Jump to content

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (గొడిసెర్యాల)

అక్షాంశ రేఖాంశాలు: 19°13′N 78°28′E / 19.21°N 78.46°E / 19.21; 78.46
వికీపీడియా నుండి

శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణరాష్ట్రం నిర్మల్ జిల్లా, దస్తూరాబాద్ మండలంలోని గోడ్‌సెర్యాల్ గ్రామంలో కొలువైన రాజరాజేశ్వర స్వామి.ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ఆలయంలో నాగుపాము ప్రత్యేక్షవడం ఆలయ విశిష్టత[1][2].

గోడ్‌సెర్యాల్ రాజరాజేశ్వర దేవాలయం
గోడ్‌సెర్యాల్ రాజరాజేశ్వర దేవాలయం is located in Telangana
గోడ్‌సెర్యాల్ రాజరాజేశ్వర దేవాలయం
గోడ్‌సెర్యాల్ రాజరాజేశ్వర దేవాలయం
తెలంగాణ లో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :19°13′N 78°28′E / 19.21°N 78.46°E / 19.21; 78.46
పేరు
ఇతర పేర్లు:రాజరాజేశ్వర స్వామి
ప్రధాన పేరు :శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం గోడ్‌సెర్యాల్ దస్తూరాబాద్ నిర్మల్ జిల్లా
దేవనాగరి :गोडिसेर्याल श्री राजराजेश्वर स्वामी देवस्थान
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాదు జిల్లా
ప్రదేశం:గోడ్‌సెర్యాల్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ప్రధాన దేవత:పార్వతి
ముఖ్య_ఉత్సవాలు:మహాశివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షీణ భారత దేశ హిందూ దేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:01

చరిత్ర

[మార్చు]

గొడిసెర్యాల ఆలయా ముఖ్య పూజారి అయినా సిడాం లక్ష్మణ స్వామి ఒకప్పుడు కేస్లాపూర్ నాగోబా జాతరకు వెళ్లి అక్కడి దర్శనం అనంతరం జాతర తిరగడానికి వేళ్ళినప్పుడు అక్కడ స్వామి కి రూపాయీ బిల్ల దోరికింది‌. ఆ రూపాయీ బిల్లను తీసుకుని స్వామి తినుబండారాలు కొనుక్కున్నాడు , తినుబండారాలు కొనుక్కున్నా కూడా ఆ రూపాయీ బిల్ల తిరిగి అతని జేబులోకె‌ రావడం జరిగింది, మళ్లీ అదే రూపాయీ తో మరికొన్ని తినుబండారాలు కొనుక్కున్నా కూడా మారల ఆ రూపాయీ అతని జేబులోకి రావడం జరిగింది , పదె పదె ఆ రూపాయీ జేబులోకి రావడం చూసి స్వామి భయభ్రాంతులకు గురయ్యాడు, అలా భయపడుతూ ఆ రూపాయీ బిల్లను ఇంటికి తీసుకువచ్చాడు, తెల్లవారుజామున లేచి వాళ్ళ మామిడి తోటకు పొలం పనుల కోసం వెళ్ళాడు, వేళ్ళిన తర్వాత పని చేస్తున్నా సమయం లో ఆ రూపాయీ బిల్ల ఒక మామిడి చెట్టు కింద పడిపోయింది , పడిపోయీన చోట భారి పుట్ట వెలువడం జరిగింది. ఆ పుట్టను చూసిన లక్ష్మణ స్వామి మళ్ళీ భయంతో ఇంటికి వచ్చి రాత్రి పడుకున్న అనంతరం ఆయనకు స్వయంగా శ్రీ రాజ రాజేశ్వరీ స్వామి వారు కళలో కనిపించడం జరిగింది, రూపాయీ బిల్ల రూపంలో కనిపించి నీతో వచ్చింది నేనె అని మీ మామిడి తోటలొ వెలిసింది నేనె అని చెప్పారు, లక్ష్మణ స్వామి వెంటనే లేచి ఉలిక్కిపడ్డాడు, తెల్లవారుజామున లేచిన తర్వాత స్వామి వారి నాన్న తనని పోలం పనులకు పంపించాడు , అక్కడ పార తీసుకుని పనులు చేయగానే అతని చేతులోకి పాము రావడం జరిగింది స్వామి భయపడి ఇంటికి వచ్చి తన తండ్రికి చేప్పాడు, స్వామి యెక్క తండ్రి పని నుండి తప్పించుకొవడానికి అబద్దం చెప్తున్నావు అని మందలించి తిరిగి మళ్లీ పొలం పనికి పంపించాడు. మళ్లీ స్వామి అక్కడ పార తీసుకుని పని ప్రారంభించగానె చేతులకు పోక్కులు వచ్చాయి, ఎప్పుడూ పని చేసిన రాని పొక్కులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని ఎడ్వాసాగాడు అదె సమయం లో మామిడి తోట అంతట పాములు తిరగసాగయి, స్వామి మరల ఇంటికి పరిగెత్తాడు ,ఈ విషయం ఇంటికి వచ్చి తండ్రికి చెప్తే నమ్మలేదు పని తప్పించుకోవడం కోసం అబద్దం చెప్తున్నావు అని అన్నాడు . రాత్రి అయి అందరూ పడుకున్నారు , మరల స్వామి కళలో వచ్చి నేను అక్కడ కోలువయ్యూను అని ఆ రూపాయీ బిల్ల రూపంలో వచ్చాను, నాకు పూజలు అందించు నిన్ను ని నీ భక్తులకు కొండంత అండగా ఉంటాను , కోరిన కోరికలు తీరుస్తాను అని స్వయనా ఆ రాజరాజేశ్వరుడు వచ్చి చెప్తాడు. అప్పటి నుంచి అక్కడ పూజలు చేస్తూ వస్తున్నారు

