Jump to content

శివుని వేయి నామములు- 801-900

వికీపీడియా నుండి
శివ సహస్ర నామ స్తోత్రం
శివ సహస్ర నామములు : 01-100  • 101-200  • 201-300  • 301-400  • 401-500  • 501-600  • 601-700  • 701-800  • 801-900  • 901-1000
శివుడు

శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శ్లోకము 81

[మార్చు]

సింహనాదః = సింహము వంటి కంథధ్వని కలవాడు

సింహదంష్ట్రః = సింహము యొక్క దంతముల వంటి దంతములు కలవాడు

సింహగః = సింహమును అతన అధీనమున నడిపించువాడు

సింహవాహనః = సింహము వాహనముగా కలవాడు

ప్రభావాత్మా = ప్రభావము కలిగిన ఆత్మ కలవాడు

జగత్కాలః = ప్రపంచము యొక్క కాలము తానే అయినవాడు

కాలః = కాల స్వరూపుడు

లోకహితః = లోకమునకు ఇష్టుడైనవాడు

తరుః = వృక్షరూపము తానే అయినవాడు.

శ్లోకము 82

[మార్చు]

సారంగః = ప్రచండ దీప్తిమంతుడు

నవచక్రాంగః = నూతనమైన రథమువంటివాడు

కేతుమాలీ = విజయధ్వజముల సమూహము కలవాడు

సభావనః = భావనతో కూడియున్నవాడు

భూతాలయః = సమస్త ప్రాణులకు నిలయమైనవాడు

భూతపతిః = సమస్త ప్రాణులకు అధిపతి

అహోరాత్రం అనిందితః = రాత్రింబవళ్ళు అంతయు నింద లేనివాడు.

శ్లోకము 83

[మార్చు]

వర్ధితః = బాగుగా అభివృద్ధి చెందినవాడు

సర్వభూతానాం = సమస్త ప్రాణులకు

నిలయః = స్థానమైనవాడు

విభుః = అధిపతి

భవః = పుట్టుక స్థానమైనవాడు

అమోఘః = వ్యర్థము లేనివాడు

సంయతః = నియమ బద్ధుడైనవాడు

అశ్వః = గుఱ్ఱము వలె వేగము కలవాడు

భోజనః = బాగుగా భుజించువాడు

ప్రాణధారణః = సమస్త ప్రాణములను ధరించువాడు.

శ్లోకము 84

[మార్చు]

ధృతిమాన్ = ధైర్యము కలవాడు

మతిమాన్ = బుద్ధిమంతుడు

దక్షః = సమర్ధుడు

సత్కృతః = బాగుగా సత్కరింపబడినవాడు

యుగాధిపః = యుగమునకు అధిపతి

గోపాలీ = గోవులను రక్షించువాడు

గోపతిః = వృషభము వంటివాడు

గ్రామః = జననివాసముల యొక్క సమూహము తానే అయినవాడు

గోచర్మవసనః = గోవు యొక్క చర్మమును ధరించువాడు

హరిః = విష్ణువు యొక్క రూపము తానే అయినవాడు

శ్లోకము 85

[మార్చు]

హిరణ్యబాహుః = బంగారు భుజములు కలవాడు

గుహాపాలః = గుహలను రక్షించువాడు

ప్రవేశకః = గుహలను ప్రవేశించువాడు

గుహాపాలః ప్రవేశకః = తనని ధ్యానించిన వారిని (లేదా) గుహలో నివసించే ఋషులను,మునులను రక్షించేవాడు.


ప్రకృష్టారిః = తీవ్రమైన శత్రువులు కలవాడు

(లేదా) శత్రువులను పూర్తిగా నిర్మూలించేవాడు,తుడిచిపెట్టేవాడు .

