శివుని వేయి నామములు- 901-1000

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శ్లోకము 91[మార్చు]

శిరోహారీ = (దక్షుని) శిరస్సును ఖండించినవాడు

సర్వలక్షణ లక్షితః = సమస్తమైన మంచి లక్షణముల చేత గుర్తింపబడినవాడు

అక్షః = సృష్టి చక్రమునకు ఇరుసు వంటివాడు

రథయోగీ = రథమును కూర్చువాడు

సర్వయోగీ = సమస్తమును సమకూర్చువాడు

మహాబలః = గొప్ప బలము కలవాడు.

శ్లోకము 92[మార్చు]

సమామ్నాయః = వేదముతో సమానమైనవాడు

అసమామ్నాయః = వేదములకు అతీతుడు

సీరదేవః = భూమిని పంటలు పండుటకు అనువుగా చేయువాడు

మహారథః = రథకులలో గొప్పవాడు

నిర్జీవః = నిర్జీవమైన వస్తువుల ఆకారము తానైనవాడు

జీవనః = ఉత్తమ జీవనము కలవాడు

మంత్రః = మంత్ర స్వరూపుడు

శుభాక్షః = శుభమైన దృష్టి కలవాడు

బహు కర్కశః = మిక్కిలి కఠినమైనవాడు.

శ్లోకము 93[మార్చు]

రత్నప్రభూతః = రత్నములను సృష్టించినవాడు

రక్తాంగః = ఎఱుపు రంగు శరీరము కలవాడు

మహార్ణవ నిపానవిత్ = గొప్పదైన సముద్రపు నీటిని త్రాగుటలో నేర్పరి

మూలం = సృష్టికి మూలమైనవాడు

విశాలః = అతి విస్తారమైనవాడు

అమృతః = అమృత స్వరూపము తానైనవాడు

వ్యక్తావ్యక్తః = కనిపించి, కనిపించనివాడు

తపోనిధిః = తపస్సుకు స్థానమైనవాడు

శ్లోకము 94[మార్చు]

ఆరోహణః = ఉన్నతస్థితికి పోవువాడు

అధిరోహః = ఆరోహించిన వాడు

శీలధారీ = సత్ప్రవర్తన కలిగినవాడు

మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు

సేనాకల్పః = సేనను సృష్టి చేయువాడు

మహాకల్పః = గొప్పదైన సృష్టి చేసినవాడు

యోగః = యోగము తానైనవాడు

యోగకరః = యోగమును సృష్టించినవాడు

హరిః = విష్ణువు తానైనవాడు.

శ్లోకము 95[మార్చు]

యుగరూపః = యుగముల రూపము తానైనవాడు

మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు

మహానాగహనః = గొప్పవాడైన గజాసురుని చంపినవాడు

అవధః = వధింపబడనివాడు

న్యాయ నిర్వహణః = న్యాయమును నిర్వహించువాడు

పాదః = పూజ్యుడు

పండితః = పండితుడు

అచలోపమః = పర్వతముతో సమానుడు.

శ్లోకము 96[మార్చు]

బహుమాలః = అనేకమైన మాలలు ధరించినవాడు

మహామాలః = గొప్పవైన మాలలు కలవాడు

శశీ = చంద్రుడు తానైనవాడు

హరిసులోచనః = మంచి నేత్రములు కలవాడు

విస్తారః = మిక్కిలి వ్యాపించినవాడు

లవణః = ఉప్పు తానైనవాడు

కూపః = నూయి తానైనవాడు

త్రియుగః = గడిచిన మూడు యుగములు తానైనవాడు

సఫలోదయః = సిద్ధించిన ఫలముతో కూడియున్నవాడు.

శ్లోకము 97[మార్చు]

త్రినేత్రః = మూడు కన్నులు కలవాడు

విషణ్ణాంగః = సర్వదా నిరాకారుడు

మణివిద్ధః = మణుల చేత ప్రకాశించువాడు

జటాధరః = జడలను ధరించినవాడు

బిందుః = అనుస్వారము రూపము తానైనవాడు

విసర్గః = విసర్గ రూపము తానైనవాడు

సుముఖః = మంచి ముఖము కలవాడు

శరః = బాణరూపము తానైనవాడు

సర్వాయుధః = సమస్తమైన ఆయుధముల రూపము తానైనవాడు

సహః = సహనము కలవాడు.

శ్లోకము 98[మార్చు]

నివేదనః = అన్నిటిని ఇచ్చువాడు

సుఖాజాతః = సుఖములను కలుగజేయువాడు

సుగంధారః = మంచి సంగీత జ్ఞానం కలిగినవాడు

మహాధనుః = గొప్పదైన ధనుస్సు కలవాడు

గంధపాలీ = మంచి సువాసనను కలుగజేయువాడు

భగవాన్ = భగవంతుడు

సర్వకర్మణామ్ = సమస్త కర్మలకు

ఉత్థానః = ఫలశ్రుతి కలుగజేయువాడు.

శ్లోకము 99[మార్చు]

మంథానః = సమస్త సృష్ఠిని మధించువాడు

బహుళః = సమస్తమందు ఉన్నవాడు

వాయుః = వాయు రూపమై ఉన్నవాడు

సకలః = సమస్తమైన వాడు

సర్వలోచనః సమస్తమైన కన్నులు కలవాడు

తలః = సమర్థత కలిగినవాడు

తాలః సంగీతము నందు తాళరూపము తానైనవాడు

కరస్థాలీ = చేతియందు పాత్ర కలవాడు

ఊర్ధ్వ సంవహనః = పైకి తీసుకొని పోవువాడు

మహాన్ = గొప్పవాడు.

శ్లోకము 100[మార్చు]

ఛత్రం = సృష్టి కంతటికి గొడుగు వంటివాడు

సుచ్ఛత్ర విఖ్యాతః = మంచి ఛత్రముతో ప్రసిద్ధి చెందినవాడు

లోకః = లోకము తానే అయినవాడు

సర్వాశ్రయక్రమః = సమస్తమునకు తానే ఆశ్రయింపదగిన వరుసలో ఉన్నవాడు

ముండః = క్షురకర్మచే తలవెంట్రుకలు తీయబడినవాడు

విరూపః = వికారమైన స్వరూపము కలవాడు

వికృతః = వికృతమైన రూపము కలవాడు

దండీ = దండము కలవాడు

కుండీ = పాత్ర కలిగియున్నవాడు

వికుర్వణః = వికృతముగా చేయువాడు.

శ్రీ శివసహస్రనామావళి శ్లోకము 101