సూరజ్ భాన్
Jump to navigation
Jump to search
సూరజ్ భాన్ | |||
సూరజ్ భాన్ | |||
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్
| |||
పదవీ కాలం 2004 - 2006 | |||
తరువాత | బూటా సింగ్ | ||
---|---|---|---|
పదవీ కాలం 23 నవంబర్ 2000 – 7 మే 2003 | |||
ముందు | విష్ణు కాంత్ శాస్త్రి | ||
తరువాత | విష్ణు సదాశివ్ కోక్జే | ||
పదవీ కాలం 20 ఏప్రిల్ 1998 – 23 నవంబర్ 2000 | |||
ముందు | మహ్మద్ షఫీ ఖురేషి (తాత్కాలిక) | ||
తరువాత | విష్ణు కాంత్ శాస్త్రి | ||
బీహార్ గవర్నర్
(అదనపు బాధ్యత) | |||
పదవీ కాలం 6 అక్టోబర్ 1999 – 23 నవంబర్ 1999 | |||
ముందు | బి.ఎం. లాల్ (తాత్కాలిక) | ||
తరువాత | వీసీ పాండే | ||
పదవీ కాలం 12 జులై 1996 – 4 డిసెంబర్ 1997 | |||
ముందు | ఎస్. మల్లికార్జునయ్య | ||
తరువాత | పీఎం సయీద్ | ||
కేంద్ర వ్యవసాయ మంత్రి
| |||
పదవీ కాలం 16 మే 1996 – 1 జూన్ 1996 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | జగన్నాథ్ మిశ్రా | ||
తరువాత | హెచ్‌డి దేవెగౌడ | ||
పదవీ కాలం 1967–1970; 1977–1979; 1979–1984; 1996–1997 | |||
హర్యానా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 1989–1990 | |||
రెవెన్యూ మంత్రి (హర్యానా)
| |||
పదవీ కాలం 1987–1989 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | యమునానగర్, బ్రిటిష్ ఇండియా | 1928 అక్టోబరు 1||
మరణం | 2006 ఆగస్టు 6 ఢిల్లీ, భారతదేశం | (వయసు 77)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
సూరజ్ భాన్ (1 అక్టోబర్ 1928 - 6 ఆగస్టు 2006) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అంబాలా లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]- సూరజ్ భాన్ భారతీయ జనసంఘ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు[1]
- ఆయన 4వ (1967–1970), 6వ (1977–1979), 7వ (1979–1984) & 11వ లోక్‌సభ (1996–1997)లో హర్యానాలోని అంబాలా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
- 1987లో హర్యానా శాసనసభకు ఎన్నికై దేవీలాల్ ప్రభుత్వంలో 1987 నుండి 1989 వరకు రెవెన్యూ మంత్రిగా పని చేశాడు.
- దేవి లాల్ బిజెపి పార్టీతో పొత్తును తెంచుకున్న తరువాత ఆయన హర్యానా అసెంబ్లీలో 1989 నుండి 1990 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశాడు.
- ఆయన 1984లో భారతీయ జనతా పార్టీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3]
- ఆయన 1996లో వాజ్‌పేయి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు, ఆ తర్వాత 1996 నుండి 1997 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.
- 1998 లోక్‌సభ ఎన్నికలలో ఓటమి అనంతరం ఉత్తరప్రదేశ్ (1998-2000), హిమాచల్ ప్రదేశ్ (2000-2003), బీహార్ (1999) రాష్ట్రాల గవర్నర్‌గా నియమితులయ్యాడు.[4]
- 2002లో డాక్టర్ సూరజ్ భాన్ కూడా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి భైరోన్ సింగ్ షెకావత్ అభ్యర్థిత్వంపై బిజెపిలో పునరాలోచనలో పడిన తర్వాత భారత ఉపరాష్ట్రపతి పదవికి రేసులో చేరారు.[5]
- ఫిబ్రవరి 2004లో జాతీయ షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.[6]
మరణం
[మార్చు]సూరజ్ భాన్ 78 ఏళ్ల వయసులో గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ 2006 ఆగస్టు 6న గుండెపోటుతో మరణించాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ Subhash Mishra (3 April 2000). "Family Face-Off". India Today. Retrieved 2021-11-01.
- ↑ "Biographical Sketch of Member of XI Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2022-07-01.
- ↑ "List of Ex State Presidents". BJPHaryana.org.
- ↑ Surendra Kishore (1999-11-17). "Bihar Governor sacks underage minister". Indian Express. Retrieved 2007-06-02.
- ↑ Yoginder Gupta (12 July 2002). "Suraj Bhan joins race for VP's post". The Tribune. Retrieved 1 November 2021.
- ↑ "SC/ST Commission Chairman Suraj Bhan dead". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-01.
- ↑ The Times of India (7 August 2006). "BJP leader Suraj Bhan dead". Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.