Jump to content

సబా ఆజాద్

వికీపీడియా నుండి
సబా ఆజాద్
2012లో సబా ఆజాద్
జననంసబా సింగ్ గ్రేవాల్[1]
(1985-11-01) 1985 నవంబరు 1 (వయసు 39)[2]
ఢిల్లీ, భారతదేశం
వృత్తి
  • నటి
  • మ్యూజిషియన్
  • వాయిస్ ఆర్టిస్ట్
  • థియేటర్ డైరెక్టర్
క్రియాశీలక సంవత్సరాలు2008–ప్రస్తుతం
భాగస్వాములు
బంధువులు

సబా ఆజాద్ (జననం 1985 నవంబరు 1) భారతీయ నటి, థియేటర్ డైరెక్టర్, సంగీత విద్వాంసురాలు. ముంబైకి చెందిన ఎలక్ట్రో ఫంక్ ద్వయం మాడ్‌బాయ్/మింక్‌లో ఆమె ఉంది. ఆమె హిందీ చిత్రం దిల్ కబడ్డీ (2008)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[3] రొమాంటిక్ కామెడీ చిత్రం ముజ్సే ఫ్రాండ్‌షిప్ కరోగే (2011)లో ఆమె ప్రధాన పాత్రకు ప్రసిద్ధి చెందింది.[4] ఆమె 2016 వై-ఫిల్మ్స్ వెబ్ సిరీస్, లేడీస్ రూమ్‌లో డింగో పాత్రను కూడా పోషించింది.

సబా ఆజాద్‌గా సుపరిచితురాలు అయిన ఆమె అసలు పేరు సబా సింగ్ గ్రేవాల్. ఆమె ఆమె చలనచిత్రాలు, వెబ్ సిరీస్‌లు, థియేటర్‌ ఆర్ట్స్ లలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది. ఆమె చిన్నతనం నుండి సాంస్కృతికంగా సినిమా, నృత్యం, సంగీతం, థియేటర్‌లకు పరిచయం చేయబడింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె ఢిల్లీలో పంజాబీ తండ్రి, కాశ్మీరీ తల్లికి జన్మించింది.[5] ఆమె రంగస్థల దిగ్గజం సఫ్దర్ హష్మీ మేనకోడలు.[6] నాటక కుటుంబంలో జన్మించిన ఆమె చాలా చిన్న వయస్సు నుండి సఫ్దర్ హష్మీ థియేటర్ గ్రూప్ జన నాట్య మంచ్ వారి రంగస్థల నిర్మాణాలలో ప్రదర్శన ఇచ్చింది, అక్కడ ఆమె హబీబ్ తన్వీర్, ఎం.కె. రైనా, జి.పి. దేశ్‌పాండే, ఎన్.కె. శర్మలతో కలిసి పనిచేసింది.[7] ఆమె ఒడిస్సీ, క్లాసికల్ బ్యాలెట్, జాజ్, లాటిన్ వంటి నృత్య రూపాలతో పాటు సమకాలీన నృత్య రూపాల్లో కూడా శిక్షణ పొందింది.[8] ఆమె ఒడిస్సీ గురువు కిరణ్ సెగల్‌తో కలిసి ప్రయాణిస్తూ, ఆమె ఇంగ్లాండ్, కెనడా, నేపాల్‌తో సహా పలు దేశాలలో, భారతదేశంలో వివిధ ప్రదర్శనలు ఇచ్చింది.[6]

దర్శకుడు ఇషాన్ నాయర్ కోసం న్యూయార్క్ ఫ్లోరెన్స్‌లలో జరిగే ఉత్సవాలలో ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్ గురుర్‌లో ఆమె ప్రధాన పాత్రను పోషించినప్పుడు పాఠశాల విద్య అభ్యసిస్తోంది.[9] ఆ తర్వాత చాలా షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె 2013 నుండి 2020 వరకు ఇమాద్ షాతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది.[10][11] ఆ తరువాత 2022 నాటికి, ఆమె హృతిక్ రోషన్‌తో డేటింగ్ చేస్తోంది.[12]

కెరీర్

[మార్చు]

ఆమె 2008లో రాహుల్ బోస్ సరసన అనిల్ సీనియర్ దిల్ కబడ్డీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె వై-ఫిల్మ్స్ ముజ్సే ఫ్రాండ్‌షిప్ కరోగేలో ప్రీతి సేన్ పాత్రలో నిశాంత్ దహియా, సాకిబ్ సలీమ్‌ల సరసన నటించింది.[13]

2012లో నటుడు, సంగీతకారుడు ఇమాద్ షాతో ప్రారంభించి విస్తృతంగా ప్రజాదరణ పొందిన ఎలక్ట్రానిక్ బ్యాండ్ మాడ్‌బాయ్/మింక్‌లో ఆమె భాగస్వామి.[14][15]

