కర్ర బొగ్గు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొడి కర్ బొగ్గు
కర్ర బొగ్గు దహనం

కర్ర బొగ్గు (Charcoal) అనేది ముదురు బూడిద రంగులో ఉండే ఒక అవశేషం, దీనిలో స్వచ్ఛంగాలేని కర్బనం ఉంటుంది, జంతు మరియు వృక్ష పదార్థాల నుంచి నీరు మరియు ఇతర అస్థిరమైన భాగాలను తొలగించడం ద్వారా దీనిని సేకరిస్తారు. సాధారణంగా చెక్కను లేదా ఆక్సిజన్ లేకుండా ఇతర పదార్థాలను దహనం చేసి నెమ్మదైన పైరాలసిస్ (తాపనం ద్వారా ఒక పదార్థం రూపాంతరణ చెందే ప్రక్రియ) ద్వారా కర్ర బొగ్గును తయారు చేస్తారు (పైరాలసిస్, చార్ మరియు బయోచార్‌లను చూడండి). తద్వారా ఏర్పడే మృదువైన, పెళుసైన, తేలికపాటి, నల్లని, సచ్ఛిద్ర పదార్థం బొగ్గును పోలివుంటుంది.[1]

పదచరిత్ర[మార్చు]

ఈ పదంలో మొదటి భాగం యొక్క మూలం అస్పష్టంగా ఉంది, అయితే ఆంగ్లంలో "కోల్" (బొగ్గు) అనే పదాన్ని మొదట చార్‌కోల్ (కర్ర బొగ్గు)ను సూచించేందుకు ఉపయోగించారు.[ఉల్లేఖన అవసరం] ఈ మిశ్రమ పదంలో ముందు భాగమైన "ఛార్-" అంటే "మార్పు", వ్యాచ్యంగా దీనర్థం "బొగ్గుగా మారడం". చార్ యొక్క స్వతంత్ర ఉపయోగంలో మండించడం, కర్బనాన్ని తగ్గించడం అనే అర్థాలు ఉన్నాయి, ఇది సమకాలీన ఉపయోగాన్ని సూచిస్తుంది, పూర్వ చార్‌కోల్ నుంచి ఒక వెనుకటి-నిర్మాణంగా భావిస్తున్నారు. ఇది మారు అనే అర్థం వచ్చే చారెన్ లేదా చుర్న్ అనే పదం యొక్క ఒక ఉపయోగం కూడా కావొచ్చు; అంటే కలప మార్పు చెందుతుంది లేదా బొగ్గుగా మారుతుంది లేదా ఫ్రెంచ్ భాషలోని చార్బన్ నుంచి కూడా దీనిని స్వీకరించివుంటారనే భావన ఉంది. కర్ర బొగ్గు తయారు చేసే ఒక వ్యక్తిని గతంలో కొల్లియెర్ (బొగ్గుల వ్యాపారి)గా గుర్తించేవారు (చెక్క బొగ్గుల వ్యాపారిగా కూడా గుర్తించేవారు). కొల్లియెర్ అనే పదం బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులు లేదా బొగ్గుతో పని చేసేవారికి కూడా ఉపయోగిస్తారు, అంతేకాకుండా బొగ్గును రవాణా చేసే నౌకలను సూచించేందుకు కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు.[ఉల్లేఖన అవసరం]

చరిత్ర[మార్చు]

గడ్డి లేదా మట్టితో కప్పడానికి మరియు నిప్పు అంటించడానికి ముందు కలప కుప్ప (సుమారుగా 1890)
USAలోని అరిజోనాలో వాకర్ సమీపంలో వదిలిపెట్టిన కర్ర బొగ్గు కొలిమి.

