సాహసమే నా వూపిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహసమే నా వూపిరి
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ నిర్మల
నిర్మాణం ఎస్. రామానంద్
కథ పి. చ్ంద్రశేఖరరెడ్డి
చిత్రానువాదం విజయ నిర్మల
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
సంభాషణలు త్రిపురనేని మహరథి
ఛాయాగ్రహణం లక్ష్మణ్ గోరే
కూర్పు ఆదుర్తి హరనాథ్
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణ మూవీస్
భాష తెలుగు

రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగా హత్య ఆధారంగా 1989 లో వచ్చిన నేర చిత్రం సాహసమే నా ఊపిరి. విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, నరేష్, వాణి విశ్వనాథ్, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన పాత్రల్లో నటించారు. పి.చంద్రశేఖరరెడ్డి కథకు విజయ నిర్మల చిత్రానువాదం రాయగా, త్రిపురనేని మహారథి సంభాషణలు రాశాడు. విద్యాసాగర్ ఈ సంగీతాన్ని ఇచ్చాడు. అదుర్తి హరనాథ్ ఎడిట్ చేసాడు. లక్ష్మణ్ గోర్ ఛాయాగ్రహణంని నిర్వహించాడు.[1]

ఈ చిత్రం 1989 మే 25 న విడుదలైంది. కృష్ణకు, నటుడు-రాజకీయ నాయకుడు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్కూ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం గరిష్ఠ స్థాయికి చేరుకున్న సమయంలో ఇది విడుదలైంది.[2] అప్పటి కొన్ని వార్తాపత్రికలి ఆరోపించినట్లు రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగాను దారుణంగా హత్య చేసిన కేసులో ఎన్టీఆర్ ఎలా పాత్ర పోషించి ఉండవచ్చో ఈ చిత్రం నొక్కి చెప్పింది. అందువల్ల, ఈ చిత్రంపై మిశ్రమ సమీక్షలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం మంచి వసూళ్ళే సాధించింది. ఈ చిత్రం కొన్ని కేంద్రాలలో 50 రోజులు నడిచింది. వాటిలో 4 రాయలసీమకు చెందినవి. ఇది కృష్ణ చిత్రానికి చాలా ఎక్కువ. గుంటూరులో ఇది 100 రోజులు నడిచింది.[3]

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. MovieGQ. "Sahasame Naa Oopiri film info". Retrieved 1 July 2020.
  2. B. Srinivas Narayan Rao (27 June 2019). "A Power house of Talent". Retrieved 1 July 2020.
  3. Amarnath K. Menon (15 October 1986). "Telugu actor Krishna's political satire on NTR rule gets TDP worried". Retrieved 1 July 2020.