సురయ్యా త్యాబ్జీ
సురయ్యా త్యాబ్జీ | |
---|---|
జననం | సురయ్యా 1919 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత జాతీయపతాకం రూపకర్త |
జీవిత భాగస్వామి | బద్రుద్దీన్ త్యాబ్జీ |
సురయ్యా త్యాబ్జీ, తెలంగాణకు చెందిన చిత్రకారిణి. పింగళి వెంకయ్య రూపొందించిన ప్రాథమిక భారత జాతీయపతాకంలోని[1] తెలుపు రంగులో చరఖా స్థానంలో సురయ్యా త్యాబ్జీ సారనాథ్ స్థూపంలోని ధర్మచక్రాన్ని చేర్చి జెండాకు తుది రూపునిచ్చింది.[2][3] ఆ కొత్త పతాకాన్ని స్వతంత్ర భారత జాతీయపతాకంగా ఉద్వేగభరిత వాతావరణంలో 1947 ఆగష్టు 15 నాడు ఆవిష్కరించారు.
జీవిత విశేషాలు
[మార్చు]సురయ్యా త్యాబ్జీ 1919లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించింది. సురయ్యా త్యాబ్జీ వంశానికి చెందినది, వారి పూర్వీకులు భోమియాకు చెందినవారు.[4] ఆమె 1937-1941 వరకు హైదరాబాద్‌లో ప్రధాన మంత్రిగా పనిచేసిన సర్ అక్బర్ హైదరీకి మేనకోడలు, హైదరాబాద్‌లో ముస్లిం మహిళల విద్య కోసం పోరాడిన లేడీ అమీనా హైదరీ మనవరాలు.[5] సురయ్యా రాజ్యాంగ పరిషత్‌లోని వివిధ కమిటీలలో సభ్యురాలిగా కూడా పనిచేసింది.[6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]భారతీయ సివిల్ సర్వెంట్ గా, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన బద్రుద్దీన్ త్యాబ్జీతో సురయ్యా వివాహం జరిగింది.[7] వారికి ఒక కుమార్తె (లైలా త్యాబ్జీ) ఉంది.
జాతీయ జెండా రూపకల్పన
[మార్చు]ట్రెవర్ రాయిల్ అనే ఆంగ్ల చరిత్రకారుడు రాసిన ది లాస్ట్ డేస్ ఆఫ్ ది రాజ్ అనే పుస్తకంలో 1947 జూలై 17న జాతీయ జెండా ఎలా ఉనికిలోకి వచ్చిందో వ్రాశాడు. “జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ చిహ్నం కోసం డిజైన్‌ను రూపొందించే బాధ్యతను ముస్లిం అయిన బద్-ఉద్-దిన్ త్యాబ్జీ కేటాయించాడు.[8][9] చిహ్నాన్ని రూపొందించిన తర్వాత, జెండా కోసం కొత్త డిజైన్‌ను రూపొందించే బాధ్యతను మళ్లీ త్యాబ్జీలకు అప్పగించాడు. వాస్తవానికి త్రివర్ణ పతాకంలో గాంధీజీ ఉపయోగించిన చక్రాల గుర్తు (చరఖా) ఉండాలి, అయితే ఇది పార్టీ చిహ్నం, ఇది తప్పుగా పరిగణించబడుఉందని త్యాబ్జీ భావించాడు. అశోక చక్రవర్తి హిందువులు, ముస్లింలచే గౌరవించబడినందున, గాంధీ చక్రానికి అంగీకరించాడు. ఆ రాత్రి నెహ్రూ కారుపై ఎగిరిన జెండాను ప్రత్యేకంగా త్యాబ్జీ భార్య తయారు చేసింది" అని ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.[10]
ట్రెవర్ రాయల్ ప్రకారం, జెండా తుది రూపకల్పన ఆలోచనను బద్రుద్దీన్ త్యాబ్జీ రూపొందించాడు. అయితే, హైదరాబాద్‌కు చెందిన చరిత్రకారుడు కెప్టెన్ ఎల్ పాండురంగారెడ్డి తన పరిశోధన ద్వారా తుది త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది ఆమె భర్త కాదని, సూరయ్య త్యాబ్జీ అని వాదించాడు.
సురయ్యా త్యాబ్జీ జాతీయ జెండాలోని తెలుపు రంగులో చరఖాకు బదులుగా అశోక ధర్మచక్రం ఉంచి జెండాకు తుది రూపునివ్వగా, 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ ఆ జెండాను ఆమోదించింది. సురయ్యా త్యాబ్జీ మొదటి జెండా కుట్టుపనిని పర్యవేక్షించడమేకాకుండా, మొదటి జెండాను రాత్రి జవహర్‌లాల్ నెహ్రూకు సమర్పించింది. 1947 ఆగస్టు 15న జవహర్ లాల్ నెహ్రూ కారుమీద స్వేచ్ఛా భారత జాతీయ జెండా రెపరెపలాడింది.[11]
మరణం
[మార్చు]సురయ్యా త్యాబ్జీ 1978లో ముంబైలో మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ Tyabji, Laila. "Growing Up in a Muslim Family That Didn't Fit Any Stereotypes". The Wire. Retrieved 2022-08-15.
- ↑ telugu, NT News (2022-08-15). "త్రివర్ణ పతాక కథ." Namasthe Telangana. Archived from the original on 2022-08-15. Retrieved 2022-08-15.
- ↑ Dawar, Nikhil; Kundu, Chayan (14 September 2018). "Fact Check: Did a Muslim woman design Indian National Flag?". India Today.
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ Tyabji, Laila. "Growing Up in a Muslim Family That Didn't Fit Any Stereotypes". The Wire. Retrieved 2022-08-15.
- ↑ Saurav, Suman (9 December 2018). "Surayya Tyabji: The Woman Who Designed India's National Flag'". Feminism in India. Retrieved 2022-08-15.
- ↑ Saxena, Akanksha (3 April 2022). "Overlooked Personalities: How Surayya Tyabji Finalised The Design Of Indian National Flag". The Logical Indian. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-15.
- ↑ Tyabji, Laila (14 August 2018). "How the Tricolour and Lion Emblem Really Came to Be". The Wire.
- ↑ "Who designed the National Flag: Nehru's friend or Gandhi's follower?". Firstpost. 9 August 2022.
- ↑ Royle, Trevor (1989). The Last Days of the Raj. p. 172. ISBN 9780718129040.
- ↑ Saurav, Suman (2018-12-09). "Surayya Tyabji: The Woman Who Designed India's National Flag | #IndianWomenInHistory". Feminism In India. Archived from the original on 2022-07-02. Retrieved 2022-08-15.