సికింద్రాబాద్ క్లాక్ టవర్
క్లాక్ టవర్ | |
అక్షాంశ,రేఖాంశాలు | 17°26′27″N 78°29′55″E / 17.4408°N 78.4985°E |
---|---|
ప్రదేశం | సికింద్రాబాదు, తెలంగాణ |
రూపకర్త | నిజాం |
రకం | విక్టరి కాలమ్ |
ఎత్తు | 120 అడుగులు[1] |
ప్రారంభ తేదీ | 1 ఫిబ్రవరి, 1897 |
అంకితం చేయబడినది | సికింద్రాబాద్ కంటోన్మెంట్ వద్ద ఉన్న బ్రిటీష్ అధికారులకు |
సికింద్రాబాద్ క్లాక్ టవర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలోని సికింద్రాబాదులో ఉన్న టవర్. బ్రిటీష్ కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1860లో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్ 1897, ఫిబ్రవరి 1న ప్రారంభించబడింది.[2]
చరిత్ర
[మార్చు]1806వ సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందంలో భాగంగా హుస్సేన్ సాగర్ అవతల ఏర్పాటుచేయబడిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు సికిందర్ జాహ్ ఉత్తర్వులతో సికింద్రాబాదుగా ఆవిర్బవించింది.[3] హైదరాబాదులోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ వద్ద ఉన్న బ్రిటీష్ అధికారులు సాధించిన పురోగతిని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1860లో 10 ఎకరాల (4.0 హెక్టారులు) భూమిని ఇచ్చింది.[4] 1896లో 2.5 ఎకరాల (1.0 హెక్టార్లు) పార్కులో 120 అడుగుల ఎత్తైన క్లాక్ టవర్ నిర్మించబడింది.[1] సర్ ట్రెవర్ జాన్ చిచెల్ ప్లోడెన్ 1897, ఫిబ్రవరి 1న ప్రారంభించారు. టవర్ మీద ఉన్న గడియారంను వ్యాపారవేత్త దివాన్ బహదూర్ సేఠ్ లక్ష్మీనారాయణ రాంగోపాల్ విరాళంగా ఇచ్చారు.[3]
వారసత్వ నిర్మాణం
[మార్చు]హైదరాబాద్-సికింద్రాబాద్ యొక్క జంట నగరాల్లో ఈ టవర్ వారసత్వ నిర్మాణంగా ప్రకటించబడింది.[4] పౌర సంస్థ చేపట్టిన ప్రయత్నాల ఫలితంగా యునెస్కో ఈ టవర్ కు వారసత్వ కట్టడంగా హోదా ఇచ్చింది.[5]
ఇతర వివరాలు
[మార్చు]- 1969లో మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమములో జరిగిన ఆందోళనలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఒక అమరవీరుని జ్ఞాపకార్థంగా ఒక స్మారక చిహ్నం కూడా ఈ పార్కులో స్థాపించబడింది.[6] కొంతకాలం తరువాత టవర్ యొక్క నాలుగు గడియారములు సాంకేతిక సమస్యలతో పనిచేయడం ఆగిపోయాయి.[4]
- పెరిగిన ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని 2003లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఈ టవర్ ను కూల్చివేయాలని భావించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పౌర సంస్థకు చెందిన సీనియర్ అధికారి ఈ నిర్మాణాన్ని పడగొట్టవద్దని సూచించాడు.[7]
- పార్కులో పచ్చని గడ్డిని పరచి, ఫౌంటెను ఏర్పాటు చేయబడింది. 2005లో పునఃర్నిర్మాణం జరిగిన ఈ పార్కును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2006లో ప్రారంభించాడు.[1][8]
- 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సికింద్రాబాద్ యొక్క 200 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. ఆ ఉత్సవాల లోగోకు ఈ టవర్ ను ఉపయోగించారు.[9]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Clock Tower Park to open, finally". The Hindu. 27 February 2006. Archived from the original on 18 ఏప్రిల్ 2007. Retrieved 13 April 2019.
- ↑ క్లాక్ టవర్లు (సికింద్రాబాద్ క్లాక్ టవర్), ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 61
- ↑ 3.0 3.1 Nanisetti, Serish (3 June 2006). "The man, his mite and Secunderabad". The Hindu. Archived from the original on 29 September 2008. Retrieved 13 April 2019.
- ↑ 4.0 4.1 4.2 "Time stands still at Clock Tower". The Hindu. 13 February 2007. Archived from the original on 19 ఫిబ్రవరి 2007. Retrieved 13 April 2019.
- ↑ Khan, Mir Ayoob Ali (16 March 2007). "Heritage hope alive". The Times of India. Archived from the original on 3 నవంబరు 2012. Retrieved 13 April 2019.
- ↑ "Floral tributes to Telangana martyrs". The Hindu. 5 April 2010. Archived from the original on 9 ఏప్రిల్ 2010. Retrieved 13 April 2019.
- ↑ "Secunderabad clock tower on MCH demolition list". The Times of India. 7 February 2003. Retrieved 13 April 2019.
- ↑ "Renovated Clock Tower Park to be opened today". The Times of India. 26 February 2006. Archived from the original on 3 నవంబరు 2012. Retrieved 13 April 2019.
- ↑ "Towering logo for 'splendid' city". The Hindu. 23 May 2006. Archived from the original on 1 జూలై 2006. Retrieved 13 April 2019.