చారిత్రాత్మకంగా, పురాతన కాలం నుంచి కలప వనరులు సమృద్ధంగా ఉన్న ప్రాంతాల్లో కర్ర బొగ్గు ఉత్పత్తి జరిగేది, సాధారణంగా కలప దిమ్మెలను వాటి చివరి భాగాల్లో కలిపి కట్టి శంక్వాకారంలో నిలబెడతారు, గాలి ప్రవేశించేందుకు అడుగు భాగంలో ఖాళీలను ఉంచేవారు, మధ్యలో ఉన్న దిమ్మె ఒక పొగ గొట్టంగా పని చేస్తుంది. మొత్తం దిమ్మెల దొంతరను గడ్డి లేదా తడి మట్టితో కప్పుతారు. పొగ గొట్టం అడుగు భాగం వద్ద నిప్పు పెడతారు, తరువాత క్రమంగా మంటలు పక్కలకు మరియు పైభాగానికి వ్యాపిస్తాయి. ఈ మొత్తం పని విజయవంతం కావడం దహనం యొక్క స్థాయిపై ఆధారపడివుంటుంది. సాధారణ పరిస్థితుల్లో 100 పాళ్ల కలప పరిమాణం పరంగా 60 పాళ్లు లేదా బరువు పరంగా 25 పాళ్ల బొగ్గును ఇస్తుంది: ఈ పద్ధతిలో తక్కువ మొత్తంలో కలపను దహనం చేసినట్లయితే తరచుగా 50% మాత్రమే కర్ర బొగ్గు వస్తుంది, పెద్ద మొత్తంలో కలపను దహనం చేస్తే 90% వరకు ఫలాన్ని పొందవచ్చు, 17వ శతాబ్దం వరకు ఈ ప్రక్రియలో ఈ స్థాయి ఫలితాలను సాధించారు. ఈ పని బాగా సున్నితమైనది కావడం వలన దీనిని సాధారణంగా బొగ్గు తయారీదారులకు (నిపుణ కర్ర బొగ్గు కూలీలు) అప్పగించేవారు.

కర్ర బొగ్గు యొక్క భారీస్థాయి ఉత్పత్తి (ఆల్ఫిన్ మరియు పరిసర ప్రాంత అడవుల్లో వేలాది మందికి ఈ పని ఉపాధి కల్పించింది) ముఖ్యంగా మధ్య ఐరోపాలో అటవీ నిర్మూలనకు ఒక ప్రధాన కారణంగా ఉంది. ఇంగ్లాండ్‌లో దీని కోసం ఉపయోగించిన చెట్లు ఎక్కువగా పొదలుగా ఉన్నాయి, వీటిని నరికినప్పటికీ, అవి తిరిగి త్వరగా పెరిగేవి, అందువలన కర్ర బొగ్గు నిరంతర సరఫరా సాధ్యపడింది; (స్టువర్ కాలం నుంచి) ఎక్కువగా తాత్కాలిక మితిమీరిన వినియోగం లేదా పెరుగుతున్న గిరాకీకి తిగినట్లుగా ఉత్పత్తి పెంచడంలో వైఫల్యాల వలన కొరతకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. సులభంగా పండించగల కలపకు కొరత పెరిగిపోవడంతో పారిశ్రామిక ఉపయోగం కోసం శిలాజ ఇంధనాలు, ప్రధానంగా బొగ్గు మరియు చెక్క బొగ్గు వంటివాటిని సేకరించడంపై దృష్టి పెట్టారు.

కాస్ట్ ఐరన్ రెటార్ట్‌లలో చిన్న ముక్కలు లేదా చెక్క పొడి‌గా కలపను కర్బనీకరణ చేయడానికి సంబంధించిన ఆధునిక ప్రక్రియను కలప కొరత ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు, అంతేకాకుండా అనుమతులతో విలువైన ఉపఉత్పత్తులు సేకరించేందుకు (కలప సారా, పైరోలిగ్నెయస్ యాసిడ్, కలప తారు) కూడా ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు. కార్బనైజేషన్ (కర్బనీకరణం) యొక్క ఉష్ణోగ్రత ముఖ్యమైన ప్రశ్నగా ఉంది; జే. పెర్సీ ప్రతిపాదన ప్రకారం కలప 220 °C (సెల్సియస్) వద్ద కపిల వర్ణంలోకి మారుతుంది-తరువాత కొంత సమయానికి 280 °C వద్ద నలుపు రంగులోకి మారుతుంది, ఆపై 310 °C సులభంగా పొడి చేయగల ద్రవ్యరాశిగా రూపాంతరం చెందుతుంది.[ఉల్లేఖన అవసరం] కర్ర బొగ్గు 300° వద్ద కపిల, మృదువైన మరియు పెళుసైన మారుతుంది, 380 °C వద్ద సులభంగా మండించగల స్థితికి చేరుకుంటుంది; అధిక ఉష్ణోగ్రతల వద్ద తయారు చేసిన బొగ్గుకు కఠినత్వం మరియు పెళుసుదనం ఉంటుంది, 700 °C వరకు వేడి చేసే వరకు ఇది మండదు.

