Jump to content

సౌరభ్ సచ్‌దేవ

వికీపీడియా నుండి
సౌరభ్ సచ్‌దేవ
2019లో సౌరభ్ సచ్‌దేవా
జననం
హల్ద్వానీ, ఉత్తరాఖండ్
వృత్తినటుడు, యాక్టింగ్ కోచ్
క్రియాశీల సంవత్సరాలు2002-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటుడు, యాక్టింగ్ కోచ్
వెబ్‌సైటుhttps://theactorstruth.com/saurabh-sachdeva/

సౌరభ్‌ సచ్‌దేవ భారతీయ నటుడు.[1][2] ఆయన 2016లో విడుదలైన మెరూన్‌తో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు.[3][4] ఆయన 2018లో నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సేక్రేడ్ గేమ్స్‌లో సులేమాన్ ఇసా పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.[5][6] వెటరన్ యాక్టింగ్ కోచ్ కూడా అయిన ఆయన రానా దగ్గుబాటి, హర్షవర్ధన్ రాణే, ఫ్రీదా పింటో, వరుణ్ ధావన్, రాఘవ్ జుయల్, కుబ్రా సైత్, రిచా చద్దా, దుల్కర్ సల్మాన్, తృప్తి డిమ్రీ, అవినాష్ తివారీ, అర్జున్ కపూర్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్,[7] వాణీ కపూర్, ఆశా నేగి, శక్తి మోహన్, రిత్విక్ ధంజని, మందన కరిమిలతో సహా ఎంతోమంది బి-టౌన్ స్టార్‌లకు శిక్షణ ఇచ్చాడు.

ఆయన మన్మర్జియాన్, లాల్కప్తాన్, హౌస్‌ఫుల్ 4లలో నటించాడు. ఇటీవల నీనా గుప్తా, సంజయ్ మిశ్రా నటించిన వాద్‌లో విరోధి పాత్రలో నటించాడు.[8]

2016లో, ఆయన గుల్ అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.[9] 2017లో, ముంబైలో ఆయన స్వంతంగా శిక్షణా సంస్థ ది యాక్టర్స్ ట్రూత్,[10] థియేటర్ గ్రూప్ అంతరంగ్‌[11]లను స్థాపించాడు.

సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2017 మెరూన్ ఇన్స్పెక్టర్. ఆర్. నేగి
2018 మన్మర్జియాన్ కాకా జీ
సేక్రేడ్ గేమ్స్ సులేమాన్ ఇసా నెట్‌ఫ్లిక్స్ సిరీస్
2019 లాల్ కప్తాన్ ఆర్మీ జనరల్
హౌస్‌ఫుల్ 4 రాజ్దార్
2020 తైష్ సుఖి ZEE5 చిత్రం
రాత్ బాకీ హై రెహాన్ ముస్తఫా
2021 భూత్ పోలీస్ ఉల్లత్ బాబా డిస్నీ+ హాట్‌స్టార్ చిత్రం
2022 గుడ్ లక్ జెర్రీ మాలిక్
వధ్ ప్రజాపతి పాండే
2023 హడ్డీ ఇందర్ ZEE5 ఫిల్మ్
కాలా కల్నల్ హిమ్మత్ సింగ్ మాన్ డిస్నీ+హాట్‌స్టార్ సిరీస్
బాంబై మేరీ జాన్ సులేమాన్ "హాజీ" మక్బూల్ ప్రైమ్ వీడియో సిరీస్
జానే జాన్ అజిత్ మ్హత్రే నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్
యానిమల్ అబిద్ హక్
2024 బాడ్ కాప్ డీసీపీ ఆరిఫ్ ఖాన్ డిస్నీ+హాట్‌స్టార్ సిరీస్
పుష్ప 2 హమీద్

మూలాలు

[మార్చు]
  1. "Saurabh Sachdeva: An Actor's truth". The New Indian Express. Retrieved 2020-10-19.
  2. Praveen, S. r (2016-06-14). "Gul raises a question of priorities". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-10-19.
  3. Mankad, Himesh (2019-06-04). "Bollywood: Saurabh Sachdeva plays pivotal role in Saif Ali Khan's revenge-drama Laal Kaptaan". mumbaimirror.indiatimes.com. Retrieved 2021-01-15.
  4. "Sacred Games actor Saurabh Sachdeva: Working with Anurag Kashyap is very experimental". The Indian Express (in ఇంగ్లీష్). 2018-12-16. Retrieved 2020-10-19.
  5. "Saurabh Sachdeva: Nawazuddin is clear and honest as a performer". mid-day (in ఇంగ్లీష్). 2019-06-02. Retrieved 2020-10-19.
  6. "Saurabh Sachdeva: We have a common language of acting". mid-day (in ఇంగ్లీష్). 2019-08-30. Retrieved 2020-10-19.
  7. Chandani, Priyanka (2018-12-21). "The accidental star maker". The Asian Age. Retrieved 2020-10-21.
  8. IANS (2019-05-05). "Saurabh Sachdeva bags antagonist's role in 'Vadh'". Business Standard India. Retrieved 2020-11-18.
  9. Praveen, S. r (2016-06-14). "Gul raises a question of priorities". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-10-21.
  10. "Saurabh Sachdeva: An Actor's truth". The New Indian Express. Retrieved 2020-10-21.
  11. "For the sake of love and art". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-01-15. Retrieved 2020-10-21.