సుఖ్ రామ్
పండిట్ సుఖ్ రామ్ | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1989 – 1998 | |||
ముందు | మహేశ్వర్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | మహేశ్వర్ సింగ్ | ||
నియోజకవర్గం | మండి | ||
పదవీ కాలం 1984 – 1989 | |||
ముందు | వీరభద్ర సింగ్ | ||
తరువాత | మహేశ్వర్ సింగ్ | ||
నియోజకవర్గం | మండి లోక్‌సభ | ||
కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ (స్వతంత్ర హోదా) శాఖ
| |||
పదవీ కాలం 1993 – 1996 | |||
ప్రధాన మంత్రి | పి.వి. నరసింహారావు | ||
ముందు | రాజేష్ పైలట్ | ||
తరువాత | అటల్ బిహారీ వాజపేయి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కొట్లీ, | 1927 జూలై 27||
మరణం | 2022 మే 11 న్యూఢిల్లీ, | (వయసు 94)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు |
| ||
సంతానం | అనిల్ శ్మ (కొడుకు) | ||
నివాసం | మండి లోక్‌సభ | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ లా స్కూల్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
పండిట్ సుఖ్ రామ్ (1927 జూలై 27 -2022 మే11) [1] భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఐదు సార్లు, లోక్‌సభకు 3 సార్లు ఎన్నికై రక్షణ ఉత్పత్తి, సరఫరాలు, ప్రణాళిక, ఆహారం & పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రిగా, పీవీ నరసింహ రావు మంత్రివర్గంలో 1993 నుండి 1996 వరకు కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ (స్వతంత్ర హోదా) శాఖ మంత్రిగా పనిచేశాడు. రాజకీయ నాయకుడు అనిల్ శర్మ తండ్రి, నటుడు ఆయుష్ శర్మ తాత. 2011లో అతను 1996లో కమ్యూనికేషన్స్ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినందుకు 5 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.[2]
జననం, విద్య
[మార్చు]సుఖ్‌రామ్ శర్మ 1927 జూలై 27న [3] హిమాచల్ ప్రదేశ్‌లోని కోట్లిలో 10 మంది పిల్లలతో కూడిన పేద కుటుంబంలో జన్మించాడు.[4] ఢిల్లీ లా స్కూల్‌లో చదివాడు. 1953లో మండి జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. 1962లో హిమాచల్ ప్రదేశ్‌లోని టెరిటోరియల్ కౌన్సిల్‌లో సభ్యుడు అయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]1963 నుండి 1984 వరకు మండి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించాడు. 1984లో లోక్‌సభకు ఎన్నికై రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశాడు. రక్షణ ఉత్పత్తి, సరఫరాలు, ప్రణాళిక, ఆహారం, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. 1993 నుండి 1996 వరకు కమ్యూనికేషన్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత) గా బాధ్యతలు నిర్వర్తించాడు.[5]
మండి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, అతని కుమారుడు 1993లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందాడు. రామ్ 1996లో మండి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందాడు, అయితే టెలికాం స్కామ్ తర్వాత వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించబడ్డారు. తరువాత హిమాచల్ వికాస్ కాంగ్రెస్ ను స్థాపించారు.[6] బిజెపితో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుని ప్రభుత్వంలో చేరారు.
రామ్ 1998లో అసెంబ్లీ ఎన్నికలలో మండి సదర్ నుండి పోటీ చేసి 22000+ ఓట్ల భారీ తేడాతో గెలుపొందాడు; అది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ. అతని కుమారుడు అనిల్ శర్మ 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. 2003 అసెంబ్లీ ఎన్నికలలో, రామ్ మండి అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు కానీ 2004 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరాడు. 2007, 2012లో కాంగ్రెస్ అభ్యర్థిగా మండి అసెంబ్లీ స్థానం నుండి గెలుపొందాడు. 2017లో ఎన్నికలకు ముందు రామ్, తన మనవడు ఆశ్రయ్ శర్మతో కలిసి బీజేపీలో చేరాడు.
బీజేపీ హయాంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శర్మ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు.[7] నటుడైన ఇతని మరో మనవడు ఆయుష్ శర్మ, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరిని వివాహం చేసుకున్నాడు.[8]
2017లో[9] భారతీయ జనతా పార్టీలోకి చేరి 2019లో భారత జాతీయ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చారు.[10][11][12][13]
మరణం
[మార్చు]సుఖ్ రామ్ అనారోగ్యంతో బాధపడుతూ 2022 మే 7న ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరి చికిత్య పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మే 11న మరణించాడు.[14]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (12 May 2022). "Sukh Ram (1927-2022): The man who rang in telecom revolution, could never wash off scam taint" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
- ↑ "1996 telecom scam: Sukhram gets 5 years in jail". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). 19 November 2011. Retrieved 2 February 2022.
- ↑ "Sukhram: A wily politician turned Kingmaker". Hindustan Times (in ఇంగ్లీష్). 13 February 2003. Retrieved 16 April 2018.
- ↑ "The Man From Mandi". Outlook India. 4 September 1996. Retrieved 16 April 2018.
- ↑ "About Us | Former Ministers | Department of Telecommunications". 2 October 2013. Archived from the original on 2 October 2013. Retrieved 7 April 2019.
- ↑ "दो दशक में पंडित सुखराम ने चार बार बदला पाला, 1998 में बनाई थी हिविकां". Amar Ujala (in హిందీ). Retrieved 21 September 2021.
- ↑ "Congress leader Sukh Ram's son resigns from Himachal's BJP govt". The Economic Times. Retrieved 21 September 2021.
- ↑ "Salman's sister all set to tie knot with Himachal leader Sukh Ram's grandson". Hindustan Times (in ఇంగ్లీష్). 2 November 2014. Retrieved 21 September 2021.
- ↑ Bodhi, Anand (15 October 2017). "Sukh Ram and sons cross over to BJP - Times of India". The Times of India. Retrieved 16 April 2018.
- ↑ "Back in HP Congress, Sukhram Buries Decades-long Feud with Virbhadra Singh, Cements Ties with Hug". News18. 29 March 2019. Retrieved 7 April 2019.
- ↑ "Former Union Minister Sukh Ram, grandson Aashray Sharma join Congress". The Hindu (in Indian English). PTI. 25 March 2019. ISSN 0971-751X. Retrieved 7 April 2019.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ IANS (7 April 2019). "Party hoppers before Lok Sabha polls". Business Standard India. Retrieved 7 April 2019.
- ↑ "Lok Sabha Elections 2019: Grandson in tow, Sukh Ram returns to Congress". Hindustan Times (in ఇంగ్లీష్). 26 March 2019. Retrieved 21 September 2021.
- ↑ The Indian Express (11 May 2022). "Former Union minister Pandit Sukh Ram passes away at 94" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.