కలవు. ఐరోపా వలసదారులు, రైలు బండ్లు, పిస్తోళ్ళు, 19వ శతాబ్దం లో ఐరోపా లో ఫ్యాషన్లుగా ఉన్న టోపీలు, బూట్లు, వస్త్రధారణ చిత్రపటాలలో ఉన్నవి. [4][9]
- ఆఫ్రికా శిలాగుహ చిత్రలేఖనాలు
-
నమీబియా
-
దక్షిణ ఆఫ్రికా
-
దక్షిణ ఆఫ్రికా - ఏనుగు
-
దక్షిణ ఆఫ్రికా
ఉత్తర అమెరికా
[మార్చు]దక్షిణ అమెరికా
[మార్చు]అరూబా
[మార్చు]- అరూబా గుహలలో చిత్రలేఖనాలు
బ్రెజిల్
[మార్చు]తూర్పు బ్రెజిల్ లోని సెర్రా డీ కాపివరా లో ఉన్న శిలాగుహ చిత్రలేఖనాలు 25,000 - 50,000 సంవత్సరాల పురాతనమైనవి. నర్తించే/వేటాడే/పోట్లాడే/సంభోగించే మనుషులు, జంతువులు, వంటివి ఇక్కడ చిత్రీకరించబడి ఉన్నాయి. ఎరుపు రంగు ఎక్కువగా వినియోగించబడింది. [4]
- సెర్రా డీ కాపివరా గుహలలో చిత్రలేఖనాలు
అర్జెంటీనా
[మార్చు]అర్జెంటీనా లో శాంటా క్రూజ్ ప్రాంతం లో కూవే డి లస్ మానోస్ (Cave of Hands) లో కూడా శిలాగుహ చిత్రలేఖనాలు ఉన్నాయి.[4] ఇవి 13,000 నుండి 9,500 ఏళ్ళ క్రితం చిత్రీకరించబడి ఉండవచ్చని అనుభవజ్ఞులు తెలిపారు. పలు చేతి ముద్రలు, వేట దృశ్యాలు, ఇప్పటికీ ఈ ప్రాంతంలో మనం చూసే జంతువులు వంటి వాటిని చిత్రీకరించడం జరిగింది. ఐరోపా ఖండం నుండి వలస వచ్చిన ఒక వేటాడే తెగ వీటిని చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. [10] పలు రేఖాగణితం అంశాలు, వంకరటింకర గీతలు, బిందువులు కూడా చిత్రీకరించబడ్దాయి. ఈ చిత్రలేఖనాల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇదమిత్థంగా తెలియకపోయినను, సాంప్రదాయిక ఘట్టాలలో భాగంగానో, పొలిమేరలు సూచించటానికో అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 1991లో యునెస్కో ఈ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తించింది. [11]
- కూవే డి లస్ మనోస్ చిత్రలేఖనాలు
-
కొన్ని విచిత్ర జంతువులు
-
వంకర టింకర గీతలు
-
వృత్తాలు, ఒంటెను పోలిన జంతువులు,
-
ఒంటెను పోలిన మరిన్ని జంతువులు
-
కొన్ని జంతువులు
-
ఒక మనిషి
-
ముద్రలుగా కాకుండా చేతుల చిత్రలేఖనం
ఐరోపా
[మార్చు]బల్గేరియా
[మార్చు]బల్గేరియా లో విదిన్ జిల్లాలోని రబీషా అనే గ్రామం కూ సమీపం లో ఉన్న మగూరా గుహల్లో చిత్రలేఖనాలు కలవు. కోటిన్నర్ర సంవత్సరాల క్రింద ఈ చిత్రలేఖనాలు జరిగి ఉండవచ్చు. [12]
- మగూరా శిలాగుహ చిత్రలేఖనాలు
ఫ్రాన్స్
[మార్చు]లసాక్స్
[మార్చు]లసాక్స్ లో శిలాగుహ చిత్రలేఖనాలు 1940 లో కనుగొనబడ్డాయి.[13] ఖచ్చితంగా ఎప్పుడు ఈ చిత్రలేఖనాలు వేయబడ్డాయనేది చర్చైనీయాంశం. చిత్రీకరించబడ్డ జంతువులపైనే మరల మరల వేరే జంతువులను చిత్రీకరించటం, చిన్నగా చిత్రీకరించబడ్డ గుర్రాలు, పెద్దగా చిత్రీకరించబడ్ద ఎడ్లు, చిత్రీకరించబడిన విధానాలలో తేడాలు, ఒకే మారు అన్నీ చిత్రీకరించబడ్డాయా, వేర్వేరు సందర్భాలలోనా అనే ప్రశ్నలు, వీటన్నింటికీ దొరికే సమాధానాలు లసాక్స్ శిలాగుహ చిత్రకళ సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. [14]
- లసాక్స్ శిలాగుహ చిత్రలేఖనాలు
-
వివిధ పరిమాణాలలో లసాక్స్ చిత్రలేఖనాలు
-
మనిషిని ఒక అడవి దున్న వధించిన దృశ్యం వలె ఉన్న ఒక చిత్రలేఖనం
-
ఒక గుర్రం
-
ఒక రాక్షస జింక
-
నీటిలో ఈదుతోన్న జింకలు
షావే గుహలు, వేజేర్ లోయలో ఉన్న ఏయ్జీస్ డి టయాక్ తో బాటు ఇంకా 150 ప్రదేశాలలో శిలాగుహ చిత్రలేఖనం కలదు. 1994 లో ఆర్డేష్ ప్రాంతంలోని వాలోన్ పాంట్ డ్'ఆర్క్ లో పలు ఖడ్గమృగాలు, ఎలుగుబంట్లు, గుడ్లగూబల చిత్రలేఖనాలు బయటపడ్డాయి.[3]
స్పెయిన్
[మార్చు]అల్టామీరా
[మార్చు]ఉత్తర స్పెయిన్ లో సాన్ టాండర్ అనే ఓడరేవు పట్టణానికి 30 కి.మీ దూరం లో కాంటాబ్రియా అనే ప్రాంతంలో ఉన్న అల్టామీరా గుహలలో ఉన్న చిత్రకళలకు గాను, 1985లో ఆ గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గా ప్రకటించింది. [15] 1868 లో మొదట ఒక వేటగాడు ఈ గుహలను కనుగొన్నాడు. 1880 లో అక్కడి స్థానికుడు త్రవ్వకాలు జరుపగా అక్కడ కొన్ని చిత్రలేఖనాలు కనబడ్డాయి. తొలుత ఇవి నకిలీవి అనుకొన్న కళా చరిత్రకారులు, కాలక్రమేణా అవి అసలువే అనే నమ్మకం వారికి కలిగింది. ఈ చిత్రలేఖనాలు ఎరుపు, ఊదా, నలుపు రంగులో వేయబడ్డాయి. శాస్త్రవేత్తలు ఈ చిత్రలేఖనాలు కనీసం 15,000 సంవత్సరాల క్రితంవిగా తేల్చారు.
