సదానంద్ విశ్వనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సదానంద్ విశ్వనాథ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1962-11-29) 1962 నవంబరు 29 (వయసు 61)
బెంగళూరు
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 172)1985 ఆగస్టు 30 - శ్రీలంక తో
చివరి టెస్టు1985 సెప్టెంబరు 14 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 52)1985 జనవరి 20 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1988 జనవరి 7 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే
మ్యాచ్‌లు 3 22
చేసిన పరుగులు 31 72
బ్యాటింగు సగటు 6.20 9.00
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు 20 23*
వేసిన బంతులు - -
వికెట్లు - -
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు 11/- 17/7
మూలం: ESPNcricinfo, 2020 మే 10

సదానంద్ విశ్వనాథ్ (జననం 1962 నవంబర్ 28, బెంగుళూరు, కర్ణాటక ) 1985 నుండి 1988 వరకు 3 టెస్టులు, 22 వన్‌డేలు ఆడిన మాజీ భారతీయ క్రికెటరు. [1] ప్రస్తుతం, అతను ఫస్ట్ క్లాస్ అంపైర్, కోచ్.

కెరీర్[మార్చు]

80వ దశకం మధ్యలో ప్రపంచ క్రికెట్‌లో భారతదేశం ఉన్నత స్థానంలో ఉన్న సమయంలో సదానంద్ గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ టోర్నమెంట్‌ను, షార్జాలో జరిగిన రోథ్‌మన్స్ కప్‌ను 1985లో గెలుచుకున్న భారత జట్టులో సదానంద్ మొదటిసారి ఎంపికయ్యాడు.

ప్లేయింగ్ స్టైల్[మార్చు]

దూకుడుగా ఉండే వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్, విశ్వనాథ్ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అలన్ బోర్డర్ ఆస్ట్రేలియన్లపై కొట్టిన పెద్ద సిక్సర్‌కు గుర్తుండిపోయాడు. బోర్డర్ ఆ తర్వాత వ్యాఖ్యానించాడు, "బంతి కిందకు వచ్చేసరికి దానిపై మంచు పడి ఉండవచ్చు!"

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

అంతర్జాతీయ క్రికెట్‌లో విశ్వనాథ్ ఆడిన ఆటలు బాగా తక్కువ. సునీల్ గవాస్కర్ తన 'వన్-డే వండర్స్' పుస్తకంలో ఇలా వ్యాఖ్యానించాడు, "మేము 1985లో క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలవడానికి అనేక ఇతర కారణాల గురించి ప్రజలు మాట్లాడుతూంటారు. అయితే స్టంప్‌ల వెనుక సదానంద్ విశ్వనాథ్ ఉండటం ఒక ప్రధాన కారణం." ఆస్ట్రేలియన్ మీడియా కూడా "బాగా-కనిపించే ఈ వికెట్-కీపరు భారతదేశపు అత్యుత్తమ కీపరు అవుతాడు" అని రాసింది.

తల్లిదండ్రుల మరణం[మార్చు]

కొద్ది గ్యాపు లోనే తల్లిదండ్రులిద్దరూ మరణించడం అతన్ని మనోవేదనకు గురిచేసింది. తనపై ఉంచిన అంచనాలను చేరుకోలేకపోయాడు. అతని స్థానంలో కిరణ్ మోరే, చంద్రకాంత్ పండిట్‌లను వికెట్ కీపర్లుగా నియమించారు. అయితే

కోచింగ్ అకాడమీ[మార్చు]

సదానంద్ ఇప్పుడు తన ప్రైవేట్ క్రికెట్ కోచింగ్ అకాడమీని బెంగుళూరులోని కుండలహళ్లిలో నడుపుతున్నాడు. రంజీ ట్రోఫీ కోసం భారతదేశపు దేశీయ ఛాంపియన్‌షిప్‌లో అంపైర్‌గా పనిచేసాడు. ఇటీవల, సదానంద్ భారత అంపైర్ల ఎలైట్ ప్యానెల్లోకి పదోన్నతి పొందాడు. తద్వారా అతను ఎగువ శ్రేణికి అంటే దులీప్, దేవధర్ ట్రోఫీల కోసం ఆడే జోనల్ మ్యాచ్‌లలో అంపైరింగు చేయడానికి అర్హత పొందాడు.

ప్రస్తావనలు[మార్చు]

  1. "Sadanand Viswanath". ESPN Cricinfo. Retrieved 9 May 2020.