సుజోయ్ ఘోష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుజోయ్ ఘోష్
సుజోయ్ ఘోష్ (2012)
జననం (1966-05-21) 1966 మే 21 (వయసు 58)
వృత్తిదర్శకుడు, నటుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం

సుజోయ్ ఘోష్ పశ్చిమ బెంగాల్ కు చెందిన హిందీ సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.[1][2] ఝంకార్ బీట్స్ (2003), హోమ్ డెలివరీ: ఆప్కో ఘర్ తక్ (2005), అలాడిన్ (2009), కహానీ (2012), కహానీ 2 (2016),[3][4] బద్లా (2019) వంటి సినిమాకు దర్శకత్వం వహించాడు. అనుకుల్ (2017), అహల్య (2015) వంటి లఘుచిత్రాలకు రచన, దర్శకత్వం వహించాడు.[5] నెట్‌ఫ్లిక్స్ కోసం టైప్‌రైటర్ (2019) పేరుతో ఒక సిరీస్‌కి దర్శకత్వం వహించాడు.[6]

తొలి జీవితం

[మార్చు]

సుజోయ్ ఘోష్ 1966, మే 21న పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో జన్మించాడు. సెయింట్ జేమ్స్ స్కూల్లో చదివాడు..13 సంవత్సరాల వయస్సులో లండన్‌కు వెళ్ళాడు. క్వీన్ ఎలిజబెత్ సిక్స్త్ ఫారమ్ కాలేజీలో చేరి ఎ లెవెల్స్ పూర్తిచేశాడు. మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్, ఎంబిఏ డిగ్రీని పొందాడు.[7] 1999 ముందు రాయిటర్స్ మీడియా విభాగానికి[7] అధిపతిగా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సైకాలజిస్ట్ వైశాలితో సుజోయ్ వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు దియా (సినిమా దర్శకురాలు), అగ్ని (మాజీ ప్రొఫెషనల్ రగ్బీ ప్లేయర్, ఇప్పుడు ఫైడాన్ ఇంటర్నేషనల్ కోసం పనిచేస్తున్నాడు).

సినిమారంగం

[మార్చు]

ఘోష్ 2003లో చిన్న-బడ్జెట్ ఝంకార్ బీట్స్‌సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. ఆర్.డి. బర్మన్‌కు నివాళిగా నిలిచిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరవాత హోమ్ డెలివరీ, అలాదిన్ సినిమాలు తీశాడు. 2012లో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో వచ్చిన కహానీ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని, విమర్శకుల ప్రశంసలను పొందింది.[8][9] 2016లో కహానీ 2 సినిమా తీశాడు, ఇది కహానీకి సీక్వెల్.

2012 డిసెంబరులో రితుపర్ణో ఘోష్ దర్శకత్వం వహించిన సినిమాలో బెంగాలీ దొంగ బ్యోమకేష్ బక్షి పాత్రను పోషించడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు.[10] ఐపిఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ కోసం "కోర్బో లోర్బో జీత్బో రే" అనే ట్యాగ్‌లైన్‌ను వ్రాసాడు. అనుకుల్ (2017), అహల్య (2015) వంటి లఘుచిత్రాలకు రచించి, నిర్మించి, దర్శకత్వం వహించాడు.[11]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు నిర్మాత స్క్రీన్ రైటర్ నటుడు ఇతర వివరాలు
2003 ఝంకార్ బీట్స్ Yes Yes
2005 హోమ్ డెలివరీ: ఆప్కో. . . ఘర్ తక్ Yes Yes
2009 అలాదిన్ Yes Yes Yes
2012 నోబెల్ చోర్ Yes అతిధి పాత్ర
2012 కహానీ Yes Yes Yes ఉత్తమ స్క్రీన్ ప్లేకి జాతీయ చలనచిత్ర అవార్డు[12]ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
2013 అనామిక Yes తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం
కహానీకి రీమేక్
2013 సత్యాన్వేషి Yes బ్యోమకేష్ బక్షిగా
(నటుడిగా అరంగేట్రం)[13]
2014 బ్యాంగ్ బ్యాంగ్! Yes
2015 అహల్య Yes Yes Yes షార్ట్ ఫిల్మ్
2016 తీన్ Yes
2016 కహానీ 2: దుర్గా రాణి సింగ్ Yes Yes Yes
2017 అనుకుల్ Yes Yes Yes షార్ట్ ఫిల్మ్
2019 బద్లా Yes Yes Yes
2019 టైప్‌రైటర్ Yes Yes Yes వెబ్ సిరీస్
2021 బాబ్ బిస్వాస్ Yes Yes
2023 లస్ట్ స్టోరీస్ 2 Yes Yes ఆంథాలజీ సినిమా
2023 అంధుడు Yes [14]
TBA ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ Yes Yes Yes