శివ పార్వతుల కల్యాణం

[మార్చు]

పచ్చని పరిసరాలు గోదావరి గలగలలు మధ్య సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవ క్షేత్రం గొడిసెర్యాల రాజన్న గా ప్రసిద్ధి.మహాశివరాత్రి పండుగ సందర్భంగా స్వామి వారికి ఆలయ పూజారి సిడాం లక్ష్మణ్ స్వామి నిత్యం కర్పూర హారతి, క్షీరాభిషేకం,గాంగాభిషేకం, తో పాటు పర్వదినం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.ఆలయంలో శివ పార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి.మహాశివరాత్రి సమయం లో పది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కుంకుమ పూజ, సాముహిక హోమం,అన్న పూజ, మల్లన్న బోనాలు, పోచమ్మ బోనాలు ఉంటాయి.కార్తిక మాసంలో ప్రతి రోజూ సాయంత్రం దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకుంటారు.

చరి

ప్రత్యేకతలు

[మార్చు]

ఆ గోడ్ సెర్యాల శివాలయంలో మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో నాగుపాము ప్రత్యేక్షవడం భక్తులు శివుడి తో పాటు నాగేంద్రుని దర్శించుకొవడం విశేషం.

ఇక్కడ కోరిన కోర్కెలు తీర్చుకోవడానికి భక్తులు ఆలయ ప్రాంగణంలో రాయిని కోరినా కోర్కెలు నెరవేరుతాయని మనస్సులో అనుకుంటే ఆ రాయిని గుండ్రంగా తిప్పగలము.నేరవేరకుంటే ఆ రాయి చాలా కష్టంగా తిరుగుతుంది.కొంత మంది భక్తులు రాయిని సులభంగా పైకి లెపడం కోరిన కోర్కెలు నెరవేరక పోతే బరువు అయిపోతుంది అని భక్తులు అంటారు.

ఇతర శైవ క్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు భక్తులు కోర్కెలు తీర్చే రాజన్న అనీ ఎర్రటి బట్టలో కొబ్బరి కాయ కట్టడం మరో విశేషం.

ఉత్సవాలు

[మార్చు]

గొడిసెర్యాల ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రి రోజున పార్వతి పరమేశ్వరులు కళ్యాణం ఉంటుంది. స్వామి వారి రథోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువగా కొనసాగుతుంది. ఇచట ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున అద్భుత సంఘటనలు చోటు చేసుకుంటోంది. మహా శివుడు కంఠాభరణంగా ధరించే నాగుపాము ఆలయంలో ప్రత్యేక్షమై భక్తులకు దర్శనమిస్తాడు[3]. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.అనంతరం దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జాతర

[మార్చు]

శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో మూడు రోజులు పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తారు.

భక్తుల తాకిడి

[మార్చు]

ఇచట ప్రతి సోమవారం, శనివారం దేవుని దర్శించు కొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దస్తూరాబాద్ మండలం నుండే కాకుండా నిర్మల్ , మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుండే కాక జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి దేవునికి కొబ్బరి కాయ కొట్టి పూజలు చేసి కోరిక కోర్కెలు తీర్చే రాజన్నగా భావించి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2023-02-19). "శివరాత్రి పూట శివాలయంలోకి నాగుపాము.. పదకొండేండ్లుగా ఇదే వరుస.. దర్శనానికి భక్తుల బారులు". www.ntnews.com. Retrieved 2024-11-17.
  2. Telugu, TV9 (2024-03-09). "Maha Shivaratri: శివాలయంలో నాగుపాము దర్శనం .. ప్రతి ఏటా శివరాత్రి జాగరణ సమయంలో ప్రత్యక్షం అవుతున్న నాగేంద్రుడు." TV9 Telugu. Retrieved 2024-11-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Nirmal: శివపార్వతుల కళ్యాణం జరుగుతుండగా నాగు పాము ప్రత్యక్ష్యం.. ఇది శివయ్య మహత్యమే..!". Samayam Telugu. Retrieved 2024-11-17.