సువీరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సువీరన్, కోజికోడ్ సినిమా, నాటక దర్శకుడు. ఇతడు రూపొందించిన మొదటి చిత్రం బ్యారీ, 2011లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది.[1] బేరీ భాషలో నిర్మించిన మొదటి సినిమా ఇది.[2]

జీవిత విషయాలు[మార్చు]

సువీరన్, కోజికోడ్ లోని అజియూర్ కు చెందినవాడు. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి తన చివరి సంవత్సరంలో బహిష్కరించబడ్డాడు. దాంతో త్రిచూర్ లోని కాలికట్ విశ్వవిద్యాలయంలోనూ, పాండిచ్చేరిలోని స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో తన కోర్సు పూర్తిచేశాడు.[2] నటుడు, దర్శకుడు, చిత్రకారుడిగా గుర్తింపు పొందిన సువీరన్ దాదాపు ముప్పై నాటకాలు, నాలుగు షార్ట్ ఫిలింలను రూపొందించాడు. అతను కేరళ లోని వివిధ పత్రికలలో వ్యాసాలను రాశాడు. అనేక చిన్న కథలు, ఒక నవల రాశాడు. యెర్మా, ఐలాండ్, క్రైమ్ పాషనల్ అనే నాటకాలను మలయాళంలోకి అనువదించాడు.

మలయాళ నాటక దర్శకుడిగా తన వృత్తిని ప్రారంభించి అగ్ని, ఉదంబడోక్కోలం వంటి నాటకాలతో గుర్తింపు పొందాడు. మూడేళ్ళపాటు కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డులను, ఆయుసింటె పుస్తకం అనే నాటకానికి 2011లో మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డును అందుకున్నాడు.[3]

సినిమాలు[మార్చు]

అవార్డులు, గుర్తింపు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "'Byari' bags National Award for Best Film, 'Dirty' Balan Best Actress". CoastalDigest.com, India. 7 March 2012. Retrieved 28 June 2021.
  2. 2.0 2.1 T Ramavarman (8 March 2012). "Theatre experience fuels Suveeran's film journey". Times of India. Retrieved 28 June 2021.
  3. "Archived copy". Archived from the original on 17 December 2013. Retrieved 28 June 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "SAARC Film Festival Concludes with Pakistan and Sri Lanka Bagging Best Documentary & Best Feature Film Respectively". SAARC Cultural Centre. Retrieved 28 June 2021.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సువీరన్&oldid=3497428" నుండి వెలికితీశారు