శివుని వేయి నామములు- 701-800
శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:
శ్లోకము 71
[మార్చు]సయజ్ఞారిః = యజ్ఞశత్రువుతో కూడియుండువాడు
సకామారిః = మన్మధుని శత్రువుతో కూడియుండువాడు
మహాదంష్ట్రః = గొప్ప దంతములు కలవాడు
మహాయుధః = గొప్పదైన ఆయుధము కలవాడు
బహుధా నిందితః = అనేక విధముల నిందింపబడినవాడు
సర్వః = సమస్తము తానే అయినవాడు
శంకరః = సుఖమును కలుగజేయువాడు
చంద్రశేఖరః = చంద్రుని శిరస్సునందు కలవాడు
శ్లోకము 72
[మార్చు]అమరేశః = దేవతలకు అధిపతి అయినవాడు
మహాదేవః = దేవతలలో గొప్పవాడు
విశ్వదేవః = ప్రపంచమునకు దేవుడు
సురారిహా = దేవతల శత్రువులను చంపినవాడు
అహిర్భుధ్న్యః = నాగాభరణం కలవాడు
అనిలాభః = గాలివంటి వాడు
చేకితానః = సర్వజ్ఞుడు; అత్యంత జ్ఞానయుక్తుడు
హరిః = తానే విష్ణురూపమైనవాడు
శ్లోకము 73
[మార్చు]అజైకపాత్ = విష్ణువు ముఖ్యమైన పాదముగా కలవాడు
కాపాలీ = కపాలమును ధరించినవాడు
త్రిశంకుః = త్రిశంకువను రాజు తానే అయినవాడు
అజితః = జయింపబడనివాడు
శివః = భద్రమైనవాడు
ధన్వంతరిః = దేవ వైద్యుడైన ధన్వంతరి యొక్క రూపం తానే అయినవాడు
ధూమకేతుః = గణపతి తానైనవాడు
స్కందః = కుమారస్వామి తానైనవాడు
వైశ్రవణః = కుబేరుడు తానే అయినవాడు
శ్లోకము 74
[మార్చు]ధాతా = బ్రహ్మ తానే అయినవాడు
శక్రః = ఇంద్రుడు తానే అయినవాడు
విష్ణుః = విష్ణువు తానే అయినవాడు
మిత్రః = సూర్యుడు తానే అయినవాడు
త్వష్టా = బ్రహ్మ తానే అయినవాడు
ధ్రువః = ధ్రువుడు తానే అయినవాడు
ధరః = ప్రపంచమును ధరించినవాడు
ప్రభావః = గొప్ప పుట్టుక కలవాడు
సర్వగః = అన్నింటియందు ఉండువాడు
వాయుః = వాయు రూపము తానే అయినవాడు
అర్యమా, సవితా = సూర్యుని రూపము తానే అయినవాడు
రవిః = సూర్యుడు తానే అయినవాడు
శ్లోకము 75
[మార్చు]ఉషంగుః = ఉషస్సును కలుగజేయు సూర్యుని రూపము తానే అయినవాడు
విధాతా = బ్రహ్మ తానే అయినవాడు
మాంధాతా = సృష్టికి ఆదియందు గల మాంధాత అనే రాజు తానే అయినవాడు
భూతభావనః = ప్రాణుల యొక్క క్షేమమును గూర్చి ఆలోచించువాడు
విభుః = అధిపతి అయినవాడు
వర్ణవిభావీ = వర్ణముల యొక్క విశేషములను గూర్చి భావించువాడు
సర్వకామగుణావహః = సమస్తమైన కోరికల గుణములను ఆవహించి యుండువాడు
శ్లోకము 76
[మార్చు]పద్మనాభః = పద్మము నాభియందు గల విష్ణువు తానే అయినవాడు
మహాగర్భ = గొప్పదైన గర్భము కలవాడు
చంద్రవక్తః = చంద్రునివంటి ముఖము కలవాడు
అనిలః = వాయువు తానే అయినవాడు
అనలః = అగ్ని రూపము తానే అయినవాడు
బలవాన్ = మిక్కిలి బలము కలవాడు
ఉపశాంతః = మిక్కిలిగా శాంతించువాడు
పురాణః = ప్రాచీనుడు
పుణ్యచంచురీ = పుణ్యము చేత ప్రసిద్ధమైన వాడు.
శ్లోకము 77
[మార్చు]కురుకర్తా = కురుక్షేత్రమును సృష్టించినవాడు,
కురువాసీ = కురు భూముల యందు నివసించువాడు
కురుభూతః = కురు భూములందు పుట్టినవాడు
గుణౌషధః = మంచి గుణములు ఔషధములుగా కలవాడు
సర్వాశయః = సమస్తమైన అభిప్రాయములు తానే అయినవాడు
గర్భచారీ = సమస్త గర్భములందు సంచరించువాడు
సర్వేషాం ప్రాణీనాం పతిః = సమస్తమైన ప్రాణులకు అధిపతి అయినవాడు.
శ్లోకము 78
[మార్చు]దేవదేవః = దేవతలకు దేవుడైనవాడు
సుఖాసక్తః = సుఖమునందు ఆసక్తి కలవాడు
సదసత్ సర్వరత్నవిత్ = మంచి చెండు అను సమస్తమైన రత్నముల యొక్క జ్ఞానము కలవాడు
కైలాసగిరివాసీ = కైలాస పర్వతమునందు నివసించువాడు
హిమవత్ గిరి సంశ్రయః = హిమవత్ పర్వతమునందు నివసించువాడు.
శ్లోకము 79
[మార్చు]కూలహారీ = ప్రవాహరూపములో నదుల దరులను కూల్చువాడు
కులకర్తా = పుష్కరము మొదలైన పెద్ద సరస్సులను నిర్మించువాడు.
బహువిద్యః = అనేకమైన విద్యలు కలవాడు
బహుప్రదః = అనేకములు ఇచ్చువాడు
వణిజః వ్యాపారమునకు మూలపురుషుడు
వర్ధకీ = వృద్ధి పొందినవాడు
వృక్షః = వృక్షము తానే అయినవాడు
వకుళః = పొగడ చెట్టు తానే అయినవాడు
చందనచ్ఛదః = చందనము యొక్క మైపూత కలవాడు.
శ్లోకము 80
[మార్చు]సారగ్రీవః = బలముతో కూడిన కంఠము కలవాడు
మహాశత్రుః = గొప్పవారైన శత్రువులు కలవాడు
అలోలః = ఆసక్తి లేనివాడు
మహౌషధః = గొప్ప ఔషధము వంటివాడు
సిద్ధార్థకారీ = అర్థసిద్ధిని కలుగజేయువాడు
సిద్ధార్థః = ప్రయోజనముల సిద్ధిని పొందినవాడు
ఛందో వ్యాకరణోత్తరః = ఛందస్సు, వ్యాకరణములను బాగుగా పఠించినవాడు.