సుసర్ల
Appearance
సుసర్ల (ఆంగ్లం: Susarla) ఇంటి పేరు గల వారు ఆంధ్రదేశంలో చాలా ప్రాంతాలలో కనబడతారు. "సుసర్ల' వారు బ్రాహ్మల వర్ణానికి చెందినవారు, వీరిలో తెలగాణ్య, వైదికి శాఖలు గలవారు ఎక్కువ. ప్రముఖ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి ని అందరూ ఎరుగుదురు. "సుసర్ల" ఇంటి పేరు గలిగన వారు విశాఖపట్టణం, విజయనగరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం, హైదరాబాదు జిల్లా లందు కలరు.
చరిత్ర
[మార్చు]"సుసర్ల" వారు క్రిష్ణా జిల్లా వారని పలువురు అన్నదమ్ములు వివిధ ప్రాంతాలలో స్థిరపడగా, ముగ్గురు అన్నదమ్ములు విజయనగరం రాజుల ఆస్థానంలో వైద్యులుగా ఉండేవారని, వారికి అప్పటి రాజు విశాఖపట్నం నగరంలో మూడు అగ్రహారాలు రాసివ్వగా అలా విశాఖలో "సుసర్ల" వారు స్థిరపడ్డారని ఆ ప్రాంతమే ఇప్పటి విశాఖనగరంలో "సుసర్ల వారి కాలనీ"గా పిలవబడుతున్నదని ప్రతీతి.
ప్రసిద్ధులు
[మార్చు]- సుసర్ల గోపాలశాస్త్రి: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు
- సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు.
- సుసర్ల దక్షిణామూర్తి, ప్రముఖ సంగీత దర్శకుడు.
- సుసర్ల రామచంద్రరావు, తెలుగు సినిమా నటుడు.