Jump to content

సుకన్య (నటి)

వికీపీడియా నుండి

పురాణాలలో చెప్పబడిన చ్యవన మహర్షి భార్య గురించిన వ్యాసం కొరకు సుకన్య చూడండి.

సుకన్య
నటి సుకన్య చిత్రము
జననం
సుకన్య

(1969-07-08) 1969 జూలై 8 (వయసు 55)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటి,
సంగీత దర్శకురాలు,
రచయిత ,
భరతనాట్యం కళాకారిణి
క్రియాశీల సంవత్సరాలు1991– ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిశ్రీధరన్ రాజగోపాలన్
(2002-2003) (విడాకులు)
పురస్కారాలుతమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి పురస్కారము

సుకన్య (జ. జూలై 8, 1969) దక్షిణ భారత సినిమా నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలలో 80కి పైగా సినిమాలలో నటించింది. ఈమె నర్తకి, సంగీతకారిణి కూడా.

నేపధ్యము

[మార్చు]

సుకన్య తమిళ సినిమా నిర్మాత రమేష్ కూతురు.[1] ఈమె భారతీరాజా దర్శకత్వము వహించిన తమిళ చిత్రం పుదు నెల్లు పుదు నాథు సినిమా రంగప్రవేశము చేసింది. తమిళ సినీ రంగములో అగ్రశేణి నటులైన కమల్ హాసన్, సత్యరాజ్, విజయకాంత్ ల సరసన నటించింది.

సుకన్య కళాక్షేత్రలో స్కాలర్‌షిప్పుతో నాట్యం అభ్యసించి, ఆ తరువాత ప్రముఖ నర్తకి చంద్రలేఖ నాట్యబృందముతో పాటు అనేక నృత్యోత్సవాల్లో పాల్గొన్నది. 1987 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనటానికి రష్యా వెళ్లిన బృందములో అతి పిన్న వయస్కురాలు సుకన్య. ఈమె రష్యాలో క్రెమ్లిన్ స్క్వేర్లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మిఖాయిల్ గోర్బచేవ్ ల ముందు నాట్య ప్రదర్శన ఇచ్చింది.[2]

వ్యక్తిగత జీవితము

[మార్చు]

2002 మార్చి 18 న అమెరికాకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన శ్రీధర్ ని పెళ్ళి చేసుకొని అమెరికాలో స్థిరపడింది.[3] అయితే సంవత్సరం తిరిగేలోపే ఈ పెళ్ళి అభిప్రాయ భేదాలవల్ల విడాకులకు దారితీసింది[4][5].

పునరాగమనము

[మార్చు]

భారతదేశం తిరిగి వచ్చిన సుకన్య అనేక నాట్యప్రదర్శనలు ఇచ్చింది. జయా టీవీలో శాస్త్రీయ నృత్యం ఆధారితమైన తకదిమిథ గేమ్‌షోకు యాంకరుగా పనిచేసింది,[6] కొన్ని సీరియల్లలో నటించింది. ఇటీవల తను స్వయంగా సంగీతము సమకూర్చి, గీతరచన చేసిన ప్రైవేటు ఆల్బం అయగు విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. అయగులో పాటలను ప్రముఖ సినీ గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, జానకి, శ్రీనివాస్, నిత్యశ్రీలు పాడారు. తనకు సంగీతములో గురువెవ్వరూ లేరని. స్వతహాగా నేర్చుకున్నానని. అవకాశమొస్తే సినిమాలకు కూడా సంగీతం కూర్చడానికి సిద్ధమేనని చెప్పింది[2].

