Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము

వికీపీడియా నుండి

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము తెలుగు భాషలో ప్రచురించబడిన విజ్ఞాన సర్వస్వము . దీనిని సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ సమితి, హైదరాబాదు ప్రచురించినది. దీని సంపాదకవర్గానికి అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త మామిడిపూడి వెంకటరంగయ్య గారు వ్యవహరించారు.[1] [2]ఈ విజ్ఞానకోశ ప్రచురణ విషయము 1958 ప్రాంతములందు ఉస్మానియా విశ్వవిద్యాలయ మహా భవనమున నొకమూల చిన్న గదిలో తళుక్కుమని మెరసినది. దీని ధ్యేయమును ప్రకాశకు లొకచోట ఈ విధముగ చెప్పినారు : "విశ్వ విజ్ఞానమును సంజే పరూపములో ఆంధ్రకుటీర ప్రాంగ ణములకు గొని వచ్చుటే ఈ కోశము యొక్క లక్ష్యము."

కార్యనిర్వాహక వర్గము

[మార్చు]

కార్యనిర్వాహక వర్గానికి అధ్యక్షలుగా డాక్టరు బెజవాడ గోపాలరెడ్డి (మంత్రి, రివెన్యూ - పౌర వ్యయము - భారత ప్రభుత్వము) వ్యవహరించగా ఉపాధ్యక్షలుగా ఆంధ్రరాష్ట్ర మాజీ వ్యవసాయశాఖామాత్యులు, డాక్టరు మర్రి చెన్నారెడ్డి, విద్యాశాఖామాత్యులు యస్.బి.పి. పట్టాభిరామారావు మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయోపాధ్యక్షులు డి. సదాశివరెడ్డి గార్లు వ్యవహరించారు. కార్యవర్గానికి కార్యదర్శిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంధ్రశాఖాధ్యక్షులు ఖండవల్లి లక్ష్మీరంజనం కాగా, సంయుక్త కార్యదర్శిగా డా. బేతనభట్ల విశ్వనాథం, సహాయ కార్యదర్శిగా డా. బిరుదురాజు రామరాజు మరియు కోఠాధిపతిగా భౌతిక శాస్త్రశాఖాధ్యక్షులు డా. రావాడ సత్యనారాయణ గా పనిచేశారు. కార్యనిర్వాహకవర్గ సభ్యులుగా పి. వి. జి. రాజు , వి. యస్. కృష్ణ, జటప్రోలు రాజావారు, మోటూరి సత్యనారాయణ, కల్వ సూర్యనారాయణ గుప్త, బెర్డే జగదీశ్వరయ్య గుప్త, యస్. వేంకటేశ్వరరావు, పుట్టపర్తి శ్రీనివాసాచారి, వల్లూరి సుబ్బరాజు, జి. వి. సుధాకరరావు, కాసుగంటి రాజేశ్వరరావు, కంచెనేపల్లి పెదవెంకట్రామారావు, యం. ఆర్. అప్పారావు, మరియు కె. నరసింహాచారి గార్లు సేవచేశారు.

సంపుటములు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మామిడిపూడి వేంకటరంగయ్య(సం.) (1958). ఆంధ్ర విజ్ఞాన కోశము (మొదటి సంపుటము).
  2. gdurgaprasad (2023-04-07). "–మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -3(చివరిభాగం )". సరసభారతి ఉయ్యూరు (in ఇంగ్లీష్). Retrieved 2023-04-19.

బయటి లింకులు

[మార్చు]