ఆమె తన స్వంత థియేటర్ కంపెనీ ది స్కిన్స్‌ను 2010లో ప్రారంభించింది. సెప్టెంబరు 2010లో నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (NCPA) ప్రయోగాత్మక థియేటర్‌లో ప్రారంభించబడిన ఆమె మొదటి నాటకం లవ్‌పుక్‌(Lovepuke)కి దర్శకత్వం వహించింది.[16]

ఆమె ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లి పృథ్వీ థియేటర్‌లో మకరంద్ దేశ్‌పాండే దర్శకత్వం వహించిన ఇద్దరు వ్యక్తుల నాటకంలో నటించారు.[17]

ఆమె క్యాడ్‌బరీ, పాండ్స్, మ్యాగీ, టాటా స్కై, గూగుల్, కిట్ క్యాట్, వోడాఫోన్, సన్‌సిల్క్, నెస్కేఫ్, ఎయిర్‌టెల్, అలాగే క్లీన్ & క్లియర్, వెస్ట్‌సైడ్, ఆమ్‌వే వంటి మరెన్నో ప్రింట్ ప్రచారాలలో కూడా పనిచేసింది.[18]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2008 దిల్ కబడ్డీ రాగ మాలిక్
2011 ముజ్సే ఫ్రాండ్‌షిప్ కరోగే లోలా సేన్
2012 స్ట్రెంజర్స్ ఇన్ ది నైట్ రియా షార్ట్ ఫిల్మ్
2016 ప్యూర్-వెజ్ అంజలి షార్ట్ ఫిల్మ్
2019 కనెక్టెడ్ సబా షార్ట్ ఫిల్మ్
2020 హోమ్ స్టోరీస్ వైష్ణవి నెట్‌ఫ్లిక్స్

వెబ్ సిరీస్

సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్
2016 లేడీస్ రూం డింగో YRF వెబ్ సీరీస్
లవ్ షాట్స్ ప్రీతి YRF లిమిటెడ్ సీరీస్
2021 ఫీల్ లైక్ ఇష్క్ తారషా అహ్మద్ ఆంథాలజీ వెబ్ సిరీస్
2022 రాకెట్ బాయ్స్ పార్వణ ఇరానీ "పిప్సీ" సోని లివ్ సీరీస్
2023 ఊజ్ గైనక్ డాక్టర్ విదుషి అమేజాన్ మినిటీవి సీరీస్

మూలాలు

[మార్చు]
  1. Bahuguna, Lavanya (27 March 2017). "This Sikh Actress With An Islamic Name Explaining Her Religious Belief Is A Slap On The Face Of Extremists". IWB. Archived from the original on 19 May 2022. Retrieved 1 May 2022.
  2. "Birds of then". The Times of India. 2011-12-19.
  3. Chakrabarti, Paromita (10 December 2008). "Change of Scene". The Indian Express. Retrieved 24 December 2012.
  4. "When Saba lost her tresses!". Hindustan Times (in ఇంగ్లీష్). 2011-10-13. Retrieved 2020-05-20.
  5. "Mongrel me". The Times of India. 26 December 2011.
  6. 6.0 6.1 Doshi, Riddhi (1 January 2009). "'My uncle was my mentor'". DNA. Retrieved 2016-07-26.
  7. "Saba Azad". The Times of India Blogs. Retrieved 26 July 2016.
  8. "Saba Azad Blog". Economic Times Blog (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-20.
  9. Chakrabarti, Paromita (10 December 2008). "Change of Scene". The Indian Express. Retrieved 24 December 2012.
  10. Kumar, Aakash (February 2, 2022). "Hrithik Roshan mystery girl date Saba Azad was in a live relationship for seven years with Naseeruddin Shah's son Imaad".
  11. Vickey Lalwani (1 February 2022). "Were Saba Azad and Naseeruddin Shah's son Imaad in a live-in relationship for 7 years? - Exclusive Scoop!". Times of India.
  12. "Saba Azad makes relationship with Hrithik Roshan".
  13. "Mujhse Fraaandship Karoge". India Today. 17 October 2011. Retrieved 24 December 2012.
  14. "Introducing: The Quirky Sounds of Mumbai's Madboy/Mink". rsjonline.com.
  15. "5 things to know about Madboy/Mink".
  16. Sharma, Aditi (31 August 2010). "Falling in love (is hard on the knees)". Mid-Day. Retrieved 24 December 2012.
  17. "Saba Azad Biography, Saba Azad Bio, Saba Azad Photos, Videos, Wallpapers, News". In.com. Archived from the original on 2013-01-01. Retrieved 2013-06-30.
  18. "Saba Azad". The Times of India Blogs. Retrieved 26 July 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=సబా_ఆజాద్&oldid=4298909" నుండి వెలికితీశారు