ఫిన్లాండ్ మరియు స్కాండినేవియా దేశాల్లో కర్ర బొగ్గును కలప తారు తయారీలో ఉప-ఉత్పత్తిగా పరిగణిస్తారు. ఉత్తమమైన తారు దేవదారు చెట్ల నుంచి వస్తుంది, అందువలన దేవదారు కలపను తారు పైరాలసిస్ కోసం ఉపయోగిస్తారు. అవశేషంగా మిగిలే కర్ర బొగ్గును స్మెల్టింగ్ కోసం కొలిమిల్లో లోహసంగ్రహణ బొగ్గుకు ప్రత్యామ్నాయంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తారు ఉత్పత్తి వేగంగా అడవుల నిర్మూలనకు దారితీసింది: అన్ని ఫిన్లాండ్ అడవులు 300 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవాటిగా అంచనా వేశారు. తారు ఉత్పత్తిని 19వ శతాబ్దం చివరి కాలంలో నిలిపివేశారు, తద్వారా వేగవంతమైన అటవీ-నిర్మూలన కూడా నిలిచిపోయింది.

1897లో పెన్సిల్వేనియాలో కర్ర బొగ్గును బ్రిక్వెట్ (దిమ్మె) రూపంలో మొట్టమొదటిసారి ఎల్స్‌వర్త్ బి. ఏ. జవోయెర్ కనిపెట్టి, దానికి మేధోసంపత్తి హక్కులు పొందారు[2], ఈ బొగ్గు దిమ్మెలను జవోయెర్ ఫ్యూయల్ కంపెనీ తయారు చేసింది. ఈ ప్రక్రియకు తరువాత హెన్రీ ఫోర్డ్ ప్రాచుర్యం కల్పించారు, ఆయన ఆటోమొబైల్ ఫ్యాబ్రికేషన్ నుంచి కలప మరియు చెక్క పొడి వంటి ఉప ఉత్పత్తులను ఒక ముడిపదార్థంగా ఉపయోగించారు. ఫోర్డ్ చార్‍‌కోల్ తరువాత కింగ్స్‌ఫోర్డ్ కంపెనీగా మారింది.

రకాలు[మార్చు]

ఓగటన్, చెక్క పొట్టు నుంచి తయారు చేసే కర్ర బొగ్గు దిమ్మెలు

వ్యాపార ప్రాతిపదికన తయారు చేసే కర్ర బొగ్గును గడ్డలుగా, దిమ్మెలుగా లేదా ఇతర రూపాల్లో గుర్తించవచ్చు:

