Jump to content

సంక్రాంతికి వస్తున్నాం

వికీపీడియా నుండి
సంక్రాంతికి వస్తున్నాం
దర్శకత్వంఅనిల్ రావిపూడి
రచనఅనిల్ రావిపూడి
నిర్మాతదిల్ రాజు
శిరీష్
తారాగణం
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుతమ్మిరాజు
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
2025 జనవరి 14 (2025-01-14)(థియేటర్)
2025 మార్చి 1 (2025-03-01)( జీ5 ఓటీటీలో)
సినిమా నిడివి
144 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

సంక్రాంతికి వస్తున్నాం అనేది 2025లో విడుదలైన తెలుగు సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.[2] వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను, ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2025 జనవరి 14న థియేటర్‌లలో విడుదల చేశారు.[3] సంక్రాంతికి వస్తున్నాం మార్చి 1 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.[4]


సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలై

న మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరి,[5] 17 రోజులలోనే రూ.303 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వాసులు చేసింది.[6]

అమెరికాలో పెద్ద వ్యాపారవేత్త తెలుగువాయుడైన స‌త్య ఆకెళ్ల (అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌)తో సొంత రాష్ట్రంలో ఓ నాలుగైదు కంపెనీలు పెట్టించాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ (నరేశ్‌) అతనిని హైదరాబాద్‌కు అతిధిగా ఆహ్వానించగా సత్యను ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అతిథిగా వున్న స‌త్య కిడ్నాప్ విష‌యం బ‌య‌టికి తెలిస్తే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో ఓ రహస్య ఆపరేషన్‌ చేపట్టాలని నిర్ణయించుకొని ఓ ఎన్ కౌంటర్ విషయంలో సస్పెషన్‌కి గురైన మాజీ పోలీస్‌ అధికారి, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ యాదగిరి దామోదర రాజు అలియాస్‌ చిన్నరాజు (వెంకటేశ్‌)ను రంగంలోకి దించాలని అనుకోని ఈ భాద్యతను తన మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ మీనాక్షి (మీనాక్షి చౌద‌రి)కి అప్పగిస్తారు.

రాజు (వెంకటేశ్‌) భార్య భాగ్యంకి (ఐశ్వ‌ర్య రాజేష్‌) భ‌ర్త అంటే పిచ్చి ప్రేమ‌. పోలీస్‌ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్‌ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది? తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆ ఆపరేషన్‌కు పంపించడానికి భాగ్యం (ఐశ్వర్య రాజేశ్‌) ఎలా ఒప్పుకొంది? ఆ తరువాత ఈ ఆపరేషన్‌లో ఎదురైన సవాళ్లేంటి? అనేదే మిగిలిన కథ.[7]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: అనిల్ రావిపూడి
  • రచన: అనిల్ రావిపూడి
  • సంగీతం: భీమ్స్ సీశీరోలియో
  • గీత రచయితలు: భాస్కరభట్ల రవికుమార్, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, రఘురాం
  • నేపథ్య గానం: రమణ గోగుల, మధుప్రియ, ప్రణవి ఆచార్య, వెంకటేష్, రోహిణి సోరట్, శ్రీకృష్ణ, రేవతి మన్నవ, మాధవి రావూరి, సుధ, భీమ్స్ సిసిరోలియో
  • ఛాయా గ్రహణం: సమీర్ రెడ్డి
  • కూర్పు: తమ్మిరాజు
  • నిర్మాతలు:దిల్ రాజు, శిరీష్
  • నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
  • విడుదల:14:01:2025.

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."గోదారి గట్టు మీద రామసిలకవే[11]"భాస్కరభట్లభీమ్స్ సిసిరోలియోరమణ గోగుల,[12] మధుప్రియ4:10
2."మీను[13]"అనంత శ్రీరామ్ భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య4:45
3."బ్లాక్ బస్టర్ పొంగల్"రామజోగయ్య శాస్త్రి వెంకటేష్, భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరట్3:09
4."లల్లయిరే"రఘురాం భీమ్స్ సిసిరోలియో1:33
5."గురువర్య"అనంత శ్రీరామ్ శ్రీకృష్ణ3:32
6."చిన్న రాజు"అనంత శ్రీరామ్ రేవతి మన్నవ, మాధవి రావూరి, సుధ0:57

మూలాలు

[మార్చు]
  1. "ఓటీటీలో సంక్రాంతి.. షాక్‌లో అభిమానులు". Chitrajyothy. 1 March 2025. the original నుండి 5 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 March 2025.
  2. "సంక్రాంతికి వస్తున్నాం.. -". Nava Telangana. 9 November 2024. the original నుండి 23 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 December 2024.
  3. "వెంకీమామ 'సంక్రాంతికి వస్తున్నాం' రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?". 10TV Telugu. 20 November 2024. the original నుండి 23 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 December 2024.
  4. "ఓటీటీకి సంక్రాంతికి వస్తున్నాం". Eenadu. 28 February 2025. the original నుండి 28 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 February 2025.
  5. "మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో..." ABP Desham. 17 January 2025. the original నుండి 22 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 February 2025.
  6. "'సంక్రాంతికి వస్తున్నాం' కలెక్షన్స్‌.. ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌గా రికార్డ్‌". Sakshi. 3 February 2025. the original నుండి 22 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 February 2025.
  7. "సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ.. పక్కా పండగ బొమ్మ.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిందే." TV9 Telugu. 14 January 2025. the original నుండి 22 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 February 2025.
  8. "పాత్రల విషయంలో ఆ నియమం పెట్టుకున్నా". Eenadu. 9 January 2025. the original నుండి 9 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 January 2025.
  9. "'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లిరాజు బ్యాక్ గ్రౌండ్ తెలుసా? ఈ బుడ్డోడు మామూలోడు కాదండోయ్". TV9 Telugu. 15 January 2025. the original నుండి 15 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 January 2025.
  10. "నాడు ఎమ్మెస్‌.. నేడు రేవంత్‌.. 'సంక్రాంతికి వస్తున్నాం'లో ఆకట్టుకున్న బులిరాజు". 20 January 2025. the original నుండి 20 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2025.
  11. "విక్ట‌రీ వెంక‌టేశ్ 'సంక్రాంతికి వ‌స్తున్నాం'.. ఫ‌స్టు సాంగ్.. 'గోదారి గట్టు మీద రామసిలకవే'.. వెంకీ, ఐశ్వ‌ర్య డ్యాన్స్ అదుర్స్‌." 10TV Telugu. 3 December 2024. the original నుండి 23 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 December 2024.
  12. "ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేయాలనుకుంటున్నాను: రమణ గోగుల". Sakshi. 18 December 2024. the original నుండి 23 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 December 2024.
  13. "సంక్రాంతికి వస్తున్నాం.. మరో మెలొడీ రిలీజ్‌". Eenadu. 19 December 2024. the original నుండి 23 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 December 2024.

బయటి లింకులు

[మార్చు]