సినిమా ఒక ఆల్కెమీ
సినిమా ఒక ఆల్కెమీ | |
సినిమా ఒక ఆల్కెమీ పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | వెంకట్ శిద్దారెడ్డి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | సినిమా పరిచయ వ్యాసాలు |
ప్రచురణ: | పర్‌స్పెక్టివ్స్, హైదరాబాదు |
విడుదల: | మే, 2017 |
పేజీలు: | 272 |
సినిమా ఒక ఆల్కెమీ సినిమా పరిచయ వ్యాసాల పుస్తకం. సినీ విశ్లేషకుడు వెంకట్ శిద్దారెడ్డి రాసిన ఈ పుస్తకంలో 30 ప్రపంచ సినిమాల గురించి వ్యాసాలు ఉన్నాయి.[1]
పుస్తకం గురించి
[మార్చు]మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాలను పరిచయం చేసి ఎంతో అందంగా, వివరంగా విడమర్చి చెప్పే గ్రంథం ఇది. ఒక్క ఫ్రేములో ప్రపంచాన్ని చూపించే దర్శకుల నుంచి, ఆ దర్శకుడి సృజనాత్మకతలోని 'కీలక సన్నివేశం’ ని చదవటంతోపాటు సినిమాని ఎలా తీశారో, సినీప్రియులు ఎలా చూడాలో కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. అంతేకాకుండా హై బడ్జెట్ సినిమాలను, యాక్షన్ సినిమాలను, సూపర్ హీరో సినిమాలను మాత్రమే ప్రపంచ సినిమా అనుకునే వారందరికి ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సినిమాలను ఈ పుస్తకం పరిచయం చేస్తుంది.[2]
ఆవిష్కరణ
[మార్చు]ఈ పుస్తకం 2019, మే 20న సినీనటుడు రానా చేతులమీదుగా ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, సతీష్ కాసెట్టి, వెంకటేష్ మహా, కత్తి మహేష్, కుప్పిలి పద్మ పాల్గొన్నారు.[3][4]
సినిమాలు
[మార్చు]- ఫిజ్‌కరాల్డో
- బ్లో-అప్
- మిడ్ నైట్ ఇన్ ప్యారిస్
- ఇన్ ది మూడ్ ఫర్ లవ్
- పోయెట్రీ
- శాంషో దయూ
- బైసికిల్ థీవ్స్
- మై డిన్నర్ విత్ ఆంద్రె
- ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్
- టోక్యో స్టోరి
- ఇకిరు
- సిటిజన్ కేన్
- స్టాకర్
- ఏ సెపరేషన్
- రెవల్యూషనరీ రోడ్
- చిల్డ్రన్ ఆఫ్ హెవెన్
- వైల్డ్ స్ట్రాబెర్రీస్
- షాడోస్ ఆఫ్ ఫర్గాటెన్ యాన్సెస్టర్స్
- గెటింగ్ హోమ్
- గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్
- యాజ్ ఇటీజ్ ఇన్ హెవెన్
- ఏక్ డాక్టర్ కీ మౌత్
- క్రేమర్ వర్సెస్ క్రేమర్
- పూజాఫలము
- షిప్ ఆఫ్ థీసియుస్
- ది లైవ్ ఆఫ్ అదర్స్
- మ్యాన్ ఫ్రం ది ఎర్త్
- వెల్‌కం
- అమెరికన్ హిస్టరీ
- టేస్ట్ ఆఫ్ చెర్రీ
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్యం (పుస్తక సమీక్షలు) (4 July 2017). "సినిమా ఒక ఆల్కెమీ". lit.andhrajyothy.com. చల్లా. Archived from the original on 21 January 2019. Retrieved 8 December 2019.
- ↑ The Hindu, Books - Reviews (28 July 2017). "Cinema Oka Alchemy: Passionate analysis". The Hindu (in Indian English). Srivathsan Nadadhur. Archived from the original on 9 December 2019. Retrieved 9 December 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-సినిమా కబుర్లు (21 May 2017). "సినిమా పుస్తకాన్ని ఆవిష్కరించిన భళ్లాలదేవ". www.andhrajyothy.com. Archived from the original on 8 December 2019. Retrieved 8 December 2019.
- ↑ నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (20 May 2015). "సినిమా ఒక ఆల్కెమి ఆవిష్కరణ". www.ntnews.com. Archived from the original on 8 December 2019. Retrieved 8 December 2019.