Jump to content

ఐజాక్ న్యూటన్

వికీపీడియా నుండి
(సర్ ఐజాక్ న్యూటన్ నుండి దారిమార్పు చెందింది)
సర్ ఐజాక్ న్యూటన్
Godfrey Kneller's 1689 portrait of Isaac Newton aged 46
జననం(1643-01-04)1643 జనవరి 4
[OS: 25 December 1642][1]
Woolsthorpe-by-Colsterworth
లింకన్‌షైర్, ఇంగ్లండు
మరణం1727 మార్చి 31(1727-03-31) (వయసు 84)
[OS: 20 March 1726][1]
కెన్సింగ్‌టన్, లండన్, ఇంగ్లండు
నివాసంఇంగ్లండు
జాతీయతఇంగ్లీషు
రంగములుభౌతిక శాస్త్రము, గణితము, ఖగోళ శాస్త్రము,
న్యాచురల్ ఫిలాసఫీ, ఆల్కెమీ, థియాలజీ
వృత్తిసంస్థలుకేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
రాయల్ సొసైటీ
చదువుకున్న సంస్థలుకేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాల
విద్యా సలహాదారులుIsaac Barrow
Benjamin Pulleyn[2][3]
ముఖ్యమైన విద్యార్థులుRoger Cotes
William Whiston
John Wickins[4]
Humphrey Newton[4]
ప్రసిద్ధిన్యూటోనియన్ మెకానిక్స్
గురుత్వాకర్షణ
కలన గణితం
కాంతి శాస్త్రము
ప్రభావితులుNicolas Fatio de Duillier
John Keill
సంతకం
గమనికలు
His mother was Hannah Ayscough. His half-niece was Catherine Barton.

సర్ ఐజాక్ న్యూటన్ ( జనవరి 4, 1643 - మార్చి 31, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త, తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం, అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది. 1687లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ, గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.

బాల్యం

[మార్చు]

ఐజాక్ న్యూటన్ జనవరి 4, 1643లో లింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన Woolsthorpe Manor అనే గ్రామంలో జన్మించాడు. న్యూటన్ జన్మించే సమయానికి ఇంగ్లండు ప్రంపంచమంతా పాటించే క్యాలెండరును పాటించక పోవడం మూలాన ఆయన జన్మదినం డిసెంబరు 25, 1642గా నిక్షిప్తం చేయబడింది. న్యూటన్ తండ్రి చనిపోయిన మూడు మాసాలకు జన్మించాడు. నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు. న్యూటన్ తల్లి Hannah Ayscough ఆ పసికందు ఒక లీటర్ పాత్రలో పట్టగలడని చెప్పినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. న్యూటన్ కు మూడు సంవత్సరాల వయసు రాగానే అతడి తల్లి, ఇతడిని ఆమె తల్లియైన Margery Ayscough సంరక్షణలో వదిలేసి వేరొక వ్యక్తిని (Barnabus Smith) పెళ్ళాడి అతనితో వెళ్ళిపోయింది. చిన్నప్పుడు న్యూటన్ తన పెంపుడు తండ్రిని ద్వేషించే వాడు. అంతేకాక అతన్ని పెళ్ళి చేసుకున్నందుకు తన తల్లి మీద కూడా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇది 19 ఏళ్ళ లోపు అతను చేసిన పొరపాట్ల జాబితా నుంచి వెల్లడి అయింది.

యాంత్రికశాస్త్రం , గురుత్వాకర్షణ

[మార్చు]

"ఎడ్మండ్ హాలే ఆర్థిక సహాయంతో జూలై 1687 లో Principia ప్రచురించబడింది. ఈ పనిలో, న్యూటన్ మూడు సార్వత్రిక నియమాల (universal law of gravitation)ని పేర్కొన్నాడు. ఇది ఒక విప్లవాత్మక ఆవిష్కరణ. Principia తో, న్యూటన్ అంతర్జాతీయంగా గుర్తించబడ్డాడు. ఆయనకు స్విట్జర్లాండ్ కి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు నికోలస్ ఫ్యాటియో డి డ్యూలియర్ తో దగ్గర సంబంధం ఏర్పడింది. నికోలస్ ప్రింసిపియా పుస్తకాన్ని తిరగరాయడాం మొదలు పెట్టాడు. కానీ 1693 లో వారిద్దరి మధ్య సంబంధాలు చెడిపోవడంతో ఆ పుస్తకం బయటి రానే లేదు. అదే సమయంలో న్యూటన్ నాడీ వ్యవస్థ దెబ్బతినింది.

న్యూటన్ సూత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 During Newton's lifetime, two calendars were in use in Europe: the Julian or 'Old Style' in Britain and parts of Eastern Europe, and the Gregorian or 'New Style' elsewhere. At Newton's birth, Gregorian dates were ten days ahead of Julian dates: thus Newton was born on Christmas Day, 25 December 1642 by the Julian calendar, but on 4 January 1643 by the Gregorian. Moreover, the English new year began on 25 March (the anniversary of the Incarnation) and not on 1 January (until the general adoption of the Gregorian calendar in the UK in 1752). Unless otherwise noted, the remainder of the dates in this article follow the Julian Calendar.
  2. Dictionary of Scientific Biography, Newton, Isaac, n.4
  3. Gjersten, Derek (1986). The Newton Handbook. London: Routledge & Kegan Paul.
  4. 4.0 4.1 "Cambridge". Archived from the original on 2008-05-09. Retrieved 2008-06-12.