సంగీత్ శివన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగీత్ శివన్
సిలోన్ (ఇనామ్) చిత్ర ప్రదర్శనలో సంగీత్ శివన్
జననం1958/1959
మరణం (aged 65)
వృత్తిదర్శకుడు, స్క్రీన్ రైటర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వ్యూహం (1990)
యోధ (1992)
నిర్ణయం (1995)
క్యా కూల్ హై హమ్
తల్లిదండ్రులుశివన్ (తండ్రి)
బంధువులుసంతోష్ శివన్ (సోదరుడు)
సంజీవ్ శివన్ (సోదరుడు)

సంగీత్ శివన్ (1958/1959 - 2024 మే 8) మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలలో పనిచేసిన భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్.[1][2]

ఆయన వ్యుహం (1990), యోధా (1992), క్యా కూల్ హై హమ్ (2005), యమ్లా పగ్లా దీవానా 2 (2013) చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందాడు.[3][4][5]

కెరీర్

[మార్చు]

అమీర్ ఖాన్, పంకజ్ కపూర్ నటించిన రాఖ్‌ (1989) చిత్రంతో ​​ఆయన కెరీర్ ప్రారంభించాడు.[6] ఆ తరువాత, ఆయన రఘువరన్ నటించిన విజయవంతమైన మలయాళ చిత్రం వ్యూహంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దర్శకుడిగా ఆయన రెండవ చిత్రం యోధ తో దేశవ్యాప్తంగా గుర్తింపును పొందాడు. అరడజనుకు పైగా మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించిన తర్వాత, అతను సన్నీ డియోల్ నటించిన తన మొదటి బాలీవుడ్ చిత్రం జోర్‌ (1998)కు దర్శకత్వం వహించాడు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు కానీ ఆయన దర్శకత్వ సామర్థ్యాన్ని చాలా మంది నిర్మాతలు బాగా అభినందించారు. కొంతకాలం గ్యాప్ తర్వాత అతను జాకీ ష్రాఫ్ సంధ్య చిత్రం, తరువాత పాంటలూన్ చుర లియా హై తుమ్నేలో ఆయన పని చేసాడు.

యోధ, గంధర్వం, నిర్ణయం అనే మూడు చిత్రాలలో సంగీత్ శివన్ మోహన్‌లాల్‌తో కలిసి పనిచేసాడు.

2012లో, డియోల్ కుటుంబంతో కలిసి యమ్లా పగ్లా దీవానా 2 అనే హాస్య చిత్రానికి దర్శకత్వం వహించడానికి శివన్ యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లాడు.

అతను 2024లో మరణించే నాటికి మలయాళ చిత్రం రోమంచం హిందీ రీమేక్ అయిన కప్కపియీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా భాష పని చేసిన విభాగం గమనికలు
దర్శకుడు రచయిత నిర్మాత
1989 రాఖ్ హిందీ Red XN Red XN Green tickY ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా
1990 వ్యూహం మలయాళం Green tickY Green tickY Red XN దర్శకత్వ రంగప్రవేశం
1992 యోధ మలయాళం Green tickY Green tickY Red XN
1992 నాన్న మలయాళం Green tickY Red XN Red XN
1993 గంధర్వం మలయాళం Green tickY Green tickY Red XN
1993 జానీ మలయాళం Green tickY Green tickY Red XN విజేత, ఉత్తమ పిల్లల చిత్రంగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
1995 నిర్ణయము మలయాళం Green tickY Green tickY Red XN
1998 జోర్ హిందీ Green tickY Red XN Red XN
2000 స్నేహపూర్వం అన్నా మలయాళం Green tickY Red XN Red XN
2003 చుర లియా హై తుమ్నే హిందీ Green tickY Red XN Red XN
2005 క్యా కూల్ హై హమ్ హిందీ Green tickY Red XN Red XN
2006 అప్నా సప్నా మనీ మనీ హిందీ Green tickY Red XN Red XN
2009 ఏక్ - ది పవర్ ఆఫ్ వన్ హిందీ Green tickY Red XN Red XN తెలుగు సినిమా అతడు అఫీషియల్ రీమేక్
2010 క్లిక్ హిందీ Green tickY Red XN Green tickY
2012 ఇడియట్స్ మలయాళం Red XN Green tickY Green tickY
2013 యమ్లా పగ్లా దీవానా 2 హిందీ Green tickY Red XN Red XN
2017 E హిందీ Red XN Red XN Green tickY
2019 బ్రహ్మ్ హిందీ Green tickY Red XN Green tickY ZEE5 అసలైన సిరీస్
2024 కప్కపియి హిందీ Green tickY Red XN Red XN రోమంచం రీమేక్

మరణం

[మార్చు]

సంగీత్ శివన్ 65 సంవత్సరాల వయస్సులో 2024 మే 8న ముంబైలో మరణించాడు.[7][8] ఆయనకు భార్య జయశ్రీ, పిల్లలు సజన, శాంతను ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "'Romancham' gets a Hindi remake". The New Indian Express. 22 March 2024. Retrieved 8 May 2024.
  2. "Veteran filmmaker Sangeeth Sivan, known for Yodha, Gandharvam, Yamla Pagla Deewana 2, passes away". Indian express.
  3. "Sangeeth Sivan, on his return to Malayalam films- The New Indian Express". Archived from the original on 1 November 2014. Retrieved 19 October 2014.
  4. "List of Malayalam Movies directed by Sangeeth Sivan".
  5. "Veteran filmmaker Sangeeth Sivan, known for Yodha, Gandharvam, Yamla Pagla Deewana 2, passes away". Indian express.
  6. "Veteran filmmaker Sangeeth Sivan, known for Yodha, Gandharvam, Yamla Pagla Deewana 2, passes away". Indian express.
  7. "ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్ | Sakshi". web.archive.org. 2024-05-08. Archived from the original on 2024-05-08. Retrieved 2024-05-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Renowned filmmaker Sangeeth Sivan passes away at 65". Kaumudi Online. 8 May 2024. Retrieved 8 May 2024.