అక్షాంశ రేఖాంశాలు: 31°16′15″N 75°36′19″E / 31.2707°N 75.6052°E / 31.2707; 75.6052

సన్సార్‌పూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సన్సార్‌పూర్
పట్టణం
సన్సార్‌పూర్ is located in Punjab
సన్సార్‌పూర్
సన్సార్‌పూర్
పంజాబ్ (భారతదేశం) లో గ్రామ ఉనికి
సన్సార్‌పూర్ is located in India
సన్సార్‌పూర్
సన్సార్‌పూర్
సన్సార్‌పూర్ (India)
Coordinates: 31°16′15″N 75°36′19″E / 31.2707°N 75.6052°E / 31.2707; 75.6052
Country India
రాష్ట్రంPunjab
జిల్లాJalandhar
జనాభా
 (2001)
 • Total4,061
భాషలు
 • అధికారPunjabi
Time zoneUTC+5:30 (IST)

సన్సాపూర్  భారతదేశ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ (Sansarpur, Jalandhar district) జిల్లాకు చెందిన గ్రామం.

జనాభా వివరాలు

[మార్చు]

2001 భారత జనాభా గణన ప్రకారం [1]  ఈ గ్రామ జనాభా 4061. మొత్తం జనాభాలో పురుషులు  51%, స్త్రీలు  49% ఉన్నారు. ఈ గ్రామ సరాసరి అక్షరాస్యత   75%. ఇది జాతీయ సరాసరి అక్షరాస్యత  59.5% కన్నా ఎక్కువ. పురుషుల అక్షరాస్యత  79%, స్త్రీల అక్షరాస్యత  71%. ఈ గ్రామంలొ 11 శాతం మంది ప్రజలు 6 యేండ్లకు తక్కువ వయసున్నవారే. 

చరిత్ర

[మార్చు]

ఈ గ్రామం సుమారు 300 సంవత్సరాల పూర్వము నుండి గలది. ఆ కాలంలొ ఐదు కుటుంబాలు ఈ గ్రామానికి వచ్చారు. వారి కుటుంబీకులు "కులార్", కుంధి" గా పిలువబడుతున్నారు.

క్రీడల్లో ప్రత్యేకత

[మార్చు]

భారతదేశంలోని ఏ ఇతర గ్రామంలో లేని ప్రత్యేకత ఈ గ్రామానికి ఉంది. అది అత్యధికంగా భారతదేశంలోని ఒలెంపిక్ క్రీడాకారులు ఈ గ్రాం వారే కావడం. ఈ గ్రామంలో 14 హాకి ఒలెంపిక్ క్రీడాకారులు ఇండియా, కెన్యా, కెనడా ఒలెంపిక్స్ లలో పాల్గొన్నారు.[ఆధారం చూపాలి] ఒక ఒలెంపిక్ లో ఈ గ్రామానికి చెందిన ఏడుగురు క్రీడాకారులు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించారు. వారిలో ఐదుగురు భారతదేశానికి, ఇద్దరు కెన్యా దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం సరైన సహకారాన్నందించక పోవడాం మూలాన ఈ గ్రామం నుండి హాకీ క్రీడాకారులు తగ్గిపోయారు.

గ్రామంలో ప్రముఖులు

[మార్చు]

ఈ గ్రామం నుండి అనేక మంది ప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారులున్నారు.:[2]

  • గుర్జిత్ సింగ్ కుల్లార్,(1958) ఆసియన్ క్రీడలు
  • గురుదేవ్ సింగ్ కుల్లార్, ఒలెంపియన్
  • ఉద్దమ్ సింగ్Kకుల్లార్, ఒలెంపియన్
  • దర్శన్ సింగ్ (ఫీల్డ్ హాకీ), ఒలెంపియన్
  • అజిత్ పాల్ సింగ్ కుల్లార్, ఒలెంపియన్
  • కొలొనెల్ బల్బీర్ సింగ్ కుల్లార్, ఒలెంపియన్
  • బల్బీర్ సింగ్ కుల్లార్, ఒలెంపియన్
  • రాజు సంసార్‌పూరి, కౌన్సిలర్ లండన్ బోరో ఆఫ్ హిల్లింగ్‌టన్, జనరల్ సెక్రటరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ కౌన్సిలర్స్ అసోసియేషన్.

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2016-07-24.
  2. "The Promised Land". Archived from the original on 2016-04-21. Retrieved 2016-07-24.