సుమిత్ కుమార్ సింగ్
సుమిత్ కుమార్ సింగ్ | |||
ఎమ్మెల్యే
| |||
ముందు | సావిత్రి దేవి యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | చకై | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 01/02/1984 జముయ్ | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
నివాసం | నిచాలి పకారి, అంచల్ ఖైరా జిల్లా, జముయ్, బీహార్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సుమిత్ కుమార్ సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చకై నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]
కుటుంబ నేపథ్యం
[మార్చు]సుమిత్ కుమార్ సింగ్ తండ్రి నరేంద్ర సింగ్ బీహార్‌లో 2015 వరకు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు. ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో మెరుగైన పని చేసినందుకు 2012లో రాష్ట్రపతి గౌరవాన్ని అందుకున్నాడు. నరేంద్ర సింగ్ 2005లో రామ్‌విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జన శక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.
సుమిత్ కుమార్ సింగ్ తాత శ్రీకృష్ణ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు & బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సుమిత్ కుమార్ సింగ్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చి 2010లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ తరపున చకై నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2015లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఓడిపోయి 2020లో అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సుమిత్ కుమార్ సింగ్ ఆగష్టు 16, 2022న నితీష్ కుమార్ మంత్రివర్గంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.