సన్సార్‌పూర్
సన్సార్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 31°16′15″N 75°36′19″E / 31.2707°N 75.6052°E | |
Country | India |
రాష్ట్రం | Punjab |
జిల్లా | Jalandhar |
జనాభా (2001) | |
• Total | 4,061 |
భాషలు | |
• అధికార | Punjabi |
Time zone | UTC+5:30 (IST) |
సన్సాపూర్ భారతదేశ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ (Sansarpur, Jalandhar district) జిల్లాకు చెందిన గ్రామం.
జనాభా వివరాలు
[మార్చు]2001 భారత జనాభా గణన ప్రకారం [1] ఈ గ్రామ జనాభా 4061. మొత్తం జనాభాలో పురుషులు 51%, స్త్రీలు 49% ఉన్నారు. ఈ గ్రామ సరాసరి అక్షరాస్యత 75%. ఇది జాతీయ సరాసరి అక్షరాస్యత 59.5% కన్నా ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 79%, స్త్రీల అక్షరాస్యత 71%. ఈ గ్రామంలొ 11 శాతం మంది ప్రజలు 6 యేండ్లకు తక్కువ వయసున్నవారే.
చరిత్ర
[మార్చు]ఈ గ్రామం సుమారు 300 సంవత్సరాల పూర్వము నుండి గలది. ఆ కాలంలొ ఐదు కుటుంబాలు ఈ గ్రామానికి వచ్చారు. వారి కుటుంబీకులు "కులార్", కుంధి" గా పిలువబడుతున్నారు.
క్రీడల్లో ప్రత్యేకత
[మార్చు]భారతదేశంలోని ఏ ఇతర గ్రామంలో లేని ప్రత్యేకత ఈ గ్రామానికి ఉంది. అది అత్యధికంగా భారతదేశంలోని ఒలెంపిక్ క్రీడాకారులు ఈ గ్రాం వారే కావడం. ఈ గ్రామంలో 14 హాకి ఒలెంపిక్ క్రీడాకారులు ఇండియా, కెన్యా, కెనడా ఒలెంపిక్స్ లలో పాల్గొన్నారు.[ఆధారం చూపాలి] ఒక ఒలెంపిక్ లో ఈ గ్రామానికి చెందిన ఏడుగురు క్రీడాకారులు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించారు. వారిలో ఐదుగురు భారతదేశానికి, ఇద్దరు కెన్యా దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం సరైన సహకారాన్నందించక పోవడాం మూలాన ఈ గ్రామం నుండి హాకీ క్రీడాకారులు తగ్గిపోయారు.
గ్రామంలో ప్రముఖులు
[మార్చు]ఈ గ్రామం నుండి అనేక మంది ప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారులున్నారు.:[2]
- గుర్జిత్ సింగ్ కుల్లార్,(1958) ఆసియన్ క్రీడలు
- గురుదేవ్ సింగ్ కుల్లార్, ఒలెంపియన్
- ఉద్దమ్ సింగ్Kకుల్లార్, ఒలెంపియన్
- దర్శన్ సింగ్ (ఫీల్డ్ హాకీ), ఒలెంపియన్
- అజిత్ పాల్ సింగ్ కుల్లార్, ఒలెంపియన్
- కొలొనెల్ బల్బీర్ సింగ్ కుల్లార్, ఒలెంపియన్
- బల్బీర్ సింగ్ కుల్లార్, ఒలెంపియన్
- రాజు సంసార్‌పూరి, కౌన్సిలర్ లండన్ బోరో ఆఫ్ హిల్లింగ్‌టన్, జనరల్ సెక్రటరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ కౌన్సిలర్స్ అసోసియేషన్.
మూలాలు
[మార్చు]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2016-07-24.
- ↑ "The Promised Land". Archived from the original on 2016-04-21. Retrieved 2016-07-24.
This article about a location in the Indian state of Punjab is a stub. You can help Wikipedia by expanding it. |