మహాహర్షః = గొప్ప సంతోషము కలవాడు

జితకామః = కామమును జయించినవాడు

లేదా ప్రాపంచిక కోరికలు అధిగమించినవాడు

జితేంద్రియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడు.లేదా జ్ఞానేంద్రియాలను

జయించినవాడు, మానసిక ఇంద్రియాలను అధిగమించినవాడు.

శ్లోకము 86

[మార్చు]

గాంధారః = గాంధారము (సంగీతము) తానే అయినవాడు సప్త స్వరాలలో ఒకటి.

సువాసః = మంచి వస్త్రములు కలవాడు లేదా గొప్ప స్థలం; అద్భుతమైన కైలాస పర్వతం పై నివసించేవాడు.

తపస్సక్తః = తపస్సునందు లగ్నమైనవాడు

రతిః = కామిని యొక్క ఆకారము తానే అయినవాడు లేదా శారీరక ఆనందం యొక్క వ్యక్తిత్వం

నరః = సామాన్య మానవరూపము తానే అయినవాడు

మహాగీతః = గొప్ప గానము కలవాడు

మహానృత్యః = గొప్ప నాట్యము చేయువాడు

అప్సరసోగణసేవితః = అప్సరసల సమూహము చేత సేవింపబడినవాడు

శ్లోకము 87

[మార్చు]

మహాకేతుః = గొప్ప ధ్వజ చిహ్నము కలవాడు

మహాధాతుః = గొప్ప శరీర ధాతువు యొక్క బలము కలవాడు

అనేకసానుచరః = అనేకమైన కొండ చరియలందు సంచరించువాడు

చలః = సంచలనము కలవాడు

ఆవేదనీయః = తెలిసికొనదగినవాడు

ఆవేశః = తీవ్రత కలవాడు

సర్వగంధ సుఖావహః = సమస్త సుగంధముల యొక్క సుఖమును కలిగినవాడు.

శ్లోకము 88

[మార్చు]

తోరణః = ప్రపంచమునకు ముఖద్వారము వంటివాడు

తారణః = తరింపజేయువాడు

వాతః = వాయువు రూపమైనవాడు

పరిధీపతి ఖేచరః = సరిహద్దులను రక్షించు దేవతలకు అధిపతి

సంయోగః = స్త్రీ పురుష సంయోగమే తానైనవాడు

వర్ధనః = వృద్ధిచేయువాడు

వృద్ధః = పెద్దవాడు

అతివృద్ధః = మిక్కిలి పెద్దవాడు

గుణాధికః = మంచి గుణములచేత అధికుడు.

శ్లోకము 89

[మార్చు]

నిత్యః = ఎల్లకాలములయందు

ఆత్మా = అందరి ఆత్మల రూపము తానే అయినవాడు

సహాయః = సహాయముగా ఉండువాడు

దేవాసురపతిః = దేవతలకు, రాక్షసులకు అధిపతి అయినవాడు

పతిః = సమస్తమునకు అధిపతి అయినవాడు

యుక్తః = తగినవాడు

యుక్తబాహుః = సరియైన బాహువులు కలవాడు

దేవః = దేవుడైనవాడు

దివి సుపర్వణః = స్వర్గమునందలి దేవతలలోని వాడు

శ్లోకము 90

[మార్చు]

ఆషాఢః = అన్నిటిని సహించు శక్తిని భక్తులకు ప్రసాదించువాడు

సుషాఢః = గొప్ప సహనశీలుడు

ధ్రువః = ధ్రువ నక్షత్రము తానైనవాడు

ధ్రువః(లేదా)స్కందదో = చెట్టు యొక్క శాఖ

హరిణః = లేడి యొక్క రూపము తానైనవాడు

హరః = సమస్తమును హరించువాడు

ఆవర్తమానేభ్యః = పునర్జన్మ మెత్తువారికి

వపుః = శరీర రూపము తానే అయినవాడు

వసుశ్రేష్ఠః = అష్ట వసువులలో శ్రేష్ఠుడైనవాడు

మహాపథః = గొప్పదైన మార్గము తానే అయినవాడు.