 • గడ్డల రూపంలో ఉండే కర్రబొగ్గు (లంప్ చార్‌కోల్) ను నేరుగా గట్టికలప పదార్థం నుంచి తయారు చేస్తారు, దిమ్మెలుగా ఉండే కర్ర బొగ్గు కంటే దీని ద్వారా అతితక్కువ బూడిద తయారవుతుంది.
 • దిమ్మెల రూపంలో ఉండే కర్ర బొగ్గులు , వీటిని కర్ర బొగ్గును పీడనానికి గురి చేయడం ద్వారా తయారు చేస్తారు, ఎక్కువగా చెక్క పొడి మరియు ఇతర కలప ఉప ఉత్పత్తుల నుంచి ఒక బంధకం లేదా ఇతర సంకలిత పదార్థాలతో దీనిని తయారు చేయడం జరుగుతుంది. సాధారణంగా బంధకంగా పిండి పదార్థాన్ని‌ ఉపయోగిస్తారు. కొన్ని దిమ్మె బొగ్గులకు కర్ర బొగ్గును (ఉష్ణ మూలం), ఖనిజ కర్బనం (ఉష్ణ మూలం), బోరాక్స్, సోడియం నైట్రేట్ (జ్వలన సహకారి), సున్నం (బూడిదను-తెల్లబరిచే కారకం), ముడి చెక్క పొడి (జ్వలన సహకారి) మరియు జ్వలనానికి సాయపడే పారాఫిన్ లేదా పెట్రోలియం ద్రావణాలు వంటి ఇతర సంకలిత పదార్థాలను కూడా ఉపయోగిస్తారు.[3]
 • బలవంతపు కర్ర బొగ్గు , దీనిని బంధకాన్ని ఉపయోగించకుండా ముడి కలప లేదా కర్బనీకరణం చెందిన కలపను దిమ్మెలుగా బలవంతంగా ఆకృతి కల్పించడం ద్వారా తయారు చేస్తారు. ఈ బలవంతపు ప్రక్రియలో ఉష్ణం మరియు పీడనం కర్ర బొగ్గును కలిపివుంచుతాయి. ముడి కలప పదార్థం మరియు దుంగల నుంచి ఈ ప్రక్రియలో తయారు చేసిన బొగ్గును తరువాత కర్బనీకరణం చెందేలా చేస్తారు.[ఉల్లేఖన అవసరం]

కర్ర బొగ్గు యొక్క లక్షణాల్లో (గడ్డ, దిమ్మె లేదా బలవంతపు ఆకృతులు) ఉత్పత్తుల మధ్య విస్తృతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. అందవలన ఏ రకమైన కర్ర బొగ్గు తయారీకైనా కాల్చడం, తదితరాల వంటి ఒకే రకమైన పద్ధతిని ఉపయోగిస్తారనే తప్పుడు భావన ఉంది.

ఉపయోగాలు[మార్చు]

కర్ర బొగ్గు దిమ్మెలు

కర్ర బొగ్గ యొక్క ఒక ఉపయోగం ఏమిటంటే, దానిని తుపాకీ మందుగుండులో (గన్‌పౌడర్) భాగంగా ఉపయోగిస్తారు. ఒక క్షయకరణిగా లోహ సంగ్రహణ కార్యకలాపాల్లో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు, అయితే కోక్, ఆంత్రాసైట్ స్మాళ్లు, తదితరాల పరిచయం కావడంతో దీని ఉపయోగం కాలగమనంలో క్షీణిస్తూ వచ్చింది. అయితే 2010లో బ్రెజిలియన్ చట్ట మార్పుల ఫలితంగా, ఇప్పుడు పిగ్ ఐరన్ మరియు ఉక్కు యొక్క ఉత్పత్తిలో కర్ర బొగ్గు వినియోగం పెరుగుతుంది. కర్బన ఉద్గారాలను తగ్గించందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, అధ్యక్షుడు లులా డా సిల్వా పర్యావరణ అనుకూలమైన ఉక్కు ఉత్పత్తి కోసం చేపట్టిన చర్యల్లో ఈ నిర్ణయం కూడా భాగంగా ఉంది. రాగి మరియు ఇనుము వంటి వివిధ లోహాలను కరిగించడంలో కర్ర బొగ్గును ఉపయోగించవచ్చు,[4] అవసరమైన ఉష్ణోగ్రత వద్ద మండుతుండటం వలన దీని ఉపయోగానికి మొగ్గు చూపుతున్నారు: 1,100 °C (2,010 °F) [5] మరియు ఒక క్షయకరణిగా పనిచేస్తుంది. పరిమిత పరిమాణంలో క్రాయోన్‌ల సేకరణ కోసం దీనిని తయారు చేస్తున్నారు; అయితే ఎక్కువగా ఒక ఇంధనంగా కర్ర బొగ్గును ఉపయోగిస్తున్నారు, కలప కంటే ఎక్కువ ఉష్ణాన్ని ఇవ్వడంతోపాటు, పూర్తిస్థాయిలో మండే గుణం దీనికి ఉంది. లోహ కార్మికులు తరచుగా కర్ర బొగ్గును ఉపయోగిస్తున్నారు, వంట కోసం మరియు ఇతర పారిశ్రామిక అనువర్తనాల్లో దీనిని ఉపయోగించడం జరుగుతుంది.

