సిపాయి చిన్నయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిపాయి చిన్నయ్య
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.వి.ఆర్.శేషగిరిరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
భారతి,
కె.ఆర్.విజయ
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్
భాష తెలుగు

అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంతో సురేష్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన సిపాయి చిన్నయ్య సినిమా 1969 అక్టోబర్ 30న విడుదలైంది[1].

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

కథ[మార్చు]

ఓ గ్రామానికి చెందిన జమీందారీ కుటుంబంలో జన్మించిన భాస్కర్ నౌకాదళాధిపతిగా విధి నిర్వహిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన చిన్నయ్య సిపాయిగా నౌకాదళంలో పని చేస్తుంటాడు. వారిరువురూ ఒకే రూపురేఖలు కలిగివుంటారు. భాస్కర్ తల్లి సుభద్రమ్మ పేద సాదలపట్ల దయగల వ్యక్తి. భాస్కర్ తమ్ముడు శేఖర్ పేదవాళ్లకు వడ్డీలకు డబ్బులిచ్చి, బాకీ తీర్చనివారిని బాధిస్తుంటాడు. భాస్కర్, చిన్నయ్య సెలవులకు తమ గ్రామానికి వస్తారు. భాస్కర్‌కు సోదరుడి వరుస కోదండం. భాస్కర్‌ని అంతంచేసి ఆస్తిని పొందాలని చూస్తుంటాడు. భాస్కర్ అత్తకూతురు శోభ. ఒకరినొకరు ఇష్టపడతారు. చిన్నయ్య, భార్య కన్నమ్మ అన్యోన్యమైన జంట. భాస్కర్ పుట్టిన రోజున సొరచేప కానుకగా తెచ్చిన చిన్నయ్య, శేఖర్ కారణంగా భాస్కర్ చేత చెంపదెబ్బ తింటాడు. అలిగి వెళ్లిన చిన్నయ్య కోసం వెళ్లిన భాస్కర్ కొంత డబ్బు, స్వీట్స్ సంచిలో పెట్టి ఇస్తాడు. సముద్రం మీద షికారు వెళదామని భాస్కర్ కోరడంతో, ఇంటికెళ్లి వస్తానని చెప్పి తిరిగి వచ్చిన చిన్నయ్యకు భాస్కర్ కనిపించడు. గంగన్న, అమావాస్య అతన్ని కొట్టి సముద్రంలో పడేస్తారు. భాస్కర్‌కోసం వెతికి చిన్నయ్య ఒక్కడే తిరిగొస్తాడు. భాస్కర్ మరణించాడని తెలిస్తే సుబద్రమ్మ తట్టుకోలేదని, అందుకు భాస్కర్ స్థానంలోకి రమ్మని చిన్నయ్యను శేఖర్ కోరటంతో.. తప్పక ఆ బాధ్యత నిర్వహిస్తాడు చిన్నయ్య. ఈక్రమంలో కన్నమ్మకు పల్లీయుడు గంగయ్యతో మనువు నిశ్చయించబడుతుంది. సముద్రంలోకి నెట్టబడిన భాస్కర్ బ్రతికి మరో ఊరి పల్లీయుల సాయంతో కోదండం ఇంటికి చేరతాడు. అక్కడ కోదండం దుర్బుద్ధి తెలుసుకున్న భాస్కర్, శోభతోసహా తన ఊరు బయలుదేరగ.. దారిలో కోదండం సిద్ధంచేసిన కారు బాంబునుంచి తప్పించుకొని చిన్నయ్య వద్దకు బయలుదేరతాడు. అక్కడ అతన్ని అంతం చేయాలనుకున్న గంగన్న, మిగిలిన రౌడీలతో పోరాడి చివరకు అందరూ కలవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు దేవులపల్లి, ఆరుద్ర, దాశరథి, ఆత్రేయలు సాహిత్యాన్ని అందించగా ఎం.ఎస్.విశ్వనాథన్ బాణీలు కూర్చాడు. ఘంటసాల, సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి ఈ పాటనలను ఆలపించారు[1].

  1. ఓహో...ఆ నావ దాటిపోయిందీ ఆ ఒడ్డే చేరిపోయిందీ - ఘంటసాల, పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  2. నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము - ఘంటసాల - రచన: ఆరుద్ర
  3. అమ్మాయి ముద్దు తప్పా - ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర
  4. నారాజు నవ్వులు పలికించి - పి.సుశీల - రచన: ఆరుద్ర
  5. తాజాగా ఉంది లేత రోజా - పి.సుశీల బృందం - రచన: దాశరథి
  6. పడవా వచ్చిందే పిల్లా.. పండగ వచ్చిందే - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (26 October 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 సిపాయి చిన్నయ్య". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 23 June 2020.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

బయటిలింకులు[మార్చు]