సి హెచ్ రమణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1966 పెద్దపల్లి జిల్లా శివ పల్లి గ్రామంలో జన్మించిన చింతకుంట విజయ రమణారావు తెలుగుదేశం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

పార్టీలో నిబద్ధతగల కార్యకర్తగా పనిచేస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో పార్టీ పదవులను అధిరోహించి తనదైన ముద్రవేశారు విజయ రమణారావు.

2009లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా బరిలో దిగి సమీప కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుంద రెడ్డి పైన విజయం సాధించి మొట్టమొదటిసారిగా శాసనసభలో అడుగు పెట్టారు.

ఆ తర్వాత 2010 నుంచి 2016 వరకు కరీంనగర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ..2016-17 పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2014 తొలి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు రమణారావు.

ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు.

2018 లో జరిగిన తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికలు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి దాసరి మోహన్ రెడ్డి పైన ఓటమిపాలయ్యారు

2023 తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి శాసనసభ్యులు నియోజకవర్గం నుంచి పోటీలో ముందున్నారు చింతకుంట విజయ్ రమణారావు.[1]

మూలాలు[మార్చు]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.