వంట చెరకు[మార్చు]

అభివృద్ధి చెందిన ప్రపంచంలో కర్ర బొగ్గు దిమ్మెలను విస్తృతంగా ఆరుబయట గ్రిల్లింగ్ కోసం మరియు బార్‌బెక్యూ‌లను బ్యాక్‌యార్డులు మరియు క్యాంపింగ్ ప్రయాణాల్లో ఉపయోగిస్తున్నారు.

అనేక పారిశ్రామికేతర దేశాల్లో కర్ర బొగ్గను రోజువారీ వంట చెరకుగా ఎక్కువ భాగం మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఇంటిలోపల కర్రబొగ్గును ఉపయోగించినప్పుడు దీని వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఎమీ స్మిత్ ఒక నివేదికలో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధికి ఇంటిలోపల పొయ్యిలో వంట చేయడం ప్రధాన కారణంగా గుర్తించారు, తృతీయ ప్రపంచంలో ఐదేళ్లలోపు బాలల మరణానికి దీనిని ప్రధాన కారణంగా సూచించారు. ఏడాదికి వంట చెరకుగా దీనిని ఉపయోగించడం వలన 2 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి.[6] అంతేకాకుండా, కర్ర బొగ్గును మండించినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ (CO) ఒక దహన ఉత్పత్తిగా ఉంది.[7] ఇది వాతావరణ కాలుష్యానికి కారణమవుతుంది.

పారిశ్రామిక ఇంధనం[మార్చు]

చారిత్రాత్మకంగా, కర్ర బొగ్గును బ్లూమెరీలలో ఇనుమును కరిగించడం కోసం పెద్దఎత్తున కర్ర బొగ్గును ఉఫయోగించారు, తరువాత కొలిమిలు మరియు ఫైనరీ ఫోర్జ్‌లలో కూడా దీనిని విస్తృతంగా ఉపయోగించారు. పారిశ్రామిక విప్లవం సందర్భంగా దీని స్థానంలో కోక్ ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ ప్రయోజనం కోసం, కర్ర బొగ్గును ఇంగ్లాండ్‌లో డజన్లలో (లేదా లోడ్‌లలో) కొలిచేవారు, ఒక్కో డజన్‌లో 12 సాక్‌లు లేదా షెమ్‌లు లేదా సీమ్‌లు ఉంటాయి, దీనిలో ఒక్కోదానిలో 8 బుషెల్‌లు ఉంటాయి.[ఉల్లేఖన అవసరం]

ఆటోమోటివ్ ఇంధనం[మార్చు]

పెట్రోలియం కొరత ఉన్న రోజుల్లో, ఆటోమొబైల్ వాహనాలు మరియు బస్సులు కూడా కలప వాయువును మండించడం ద్వారా నడిచేవి (ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్‌తో కూడిన వాయు మిశ్రమం), కర్ర బొగ్గు లేదా కలపను ఒక కలప వాయువు జెనరేటర్‌లో మండించడం ద్వారా ఈ వాయువు విడుదలవుతుంది. 1931లో టాంగ్ జోంగ్‌మింగ్ కర్ర బొగ్గు ఆధారిత వాహనాన్ని అభివృద్ధి చేశారు, చైనాలో 1950వ దశకం వరకు ఈ కార్లకు ఎంతో ఆదరణ ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఆక్రమిత ఫ్రాన్స్‌లో ఇటువంటి వాహనాలకు (గాజోజేనెస్ ‌గా పిలిచేవారు) కలప మరియు కర్ర బొగ్గు ఉత్పత్తి 1943లో 50 లక్షల టన్నులకు పెరిగింది, యుద్ధానికి ముందు కాలంలో కర్ర బొగ్గు ఉత్పత్తి 50 వేల టన్నుల వద్దే ఉండటం గమనార్హం.[8]

శుద్ధికరణం మరియు వడపోత[మార్చు]

