అక్షాంశ రేఖాంశాలు: 16°04′41″N 80°47′08″E / 16.078011°N 80.785657°E / 16.078011; 80.785657

సూరేపల్లి (భట్టిప్రోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూరేపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
సూరేపల్లి is located in Andhra Pradesh
సూరేపల్లి
సూరేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°04′41″N 80°47′08″E / 16.078011°N 80.785657°E / 16.078011; 80.785657
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం భట్టిప్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,633
 - పురుషుల సంఖ్య 1,286
 - స్త్రీల సంఖ్య 1,347
 - గృహాల సంఖ్య 864
పిన్ కోడ్ . 522256
ఎస్.టి.డి కోడ్ 08648

సూరేపల్లి, బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన భట్టిప్రోలు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రేపల్లె నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 864 ఇళ్లతో, 2633 జనాభాతో 456 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1286, ఆడవారి సంఖ్య 1347. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 638 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 128. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590427[1].పిన్ కోడ్: 522256. ఎస్.టి.డి.కోడ్ = 08648.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి భట్టిప్రోలులో ఉంది. సమీప జూనియర్ కళాశాల భట్టిప్రోలులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వి.పి. & జి.ఎస్..ఎం. ఉన్నత పాఠశాల

[మార్చు]
 1. ఈ పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు సైన్సు ప్రాజెక్టుల ప్రదర్శన, క్రీడలలోనూ రాణించుచున్నారు. వీరు తయారుచేసిన ఒక ప్రాజెక్టు, ఇటీవల రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బహుమతి బహుమతి పొందినది.
 2. ఈ ఉన్నత పాఠశాల 63వ వార్షికోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది.
 3. ఈ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ రావు వెంకటకృష్ణారావు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనారు. ఇటీవల గుంటూరులోని పరీక్షా భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో, ఎం.ఎల్.సి.లు శ్రీ కె.ఎస్.లక్ష్మణరావు, శ్రీ బొడ్డు నాగేశ్వరరావు, జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ శ్రీమతి షేక్ జానీమూన్ ల చేతులమీదుగా వీరికి ఈ పురస్కారాన్ని అందజేసి, అనంతరం సన్మానం చేసారు. వీరు ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించి ఇక్కడే ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేయుచూ, పాఠశాల అభివృద్ధికి గూడా కృషిచేయడం విశేషం.
 4. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయ్తుచున్న శ్రీ సి.హెచ్.బాలసుబ్రహ్మణ్యం, హైదరాబాదుకు చెందిన "ఆల్ ది బెస్ట్ ఎకాడమీ" వారు అందించే "గురుబ్రహ్మ" పురస్కారానికి ఎంపికైనారు. వీరు ఈ పురస్కారాన్ని, 2014,అక్టోబరు-26న హైదరాబాదులో న్యాయమూర్తి శ్రీ బి.చంద్రకుమార్ చేతులమీదుగా అందుకున్నారు.
 5. ఈ పాఠశాలలో చదువుచున్న ముగ్గురు విద్యార్థినులు, క్రీడలలో జిల్లా స్థాయిలో తమ ప్రతిభ ప్రదర్శించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు. బి. బిందుమాధవి, వై. నాగలక్ష్మి అను విద్యార్థినులు వాలీబాల్ లోనూ, బి. రాజ్యలక్షి అను విద్యార్థిని లాంగ్ జంప్ లోనూ, తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు.
 6. ఈ పాఠశాలలో ఉపాధాయులుగా పనిచేయుచున్న శ్రీ పి.నరసింహారావుకు, ఉగాది సందర్భంగా, గుంటూరులోని యునెస్కో క్లబ్ 18వ వార్షికోత్సవం సందర్భంగా, 2015,మార్చి-21వ తేదీ ఉగాది పర్వదినాన, వీరికి "సేవారత్న" పురస్కారం అందజేసినారు. విద్యార్థులకు ఎన్.సి.సి.శిక్షణ, స్వచ్ఛభారత్ కారక్రమాలు చేపట్టినందుకు వీరికి ఈ పురస్కారం, అందజేసినారు.
 7. ఈ పాఠశాల విద్యార్థిని బొర్రా రాజ్యలక్ష్మి, 2015,ఆగస్టు-22,23 తేదీలలో గుంటూరులో నిర్వహించు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు, లాంగ్ జంపులో, బాలికల అండర్-14 విభాగంలో పాల్గొనడానికి ఎంపికైనది.
 8. ఈ పాఠశాల విద్యార్థులు తయారుచేసిన, "వాతావరణంలో మార్పులు, తుపానులు - జీవవైవిధ్యంతో సంరక్షణ " అను ప్రాజెక్టును, ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెసులో ప్రదర్శించగా, ఆ ప్రాజెక్టు జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది.
 9. కొత్తఢిల్లీలోని యునెస్కో క్లబ్ వారు 2015,నవంబరులో జాతీయస్థాయిలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఆ పోటీలలో ఈ పాఠశాలలో చదువుచున్న ఐదుగురు విద్యార్థులు ప్రతిభ చూపినారు. ఈ పాఠశాలలో ఏడవ తరగతి చదువుచున్న పడమటి భార్గవి, జల్లి రత్నకుమార్, ఆరవ తరగతి వదువుచున్న కేసన విజయశ్రీ, యేమినేని అజయ్ బాబు, వేసంగి కార్తీక్ పురస్కారాలు అందుకున్నారు.
 10. ఇటీవల కృష్ణా జిల్లాలోని కేతనకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి నాటికల పోటీలలో, ఈ పాఠశాల విద్యార్థినులు జె.సంధ్య, ఎం.కృష్ణప్రసన్న, ఎం.ప్రత్యూష, డి.వీరస్రవంతి, వై.ఆశాలత ప్రదర్శించిన పయనించే ఓ చిలుకా నాటికకు ప్రథమస్థానం లభించడమేగాక, ఆ నాటిక త్వరలో బెంగుళూరు నగరంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడానికి గూడా ఎంపికైనది. ఇటీవల బోయపాలెం గ్రామములో నిర్వహించిన జిల్లాస్థాయి నాటికల పోటీలలో ఈ విద్యార్థినులు ప్రదర్శించిన ఈ నాటిక ప్రథమస్థానంలో నిలిచింది.
 11. హైదరాబాదు లోని శ్రీ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి/2017లో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలలో, ఈ పాఠశాల విద్యార్థులు ఏడు పతకాలు సాధించారు.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సూరేపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

సూరేపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

సూరేపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 68 హెక్టార్లు
 • బంజరు భూమి: 108 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 279 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 108 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 279 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

సూరేపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 279 హెక్టార్లు

గ్రామ పంచాయతీ

[మార్చు]
 1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఐనంపూడి సింధు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా జి.వి.ప్రసాదు ఎన్నికైనారు.
 2. ఈ గ్రామ పంచాయతీ 100% పన్ను వసూలుచేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇంటిపన్ను రు.1.6 లక్షలు, మరియూ నీటిపన్ను రు. 59 వేలూ, మొత్తం వసూలుచేశారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ పుట్లమ్మ అమ్మవారి ఆలయం

[మార్చు]

సూరేపల్లి గ్రామంలో నెలకొన్న పుట్లమ్మ తల్లి కొలుపులు, తాతావారిపాలెంలో 2014 సెప్టెంబరు 14 ఆదివారం నాడు తాతావారిపాలెంలో, వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవం నిర్వహించి భక్తులనుండి హారతులు స్వీకరించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారికి కొలువులు నిర్వహించుచున్నారు. వర్షాలు సకాలంలో కురిసి, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు, యువకులు పాల్గొన్నారు. [4

గణాంకాలు

[మార్చు]

2001 సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2653. ఇందులో పురుషుల సంఖ్య 1328, స్త్రీల సంఖ్య 1325, గ్రామంలో నివాసగృహాలు 769 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 456 హెక్టారులు.

మూలాలు

[మార్చు]
 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".