- అల్టామీరా శిలాగుహ చిత్రలేఖనాలు
దక్షిణ అమెరికా
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Cave Art". britannica.com. Retrieved 21 January 2022.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ Mazonowicz 1975, p. 2.
- ↑ 3.0 3.1 "The Legacy of Cave Paintings | Encyclopedia.com". www.encyclopedia.com. Retrieved 2026-03-27.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 "Rock art, drawing, painting, or similar work on or of stone, usually from the ancient or prehistoric era, though it continued to be practiced in some areas of Africa during the 19th century and possibly later. Important sites are located in Europe, Asia, Africa, Australia, and North and South America. | Britannica". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2026-03-27.
- ↑ ABC Indigenous (2025-03-05), Djimubarn, Sacred rock art shelter - This Place, retrieved 2026-04-18
- ↑ ABC News (Australia) (2025-07-12), Murujuga rock art granted World Heritage status | ABC NEWS, retrieved 2026-04-18
- ↑ ABC Australia (2020-11-13), Rock paintings depict historical event from thousands of years ago | NAIDOC Week | ABC Australia, retrieved 2026-04-18
- ↑ 8.0 8.1 "Takiroa Rock Art Shelter | NZ History". nzhistory.govt.nz. Retrieved 2026-04-18.
- ↑ The British Museum (2016-01-07), What is African rock art?, retrieved 2026-04-18
- ↑ Centre, UNESCO World Heritage. "Cueva de las Manos, Río Pinturas". UNESCO World Heritage Centre (in ఇంగ్లీష్). Retrieved 2026-04-11.
- ↑ Encyclopedia, Britannica. "Cueva de las Manos". Retrieved 2026-04-11.
- ↑ Centre, UNESCO World Heritage. "The Magoura cave with drawings from the bronze age". UNESCO World Heritage Centre (in ఇంగ్లీష్). Retrieved 2026-04-22.
- ↑ Windels 1949, p. 11.
- ↑ Windels 1949, p. 12.
- ↑ Encyclopedia, Britannica. "Altamira". britannica.com. Retrieved 2026-03-26.
రెఫరెన్స్
[మార్చు]- Mazonowicz, Douglas (1975). A search for Cave and Canyon Art: Voices from the Stone Age. London: George Allen and Unwin, London. ISBN 004759005X.
- Marcus, Rebecca B (1968). Prehistoric Cave Paintings. Franklin Watts.
- Samachson, Dorothy and Joseph (1970). The First Artists. Double Day and Company.
- Windels, Fernand (1949). The Lascaux Cave Paintings. Faber and Faber.
- Patent, Dorothy Hinshaw (1999). Myster of the Lascaux Cave. New York : Benchmark Books.
{{cite book}}: CS1 maint: publisher location (link) - Bataille, Georges (1955). Lascaux, Or the Birth of Art. Skira.
- Griffiths, John (1896). The paintings in the Buddhist cave-temples of Ajantâ, Khandesh, India. London.
- Gray, Basil (1959). Buddhist cave paintings at Tun-huang. University of Chicago Press.
- Singh, Madanjeet (1965). Ajanta painting of the sacred and the secular. The MacMillan Company, New York.
- Chauvet, Jean-Marie (1996). Dawn Of Art, The Chauvet Cave, The Oldest Known Paintings In The World. Harry N.Abrams, Incorporated, New York, A Times Mirror Company.
- Rodley, Lyn (1985). Cave monasteries of Byzantine Cappadocia. Cambridge University Press.
- Grove, David C (1970). The Olmec paintings of Oxtotitlan Cave, Guerrero, Mexico. Washington, Dumbarton Oaks.