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డులు విభాగం సినిమా
2012 బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు అత్యంత వినోదాత్మక థ్రిల్లర్ చిత్రం కహానీ
2013 60వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ స్క్రీన్ ప్లే
58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ దర్శకుడు
కలర్స్ స్క్రీన్ అవార్డులు ఉత్తమ కథ
స్టార్ గిల్డ్ అవార్డులు ఉత్తమ దర్శకుడు
ఉత్తమ స్క్రీన్ ప్లే
టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ కథ
ఉత్తమ స్క్రీన్ ప్లే
స్టార్‌డస్ట్ అవార్డులు హాటెస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్
జీ సినీ అవార్డులు ఉత్తమ చిత్రం - విమర్శకులు
ఉత్తమ దర్శకుడు - విమర్శకులు
ఉత్తమ కథ
ఈటిసి బాలీవుడ్ బిజినెస్ అవార్డ్స్ సంవత్సరంలో అత్యంత ఆశ్చర్యకరమైన హిట్‌లు

మూలాలు

[మార్చు]
  1. "When Sujoy Ghosh saved Vidya Balan's life..." CNN-IBN. 2 March 2012. Archived from the original on 3 March 2012. Retrieved 2023-07-25.
  2. "Sujoy Ghosh - IMDb". IMDb.
  3. Priyanka Srivastav (13 March 2012). "Vidya's spunk and a Khahaafni". The Times of India. Retrieved 2023-07-25.
  4. "Finally Sujoy Ghosh's Kahani to go on floor". Mid-day. 8 September 2010. Retrieved 2023-07-25.
  5. "Making a short film is a huge challenge, says Sujoy Ghosh". Zee News. 2 November 2018.
  6. "Series by 'Kahaani' director Sujoy Ghosh, eight films including 'Hotel Mumbai' soon on Netflix". Scroll.in. 9 November 2018.
  7. 7.0 7.1 "Sujoy Ghosh interview". The Times of India. 11 March 2012. Archived from the original on 24 December 2013. Retrieved 2023-07-25.
  8. "This is a dress rehearsal for me". Hindustan Times. Archived from the original on 19 June 2012. Retrieved 2023-07-25.
  9. "Kahaani collects around Rs 14 crores". The Times of India. Archived from the original on 28 September 2013. Retrieved 2023-07-25.
  10. "Kahaani director Sujoy Ghosh to play Byomkesh Bakshi in Rituparno Ghosh's next". CNN-IBN. 13 December 2012. Archived from the original on 15 December 2012. Retrieved 2023-07-25.
  11. "Sujoy Ghosh is back with Anukul, an adaptation of Satyajit Ray's story". India TV. 7 October 2017. Retrieved 2023-07-25.
  12. "60th National Film Awards: The list of winners – IBN Live". CNN-IBN. 18 March 2013. Archived from the original on 20 March 2013. Retrieved 2023-07-25.
  13. ians. "Rituparno Ghosh's cinematographer, not Sujoy Ghosh to complete Satyanweshi". hindustantimess. Archived from the original on 27 June 2013. Retrieved 2023-07-25.
  14. "Sonam Kapoor Ahujas Blind starts filming". Outlook India. 28 December 2020. Retrieved 2023-07-25.

బయటి లింకులు

[మార్చు]