సెలీనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెలీనా
జననం
సెలీనా క్వింటనిల్లా

(1971-04-16)1971 ఏప్రిల్ 16
లేక్ జాక్సన్, టెక్సాస్, అమెరికా
మరణం1995 మార్చి 31(1995-03-31) (వయసు 23)
కార్పస్ క్రిస్టీ, టెక్సాస్, అమెరికా
మరణ కారణంతుపాకీ కాల్పులు
సమాధి స్థలంసీసైడ్ మెమోరియల్ పార్క్
కార్పస్ క్రిస్టీ, టెక్సాస్
స్మారక చిహ్నంమిరాడర్ దె లా ఫ్లోర్
ఇతర పేర్లుసెలీనా క్వింటనిల్లా పెరేజ్
విద్యాసంస్థపసిఫిక్ వెస్టర్న్ యూనివర్శిటీ
వృత్తి
  • గాయని
  • గేయ రచయిత్రి
  • నటి
  • వక్త
  • ఫ్యాషన్ డిజైనర్
  • సాంఘిక సేవకురాలు
క్రియాశీల సంవత్సరాలు1982 (1982)–1995 (1995)
జీవిత భాగస్వామి
క్రిస్ పెరేజ్
(m. 1992)
తల్లిదండ్రులు
  • అబ్రహాం క్వింటనిల్లా
  • మార్సెల్లా సమోరా
బంధువులు
  • సుజెట్ క్వింటనెల్లా (సోదరి)
  • ఎ.బి.క్వింటనెల్లా (సోదరుడు)
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
  • టేజానో
  • గ్రూపెరో
  • కంబియా
  • మెక్సికన్ కంబియా
  • మారియాచీ
  • రాంచెరా
  • బొలేరో
  • లాటిన్ పాప్
లేబుళ్ళు
  • క్యూ ప్రొడక్షన్స్
  • ఈఎంఐ లాటిన్
  • ఈఎంఐ అమెరికా
  • కేపిటల్ లాటిన్
  • యూనివర్సల్ మ్యూజిక్ లాటిన్
సంతకం

సెలీనాగా పేరొందిన సెలీనా క్వింటనెల్లా పెరెజ్ (Selena Quintanilla-Pérez) (1971 ఏప్రిల్ 161995 మార్చి 31) ఒక మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి, మోడల్, ఫాషన్ డిజైనర్, నటి, నిర్మాత. ఆమె టెజానో సంగీత మహారాణిగా (ద క్వీన్ ఆఫ్ టెజానో మ్యూజిక్) ప్రజల మన్నన పొందింది.[1] టెక్సాస్ రాష్ట్రంలో అమెరికా స్థానిక తెగ అయిన చెరోకీ మూలాలున్న తండ్రికీ, మెక్సికన్-అమెరికన్ సంగీతకారుడైన తండ్రికి జన్మించిన ఆమె ఆరేళ్ళ వయసులోనే సంగీత ప్రతిభ చాటుకుని, పన్నెండవ ఏటనే తొలి ఆల్బం విడుదల చేసింది. 1987లో ప్రతిష్టాత్మక టేజానో పురస్కారాలు సాధించడంతో ప్రాచుర్యం సాధించింది. 1990 దశకంలో స్పానిష్ మాట్లాడే దేశాల్లో పేరు సంపాదించుకుంది. తన 23 ఏట ఆమె అభిమానుల సంఘం అధ్యక్షుడైన యోలాండా అనే వ్యక్తి కాల్చిచంపింది. మరణానంతరం ఆమె జన్మదినాన్ని సెలీనా డేగా గుర్తించి స్మారక కట్టడాలు నిర్మించారు. ఆమె జీవితాన్ని సినిమగానూ తీశారు.

