సంఝీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంఝీ మాత
సంఝీ మాతల విగ్రహాలు
సంఝీ మాత సోదరుడు

సంఝీ అనే పండుగను పెళ్ళి కాని ఆడపిల్లలు నవరాత్రుల సమయంలో జరుపుకుంటారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ఉత్తరప్రదేశ్పంజాబ్,  హర్యానా రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఎక్కువగా ఈ పండుగను  జరుపుకుంటారు.[1]

సంఝీ పూజ[మార్చు]

ఆవు పేడను అమ్మవారి రూపంలో తయారు చేసి గోడకు అతికించి, ఆ బొమ్మలకు పూజ చేస్తారు. ఆ రూపాలనే సంఝీ అమ్మవారిగా భావిస్తారు. కొన్ని ప్రదేశాల్లో నక్షత్రాలు,సూర్యుడు, చంద్రుడు రూపాల్లో  కూడా  తయారు చేస్తారు. వీటికి వివిధ రకాల రంగులు కూడా వేస్తారు.  స్థానిక కుమ్మరులు అమ్మవారి చేతులు, కాళ్ళు, ముఖం, ఆభరణాలు, ఆయుధాలు కూడా తయారు చేస్తారు. ఈ అలంకరణలతో అమ్మవారి విగ్రహం మరింత ఆకర్షణీయంగా, అందంగా తయారవుతుంది. కొందరు తాహతు కొద్దీ బంగారం, వెండి, ఇతర లోహాలతో అలంకారాలు కూడా చేస్తూంటారు.[2]

నవరాత్రుల  మొదటిరోజున  అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారు. ఈ  తొమ్మిది  రోజుల్లోనూ  ప్రతీ సాయంత్రం  చుట్టుపక్కల ఆడవారు  వచ్చి పూజలు చేస్తారు. పెళ్ళికాని  ఆడపిల్లలు అమ్మవారికి పూజలు చేసి, పాటలు పాడి, హారతులిస్తారు. ఈ పూజలోని ముఖ్యభాగం ఆడవారు పాడే పాటలు, భజనలే. ఇలా పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడని  వారి నమ్మకం.  చుట్టుపక్కల  ఉండే పెద్ద ముత్తైదువలు  ఈ ప్రకారంగా పెళ్ళి కాని ఆడపిల్లల  చేత దగ్గరుండి పూజ చేయిస్తుంటారు. మొత్తంగా  ఇది  ఆడవారి  పేరంటమే.  ఇలా సంఝీ  అమ్మవారిని  తమ  ఇంటి  గోడలపై ప్రతిష్టించుకుని,  తొమ్మిది రాత్రులూ పూజిస్తే తమకు అంతా  శుభమే జరుగుతుందని వారు నమ్ముతుంటారు.  తమ  పిల్లలకు  మంచి పెళ్ళి  జరగాలని  కూడా  ఈ పూజ  చేస్తుంటారు  కొంతమంది.  దసరా రోజున  అమ్మవారి విగ్రహాన్ని  ఊరేగించి, నిమజ్జనం  చేస్తారు. నిమజ్జనంతో  సంఝీ పండుగ ముగుస్తుంది.[3] ప్రతీరోజూ రకరకాల వంటకాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటారు ఆడపిల్లలు.

వ్రజలోని సంఝీ దేవాలయం, అక్కడి ఆచారాలు[మార్చు]

శ్రీకృష్ణుడు తిరిగిన నందవ్రజంలో సంఝీ మాతకు మందిరం ఉంది. ఈ సంఝీ డిజైన్లలో రాధా కృష్ణుల లీలలు చిత్రిస్తూ ఉంటారు. ఈ సంఝీ  పూజలకు  శ్రీకృష్ణుని లీలలకు  చాలా దగ్గరి సంబంధం  ఉంది. వైష్ణవ వేదాంతంలో  ఈ సంఝీ పూజలకు మూలాలు  ఉన్నాయి. ఒక కథనం ప్రకారం ఈ సంఝీ పూజలను రాధాదేవి శ్రీకృష్ణుని కోసం చేసిందట. జానపద కథల్లో మరో విధంగా ఉంది. దాని ప్రకారం కృష్ణుడే రాధను ఆనందపరిచేందుకు ఆమె బొమ్మని పూలతో వేసేవాడట.[4]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సంఝీ&oldid=2606722" నుండి వెలికితీశారు