ఉత్తేజిత కర్బనం

ఒక వడపోత సాధనంగా సమర్థతను పెంచేందుకు కర్ర బొగ్గును ఉత్తేజితం చేయవచ్చు. ఉత్తేజపరిచిన కర్ర బొగ్గు వేగంగా వాయువులు మరియు ద్రావణాల్లో కరిగిన లేదా నిలిచిపోయిన విస్తృతమైన కర్బన సమ్మేళనాలను గాలిస్తుంది. చెరుకు నుంచి సుక్రోజ్‌ను శుద్ధి చేయడం వంటి కొన్ని నిర్దిష్ట పారిశ్రామిక ప్రక్రియల్లో మలినాలు ఒక అవాంఛిత వర్ణాన్ని కలిగిస్తాయి, ఉత్తేజిత కర్ర బొగ్గు ద్వారా ఈ మలినాలను తొలగించవచ్చు. గాలి వంటి వాయువుల్లో వాసనలు మరియు విషపదార్థాలను కూడా గాలించేందుకు కర్ర బొగ్గు ఉపయోగపడుతుంది. కర్రబొగ్గు వడపోత సాధనాలను కొన్నిరకాల వాయు రక్షణ కవచాల్లో కూడా ఉపయోగిస్తారు. ఉత్తేజిత కర్ర బొగ్గుకు ఒక వైద్యపరమైన ఉపయోగం ఉంది, ప్రధానంగా విష పదార్థాలను వడపోయడంలో దీనిని ఉపయోగిస్తారు, ముఖ్యంగా పెద్ద మొత్తంలో మందులు తీసుకోవడం ద్వారా ఆత్మహత్యా యత్నాలకు పాల్పడిన రోగులను కాపాడేందుకు దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఉత్తేజిత కర్ర బొగ్గు ఎటువంటి వైద్య సిఫార్సులు లేకుండా అందుబాటులో ఉండటం ఉంటుంది, అందువలన దీనిని వివిధ రకాల ఆరోగ్య సంబంధ అనువర్తనాల్లో ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, దీనిని జీర్ణాశయంలో మితిమీరిన వాయువు చేరడం వలన కలిగే అసౌకర్యాన్ని (మరియు చికాకు) తగ్గించేందుకు ఉపయోగిస్తారు.[ఉల్లేఖన అవసరం]

జంతువుల బొగ్గు లేదా ఎముకల నుంచి తయారు చేసే బొగ్గును ఎముకులను పొడి స్వేదనం ద్వారా కర్బన అవశేషంగా సేకరిస్తారు. దీనిలో 10% కర్బనం మాత్రమే ఉంటుంది, మిగిలిన భాగంలో కాల్షియం మరియు మెగ్నిషియం ఫాస్పేట్‌లు (80%) ఉంటాయి, మిగతా పది శాతం ఎముకల్లో ఉండే ఇతర అకర్బన పదార్థాలు ఉంటాయి. గ్లూ మరియు జెలటిన్ పరిశ్రమల్లో అవశేషాల నుంచి దీనిని సాధారణంగా తయారు చేస్తారు. వర్ణాలను తొలగించే దీని యొక్క పొడిని 1812లో డెరోస్నే చక్కెర శుద్ధిలో ద్రావకాలకు స్వచ్ఛత తీసుకొచ్చేందుకు ఉపయోగించారు. ఈ ప్రయోజనం కోసం దీని యొక్క ఉపయోగం ఇప్పుడు దాదాపుగా నిలిపివేయబడింది, మరింత క్రియాశీలమైన మరియు సులభంగా నిర్వహించగల రీజెంట్‌లు దీని స్థానంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగశాలల్లో ఇప్పటికీ దీనిని కొంత వరకు ఉపయోగించడం జరుగుతుంది. వర్ణాన్ని తొలగించే పొడికి శాశ్వతత్వం లేదు, కొంత సమయం ఉపయోగించిన తరువాత ఇది అదృశ్యమవుతుంది: దీనిని వేడిచేయడం మరియు కడగడం ద్వారా పునరుద్ధరించే వీలుంది. కర్ర బొగ్గు ద్రావణాల్లో కొంత వరకు వర్ణ పదార్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది, అయితే జంతువుల నుంచి తయారు చేసే బొగ్గు సాధారణంగా మరింత సమర్థవంతంగా పని చేస్తుంది.[ఉల్లేఖన అవసరం]

కళ[మార్చు]

వైన్ చార్‌కోల్ యొక్క నాలుగు స్కిక్‌లు మరియు సంపీడన కర్ర బొగ్గు యొక్క నాలుగు స్టిక్‌లు.
కాగితపు షీట్‌లపై రెండు కర్ర బొగ్గు పెన్సిళ్లు, పెన్సిల్‌గా ఉపయోగించేందుకు వీనిని తయారు చేశారు, చెక్క షీట్‌లో రెండు కర్ర బొగ్గు పెన్సిళ్లు.