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
2015 శ్రీమంతుడు (2015 సినిమా)
2012 అధినాయకుడు
1996 నేటి సావిత్రి
1994 కెప్టెన్
1993 అమ్మకొడుకు
1992 పెద్దరికం

తమిళము

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
1991 పుదు నెల్లు పుదు నాథు తొలి చిత్రము
1991 ఎంజిఆర్ నగరిల్ శోభన
1992 చిన్న గౌండర్ దేవయాని
1992 కొట్టై వాసల్ వాసంతి
1992 తిరుమతి పలనిసామి హంసవేణి
1992 తంబి పొందాట్టి సుమతి
1992 సెంతమిఝ్ పాట్టు దుర్గ
1992 ఇలవరసన్ పూంగోతై
1992 సొలైయమ్మ సొలైయమ్మ
1993 చిన్న మాప్పిల్లై జానకి
1993 వాల్టేర్ వెట్ట్రివేల్ సుమతి
1993 ఉదన్ పిరప్పు భవాని
1993 ఆదిత్యన్ రసతి
1993 సక్కరై దేవన్ సరసు
1993 కరుప్పు వెల్లై స్వర్ణ
1993 థల్లట్టు రేవతి
1993 చిన్న జమీన్
1994 కెప్టెన్ ఉమ
1994 సీమన్ బక్కియం
1994 హీరో సీత
1994 వండిచోలై చినరసు పార్వతి
1994 మహానది యమున
1994 రాజా పాండి భువన
1995 మిస్టర్ మద్రాస్ మీరా
1996 మహాప్రభు మహాలక్ష్మి
1996 భారతీయుడు అమృతవల్లి
1996 పుతియ పరాశక్తి పరాశక్తి
1996 పరివాట్టం
1996 సేనాపతి మీనాక్షి
1996 జ్నానపఝమ్ ఆర్తి
1997 ఆహా గీతా
1997 గోపురదీపం మీనా
1997 తంబిదురై
2000 గుడ్‌లక్ దేవి
2000 ఉన్నై కోడు ఎన్నై తరువీన్ సూర్య తల్లి
2001 క్రిష్ణ క్రిష్ణ బామ
2002 శ్రీ బన్నారి అమ్మణ్ అతిథి పాత్ర
2004 అది తాడి
2006 సిల్లును ఒరు కాదల్ నిర్మల
2007 తొట్టల్ పూ మరలుమ్ పెరియ నాయగి
2008 ఆయుతం సెవివోమ్ లీలావతి
2008 ఎల్లం అవన్ సెయల్
2009 అజఘర్ మలై అతిథి పాత్ర
2014 చంద్ర రాణి సరళాదేవి
2014 ఎన్నమో నదక్కుధు గాయత్రి

మలయాళం

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
1992 అపారథ సూర్య
1994 సాగరం సాక్షి నిర్మల
1996 తూవల్ కొట్టరమ్ సుజాత
1996 కానాక్కినావు
1997 చంద్రలేఖ చంద్ర
1998 రక్తసాక్షికల్ సిందాబాద్ శివకామి అమ్మాళ్
1998 మంజుకలవుం కఝింఝు శోభ
1998 అమ్మ అమ్మాయియమ్మ ప్రభావతి
1999 స్వస్తం గృహాభరిణం అశ్వతి
1999 ప్రేం పూజారి నిజ జీవిత పాత్ర అతిధిపాత్ర
2000 వినయపూర్వ విద్యాధరణ్ శాలిని
2004 కన్నియుం కనదిక్కుమ్ నిజ జీవిత పాత్ర అతిధిపాత్ర
2005 ఉదయోన్ సుసియోమాల్
2006 నోట్‌బుక్ శ్రీదేవి తల్లి
2008 ఇన్నతె చింత విషయం త్రీస
2012 లాస్ట్ బెంచ్ రోసిలి
2013 మాణిక్య తంబురత్తియుం క్రిస్మస్ సరోలియం సవతి తల్లి
2014 మై లైఫ్ పార్టనర్ డాక్టర్ లీలా అయ్యర్
2014 ఆమయుం ముయలుమ్ బంధారవతి

కన్నడ

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
1992 గురుబ్రహ్మ ఉమ, సుమ (ద్విపాత్రాభినయము)
2013 చంద్ర రాణీ సరళాదేవి

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-28. Retrieved 2007-03-12.
  2. 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-05-08. Retrieved 2007-03-12.
  3. "యాహూ ఇండియాలో సుకన్య పెళ్ళి వార్త". Archived from the original on 2007-06-08. Retrieved 2007-03-12.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-03-10. Retrieved 2007-03-12.
  5. http://in.news.yahoo.com/041102/54/2hn9g.html[permanent dead link]
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-20. Retrieved 2007-03-12.

బయటి లింకులు

[మార్చు]