జీవిత విశేషాలు

[మార్చు]

కుటుంబ నేపథ్యం

[మార్చు]

సెలీనా క్వింటనిల్లా 16 ఏప్రిల్ 1971న అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో లేక్ జాక్సన్ పట్టణంలో జన్మించింది.[2] ఆమె తల్లి మార్సెల్లా సమోరా అమెరికాలోని ఆగ్నేయ ప్రాంతానికి చెందిన స్థానిక తెగ అయిన చెరోకీ మూలాలున్నది.[3] తండ్రి అబ్రహాం క్వింటనిల్లా ఒక మెక్సికన్ అమెరికన్, అతను సంగీతకారునిగా పనిచేసినవాడు.[4]

సంగీత రంగం

[మార్చు]

ఆరేళ్ళ వయసులో ఉండగానే సంగీతంలో ఆమెకున్న ప్రతిభ, సామర్థ్యం బయటపడ్డాయి.[5] సెలీనా తన 12వ యేటనే మొదటి ఆల్బమ్ విడుదల చేసింది.[6] 1987లో టేజానో సంగీత అవార్డుల సందర్భంగా ఉత్తమ గాయని పురస్కారం పొందింది. ఇది మొదలు వరుసగా 9 సంవత్సరాల పాటు ఆమె ఈ అవార్డు సాధించింది.[7] ఇఎంఐ కంపెనీతో రికార్డుల కంట్రాక్టు చేజిక్కించుకొంది. 1990 దశకంలో ఆమె ప్రసిద్ధురాలైంది. ప్రత్యేకంగా స్పానిష్ భాష మాట్లాడే దేశాలలో చాలా పేరు పొందింది.

మరణం, ప్రాచుర్యం

[మార్చు]
సెలీనా సమాధి

తన 23వ యేటనే సెలీనా హత్య చేయబడింది. సెలీనా అభిమానుల క్లబ్ ప్రెసిడెంట్ అయిన యోలాండా సాల్డివార్ (Yolanda Saldívar) అనే వ్యక్తి ఆమెను హత్య చేసింది. సాల్డివార్ ను సెలీనా బొటిక్స్ కు మేనేజరుగా నియమించిన కొన్నాళ్ళకు ఆమె అవినీతి బయటపడడంతో సెలీనా ఉద్యోగంలోంచి తొలగించింది. ఈ విషయం మీద కక్ష కట్టిన యోలాండా సెలీనాను హత్యచేసింది.[8] ఆమె మరణించిన రెండు వారాలలోనే ఆమె పుట్టిన రోజును "సెలీనా డే"గా అప్పటి టెక్సాస్‌ గవర్నర్ జార్జి బుష్ ప్రకటించాడు.[9]

ఆమె జీవిత కథ ఆధారంగా "సెలీనా" అనే చిత్రం విడుదల అయ్యింది.

మూలాలు

[మార్చు]
  1. Mitchell, Rick. "Selena". Houston Chronicle, May 21, 1995. Retrieved on February 1, 2008.
  2. Patoski 1996, p. 30.
  3. Patoski 1996, p. 20.
  4. "Selena, the Queen of Tejano Music". Legacy.com. Retrieved October 11, 2011.
  5. Hewitt, Bill (April 17, 1995). "Before Her Time". People. Vol. 43, no. 15. Retrieved January 29, 2015.
  6. Schone, Mark (October 31, 2004). "Sweet Music". Bloomberg Businessweek. Retrieved January 29, 2015.
  7. Morales, Tatiana (October 16, 2002). "Fans, Family Remember Selena". CBS News. Retrieved January 29, 2015.
  8. Reports, Wire (April 1, 1995). "Gunshot Silences Singing Sensation Selena At Age 23". Orlando Sentinel. Retrieved October 10, 2011.[permanent dead link]
  9. Orozco, Cynthia E. Quintanilla Pérez, Selena. The Handbook of Texas online. Retrieved on May 29, 2009

ఆధార గ్రంథాలు

[మార్చు]
  • Patoski, Joe Nick (1996). Selena: Como La Flor. Boston: Little Brown and Company. ISBN 978-0-316-69378-3.
"https://te.wikipedia.org/w/index.php?title=సెలీనా&oldid=3809718" నుండి వెలికితీశారు