చిత్రలేఖనం కోసం కళలో కర్ర బొగ్గును ఉపయోగిస్తారు, చిత్రలేఖనంలో ముడి నమూనాలు గీసేందుకు ఇది ఉపయోగపడుతుంది, పార్సెమేజ్‌ను తయారు చేసేందుకు ఇది ఒక సాధ్యనీయ మాధ్యమంగా ఉంది. ఒక ఫిక్సేటివ్ యొక్క ఉపయోగం ద్వారా దీనిని రక్షించవచ్చు. కళాకారులు ముఖ్యంగా మూడు రూపాల్లో కర్ర బొగ్గును ఉపయోగిస్తారు:

 • వైన్ చార్‌కోల్ చెక్క కర్రలను కాల్చడం ద్వారా తయారవుతుంది, (సాధారణంగా విల్లో లేదా లిండెన్/టిలియా), ఇది మృదువైన, మాధ్యమిక మరియు గట్టి లక్షణాలు కలిగివుంటుంది.[ఉల్లేఖన అవసరం]
 • సంపీడన కర్ర బొగ్గు , దీనిని జిగురు బంధకంతో కర్ర బొగ్గు పొడిని కలపడం ద్వారా సంపీడన చర్యతో గుండ్రటి పుల్లలుగా తయారు చేస్తారు. బంధకం యొక్క పరిమాణం బొగ్గు పుల్ల యొక్క దృఢత్వాన్ని నిర్ణయిస్తుంది. సంపీడన కర్ర బొగ్గును కర్ర బొగ్గు పెన్సిళ్లలో ఉపయోగిస్తారు.
 • పొడిరూపంలోని కర్ర బొగ్గు , దీనిని తరచుగా చిత్రాన్ని గీసే పెద్ద భాగాలను పూరించేందుకు ఉపయోగిస్తారు. టోన్ చేసిన ప్రదేశాలపై చిత్రాన్ని గీయడం వలన వర్ణాలు మరింత ముదురు రంగులోకి మారతాయి, అయితే కళాకారుడు లేత వర్ణాలను సృష్టించేందుకు కర్ర బొగ్గు పొడి ఉపయోగించిన ప్రదేశంలోని వర్ణాన్ని తేలికపరచడం (లేదా పూర్తిగా తొలగించడం) సాధ్యపడుతుంది.

ఉద్యానవనాలు[మార్చు]

ఉద్యానవనాల్లో కర్ర బొగ్గు ఉపయోగానికి ఇటీవల కాలంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అమెరికా ఉద్యానవన పెంపకదారులు కొద్దికాలంపాటు మాత్రమే దీనిని ఉపయోగించినప్పటికీ, అమెజాన్ ప్రాంతంలోని టెర్రా ప్రెటా భూములపై పరిశోధనలో జీవబొగ్గును కొలంబస్ పూర్వకాలానికి చెందిన స్థానికులు విస్తృతంగా ఉపయోగించినట్లు గుర్తించారు, నిష్ఫలమైన భూములను సారవంతమైన భూములుగా మార్చేందుకు వీరు ఈ బొగ్గును ఉపయోగించినట్లు కనిపెట్టారు. ఆధునిక అనువర్తనంలో కూడా ఈ విధానాన్ని గుర్తించవచ్చు, భూముల సారాన్ని మెరుగుపరిచేందుకు మరియు కార్బన్ సీక్వెస్ట్రేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది.[ఉల్లేఖన అవసరం]

వైద్యం[మార్చు]

జీర్ణకోశ సమస్యలకు ఒక ఆహారసంబంధ ఔషధంగా గతంలో కర్ర బొగ్గును ఉపయోగించారు, వీటిని కర్ర బొగ్గు బిస్కెట్‌ల రూపంలో తీసుకునేవారు. జీర్ణాశయ సంబంధ సమస్యలకు ఇప్పుడు వీటిని టాబ్లెట్‌లు, క్యాప్స్యూల్ మరియు పొడి రూపంలో తీసుకుంటున్నారు.[ఉల్లేఖన అవసరం]

ఆఫ్రికాలో రెడ్ కోలోబస్ కోతులు స్వీయ-వైద్య ప్రయోజనాలకు కర్ర బొగ్గును తినడం గమనించారు. అవి ఆహారంగా తీసుకునే ఆకుల్లో అధిక స్థాయి సైనైడ్ ఉంటుంది, దీని వలన ఆకులు జీర్ణం కావడం కష్టమవుతుంది. అందువలన అవి కర్ర బొగ్గును తినడం నేర్చుకున్నాయి, ఇది సైనైడ్‌ను గ్రహించి, వాటి జీర్ణ సమస్యను తొలగిస్తుంది. కర్ర బొగ్గు ఉపయోగానికి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని తల్లి తన బిడ్డకు తెలియజేస్తుంది.[9]

అంతేకాకుండా, ఉత్తేజిత కర్ర బొగ్గు, వైద్య అనువర్తనాలు వ్యాసం చూడండి.

ధూమపానం[మార్చు]

ప్రత్యేక కర్ర బొగ్గులను హూకా (అరబిక్‌లో అగ్రిలెహ్ లేదా టర్కిష్‌లో నార్జెలెహ్) ధూమపానంలో ఉపయోగిస్తారు. పొగాకు పాత్రపై ఉంచే రేకుపై మండించిన బొగ్గు కణికలను ఉంచుతారు; బొగ్గుల నుంచి పరోక్ష వేడి ద్వారా పొగాకుకు పొగ రాకుండా మగ్గే ఉష్ణోగ్రత అందుతుంది.

పర్యావరణ ప్రభావాలు[మార్చు]

ఉప-పారిశ్రామిక స్థాయిలో కర్ర బొగ్గు ఉత్పత్తి అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అటవీ నిర్మూలనకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. కర్ర బొగ్గు తయారీ సాధారణంగా అక్రమంగా మరియు దాదాపుగా ఎల్లప్పుడూ నియంత్రణ లేకుండా జరుగుతుంది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని విరుంగా నేషనల్ పార్కులో పెద్దఎత్తున అటవీ నిర్మూలన చర్యలు బయటపడ్డాయి, పర్వతప్రాంత గొరిల్లాల మనుగడకు ఈ చర్యల వలన ముప్పు వాటిల్లుతుంది.[10]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • జీవబొగ్గు (బయోచార్)
 • పైరాలసిస్
 • స్లాష్ అండ్ చార్
 • టెర్రా ప్రెటా
 • జీవద్రవ్య దిమ్మెలు

సూచనలు[మార్చు]

 1. "Using charcoal efficiently". Retrieved 2010-02-01. Cite web requires |website= (help)
 2. http://inventors.about.com/od/inventionsalphabet/a/barbecue.htm
 3. హౌ చార్‌కోల్ బ్రిక్వెట్స్ ఆర్ మేడ్.
 4. బొగ్గు ప్రయోజనాలు
 5. "Charcoal in the Forest of Dean". మూలం నుండి 2016-12-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-24. Cite web requires |website= (help)
 6. "Amy Smith shares simple, lifesaving design". Cite web requires |website= (help)
 7. "Smoke Detectors, Carbon Monoxide Detectors, and Charcoal". మూలం నుండి 2007-08-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-24. Cite web requires |website= (help)
 8. "క్రిస్ పియర్సన్ "'ది ఏజ్ ఆఫ్ వుడ్': ఫ్యూయల్ అండ్ ఫైటింగ్ ఇన్ ఫ్రెంచ్ ఫారెస్ట్స్, 1940–1944"". మూలం నుండి 2008-01-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-18. Cite web requires |website= (help)
 9. PBS: క్లవర్ మంకీస్: మంకీస్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్
 10. "విరుంగా నేషనల్ పార్క్". మూలం నుండి 2008-10-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-07. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]